నా మనస్సు మీతోనే ఉంది: రెజా పహ్లావీ
x
రెజా పహ్లావి

నా మనస్సు మీతోనే ఉంది: రెజా పహ్లావీ

త్వరలోనే నేను మీతో ఉంటానన్న మాజీ పాలకుడి కుమారుడు


ఇరాన్ లో పరిస్థితి రోజురోజుకీ దిగజారుతున్న నేపథ్యంలో పదవీచ్యుతుడైన షా కుమారుడు రెజా పహ్లావి, అయతుల్లా అలా ఖమేనీ నేతృత్వంలోని పాలనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు కొనసాగించాలని ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.

నిరసనల కారణంగా భద్రతా యంత్రాంగాలను గణనీయంగా బలహీనపడ్డాయని అన్నారు. ఎక్స్ లో ఆయన మేరకు పోస్ట్ చేశారు. ‘‘ నా స్వదేశీయులు ’’ అని తన ఎక్స్ పోస్ట్ లో నిరసనకారులను సంబోధించారు.

భద్రతా దళాలు కూడా..
‘‘ఇస్లామిక్ రిపబ్లిక్ వీధుల్లో ఉన్న లక్షలాది మందిని ఎదుర్కోవడానికి కిరాయి సైనికుల కొరత ఉందనే నివేదికలు నాకు అందాయి. ఇప్పటి వరకూ చాలామంది సాయుధ భద్రతా దళాలు తమ కార్యాలయాలను విడిచిపెట్టాయి. లేదా ప్రజలను అణచివేయాలనే ఆదేశాలను ధిక్కరించాయి.
ఖమేనీకి ఇక మిగిలింది హింసాత్మక కిరాయి సైనికులు మాత్రమే. వారు ఇరాన్ వ్యతిరేకులు. ఇరాన్ వ్యతిరేకులు మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారు. వారు తమ చర్యలకు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని తెలుస్తోంది’’ అని పహ్లావి తన పోస్ట్ లో అన్నారు.
నిరసనకారులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా ఉండవద్దని, వారి ప్రాణాలు ప్రమాదంలో పడేసే పక్క వీధులను నివారించాలని ఆయన కోరారు. ఇరానియన్లు గొంతును విదేశాల్లో ఉన్నవారు వినిపిస్తున్నారని పహ్లావి చెప్పారు.
ఈ రోజు ప్రపంచం మీకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. ‘‘వీధులను వదిలి వెళ్లకండి. నా హృదయం మీతోనే ఉంది. నేను త్వరలో మీ పక్కనే ఉంటానని నాకు తెలుసు’’ అని పహ్లావి అన్నారు.
పెరుగుతున్న మరణాలు..
ఇప్పటి వరకూ నిరసనలలో దాదాపు 70 మంది మరణించారని ఇరాన్ ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. మానవ హక్కుల నివేదిక ప్రకారం 116 మంది మరణించారని పేర్కొన్నాయి. ఇంటర్నెట్ బ్లాక్ అవుట్ వల్ల మృతుల సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియరావట్లేదు.
ఆర్ఠిక ఆంక్షల వల్ల ఆ దేశ కరెన్సీ రియాల్ ఏకంగా 42 లక్షలకు ఒక డాలర్ కు పడిపోయింది. దీనితో దేశంలో విపరీతంగా ద్రవ్యోల్భణం ప్రబలింది. ప్రజలకు నిత్యావసరాలు దొరకడం కూడా గగనంలా మారింది. దేశంలోని 31 ప్రావిన్స్ లలో ఆందోళనలు ప్రారంభం అయ్యాయి.
మరణ శిక్ష విధిస్తాం..
ఇరాన్ ప్రభుత్వానికి, అయతుల్లాకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తే వారిని దేవుని శత్రువులుగా చూస్తామని, వారికి మరణశిక్ష విధిస్తామని అటార్ని జనరల్ హెచ్చరించారు. ఇరాన్ లో ఇప్పటికే 2600 మందిని అరెస్ట్ చేసింది. వీరందరిని ఉరి తీస్తారనే ఊహగానాలు వెల్లువెత్తాయి.
ఇరాన్ ప్రజలపై ఇలాగే అణచివేత కొనసాగితే తాము సైనిక జోక్యం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరో వైపు ఇజ్రాయెల్ సైతం హై అలర్ట్ లో ఉంది.
Read More
Next Story