రాయబారీ హత్య కుట్ర భగ్నం చేసిన మొస్సాద్
x
మెక్సికోలో ఇజ్రాయెల్ రాయబారీ ఐనాట్ క్రాంజ్ నీగర్

రాయబారీ హత్య కుట్ర భగ్నం చేసిన మొస్సాద్

మెక్సికోలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ అధికారి స్కెచ్


మొస్సాద్.. ప్రపంచంలో దీని గురించి పరిచయం అక్కరలేదు. ఏ దేశం కోసం పనిచేస్తుందో కూడా వివరించాల్సిన పనిలేదు. దాని సాహాసాలు ప్రపంచవ్యాప్తంగా కథకథలుగా చెప్పుకుంటూ ఉంటారు.

తాజాగా అది ఇరాన్ చేసిన కుట్రను ఇలాగే భగ్నం చేసింది. మెక్సికోలో ఇజ్రాయెల్ రాయబారీగా పనిచేస్తున్న ఐనాట్ క్రాంజ్ నీగర్ ను చంపడానికి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చేసిన ప్రయత్నాలను అది వమ్ము చేసింది.

దాదాపుగా గత సంవత్సరం చివరి నుంచి ఇరాన్ విదేశీ కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్న ఈ గూఢచార సంస్థ, ఈ కుట్రను విజయవంతంగా న్యూట్రలైజ్ చేసినట్లు అమెరికా, ఇజ్రాయెల్ దేశాల అధికారులు వెల్లడించారు.

నిఘా వర్గాల నుంచి వచ్చిన సున్నితమైన సమాచారం కారణంగా మిగిలిన వివరాలు వెల్లడించడం లేదని అమెరికా అధికారులు ప్రకటించారు. కుట్ర ఎలా గుర్తించారు. ఎలా విఫలం చేశారనే దానిపై ఎలాంటి వార్తలు అందించలేదు.

రెండు సంవత్సరాలుగా తీవ్రమైన శత్రుత్వం..
గత రెండు సంవత్సరాలుగా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులకు దిగింది. తరువాత అమెరికా కూడా రంగంలోని దిగి బీ2 బాంబర్లతో దాడులు చేసింది.
దీనికి ప్రతిగా ఇరాన్ కూడా బాలిస్టిక్ మిస్సైల్స్ తో సమాధానం ఇచ్చింది. ఇందులో పదుల సంఖ్యలో సాధారణ ప్రజలు మరణించారు. యూదు, ముస్లిం మతాల వైరమే రెండు దేశాల శత్రుత్వానికి ప్రధాన కారణం.
యూదు దేశం ప్రశంసలు..
‘‘మెక్సికోలోని ఇజ్రాయెల్ రాయబారిపై దాడి చేయడానికి ఇరాన్ నేతృత్వంలోని ఉగ్రవాద నెట్ వర్క్ ను అడ్డుకున్నందుకు మెక్సికో భద్రతా యంత్రాంగానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము’’ అని టెల్ అవీవ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్, యూదు లక్ష్యాలపై ఇరాన్, దాని ప్రాక్సీల నుంచి ఉగ్రవాద ముప్పులను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ భద్రతా, నిఘా వ్యవస్థలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయని యూదు దేశం ప్రకటించింది.
మాకు ఎలాంటి సమాచారం లేదు: మెక్సికో..
మెక్సికోలోని ఇజ్రాయెల్ రాయబారీపై హత్యకు కుట్ర జరిగినట్లు ఎలాంటి ప్రయత్నం గురించి తమకు సమాచారం తెలియదని మెక్సికో విదేశాంగ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలోని దౌత్యవేత్తలను కాపాడటానికి, వారికి అన్ని రకాల భద్రతలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
మెక్సికో అధికారుల ప్రకటనకు ప్రతిస్పందనగా మెక్సికోలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ప్రతినిధి మాట్లాడారు. ఈ దేశ ప్రకటనపై ఎలాంటి వ్యాఖ్యానం ఉండదని తేల్చేశారు.
అమెరికా నిఘా పత్రాల ప్రకారం.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ఫ్ లోని హసన్ ఇజాదీ అనే అధికారి, మసూద్ రహ్నేమా అనే పేరుతో వెనిజువెలాలోకి ప్రవేశించారు. ఇరాన్ రాయబారీకి సహాయకుడిగా ఉంటూ ఇతర ఇరాన్ అధికారులతో కలిసి కుట్రను ప్రారంభించాడు.
అయితే ఈ కుట్రలను మొస్సాద్ విజయవంతంగా అడ్డుకుంది. బహుశా డ్రగ్స్ ముఠాలకు సుఫారి ఇవ్వడం ద్వారా ఇజ్రాయెల్ రాయబారీని హత్య చేయించడానికి కుట్రలు పన్ని ఉంటారనే ఊహగానాలు చెలరేగుతున్నాయి. అయితే వేటికి టెల్ అవీవ్ పూర్తిగా వివరించడం లేదు.
అమెరికా గడ్డపై ఉన్న ప్రస్తుత, మాజీ అధికారులను, ఇజ్రాయోలీలను అమెరికా గడ్డపై కూడా హత్య చేయించడానికి ఇరాన్ చాలాకాలంగా కుట్రలు పన్నుతోందని అమెరికా చాలాకాలంగా ఆరోపిస్తోంది.
Read More
Next Story