ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా అనుసంధానమైన నాసా క్రూ-10
x

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా అనుసంధానమైన నాసా క్రూ-10

నలుగురు వ్యోమగాములు - మెక్‌క్లెయిన్‌, నికోల్‌ అయర్స్‌, టకుయా ఒనిషి, కిరిల్‌ పెస్కోవ్‌‌తో ఫాల్కన్‌ 9 రాకెట్‌ నిగింలోకి దూసుకెళ్లింది.


Click the Play button to hear this message in audio format

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్(Sunita williams), మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ (Butch Wilmore) తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన అనంతరం భూమికి తిరిగి రానున్నారు. వారిని తీసుకొచ్చేందుకు నాసా- స్పేస్‌ఎక్స్‌ ప్రయోగించిన క్రూ-10 మిషన్‌ (Crew-10 mission) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో విజయవంతంగా అనుసంధానమైంది. ఆదివారం ఉదయం 9: 40 గంటలకు ఈ ప్రక్రియ పూర్తయినట్లు నాసా వెల్లడించింది.

సాంకేతిక సమస్యతో ఆలస్యం..

2024 జూన్‌ 5న ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌’లో సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌ ఐఎస్‌ఎస్‌కు విషయం తెలిసిందే. వాస్తవానికి వీరు వారం రోజులకే తిరిగి భూమిని చేరుకోవాలి. అయితే స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భూమికి చేరుకోవడం ఆలస్యమైంది. ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడంతోపాటు హీలియం కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో వ్యోమగాములు తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. అప్పటి నుంచి సునీత, విల్‌మోర్‌ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు.

క్రూ-10 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు - మెక్‌క్లెయిన్‌, నికోల్‌ అయర్స్‌, టకుయా ఒనిషి, కిరిల్‌ పెస్కోవ్‌‌తో ఫాల్కన్‌ 9 రాకెట్‌ నిగింలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఫాల్కన్‌ 9 రాకెట్‌ డ్రాగన్‌ క్యాప్సుల్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఈ నలుగురు వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌ స్థానంలో పనిచేయనున్నారు.

Read More
Next Story