నెస్లే సీఈవో రొమాంటిక్ రిలేషన్.. చివరకు..
x

నెస్లే సీఈవో రొమాంటిక్ రిలేషన్.. చివరకు..

వివాహేతర సంబంధం కారణంగా ఓ పెద్ద కంపెనీ సీఈవో ఉద్యోగం ఊడింది. విచారణలో నిజమని తేలడంతో కంపెనీ చైర్మన్ కఠిన నిర్ణయం తీసుకున్నారు.


Click the Play button to hear this message in audio format

ప్రపంచంలోని అతిపెద్ద ఆహార, పానీయాల తయారీ కంపెనీ నెస్లే (Nestlé) తన సీఈవో లారెంట్ ఫ్రీక్సేను తొలగించింది. తన సబార్డినేట్‌తో ఆయనకు ఉన్న సంబంధంపై విచారణ చేపట్టిన తర్వాత కంపెనీ చైర్మన్ పాల్ బుల్కే ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఎవరీ లారెంట్ ఫ్రైక్స్..

ఫ్రాన్స్‌కు చెందిన 63 ఏళ్ల లారెంట్ ఫ్రైక్స్ నెస్లే కంపెనీలో 40 ఏళ్లు పనిచేశారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. కిరాణ దుకాణాదారులతో మాట్లాడి నెస్లే ఉత్పత్తులను అమ్మించేవారు. మార్క్ ష్నైడర్ తరువాత 2024 సెప్టెంబర్‌లో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. కంపెనీలో పనిచేసే ఓ సబార్డినేట్‌తో వివాహేతర సంబంధంలో ఉన్నారని బయటకు పొక్కడంతో కంపెనీ అంతర్గత విచారణ చేపట్టింది. వాస్తవమని తేలడంతో ఆయనపై వేటు వేశారు. సీఈఓగా కేవలం ఏడాది మాత్రమే పనిచేయడంతో ఆయన వేతనాన్ని కంపెనీ ప్రకటించలేదు. అంతకుముందున్న సీఈవో ఏడాదికి 9.6 మిలియన్ స్విస్ ఫ్రాంకులు (దాదాపు 11.9 మిలియన్ అమెరికన్ డాలర్లు)తీసుకునేవారు. అంతే జీతాన్ని ఫ్రైక్స్‌కు ఇస్తుండవచ్చని సమాచారం. ఫ్రైక్స్ వద్ద 41వేలకుపైగా షేర్లు ఉన్నాయి. వీటి విలువ సుమారు 3.6 మిలియన్ అమెరికన్ డాలర్లు. ఫ్రైక్స్ తొలగింపుపై నెస్లే చైర్మన్ పాల్ బుల్కే స్పందించారు. తన కంపెనీ నైతిక విలువలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొంటూనే.. ఫ్రైక్స్ సేవలకు ధన్యవాదాలు కూడా చెప్పారు పాల్ బుల్కే. ఇక లారెంట్ ఫ్రైక్స్ స్థానంలో కొత్త సీఈవోగా ఫిలిప్ నవ్రాటిల్ బాధ్యతలు చేపట్టారు. అనుభవజ్ఞుడైన నవ్రాటిల్ కంపెనీలో 2001 నుంచి కొనసాగుతున్నారు.

స్విట్జర్లాండ్‌లోని వెవేలో ప్రధాన కార్యాలయంగా పనిచేసే నెస్లే.. ప్రపంచంలోని అతిపెద్ద ఆహార, పానీయాల తయారీ కంపెనీలలో ఒకటి. కాఫీ, పాల ఉత్పత్తులు, మిఠాయిలను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది.

Read More
Next Story