తీవ్ర స్థాయిలో సాగుతున్న దాడులు, ప్రతిదాడులు
x

తీవ్ర స్థాయిలో సాగుతున్న దాడులు, ప్రతిదాడులు

హోరాహోరీ పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్, ఇరాన్


Click the Play button to hear this message in audio format

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం అవుతోంది. ఇటూ ఇరాన్, అటూ ఇజ్రాయెల్, అమెరికా ఎక్కడ తగ్గక పరస్పరం మిస్సైల్లు, డ్రోన్లు, వైమానిక దాడులు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇరాన్ లోని అనేక కీలక లక్ష్యాలపై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. అనేక బాలిస్టిక్ స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడుతున్నాయి.

రెండు దేశాల దాడులు ప్రతిదాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లో ఎక్కడ చూసిన ఆకాశంలోకి లేచిన భారీ పొగలే కనిపిస్తున్నాయి. ఖమేనీ మరణం తరువాత ఇప్పటి వరకూ ఇరాన్ లో దాదాపు 200 మంది ఉన్నత స్థాయి అధికారులు మరణించినట్లు ఆ దేశం ప్రకటించింది. ఈ దాడులకు తీవ్ర ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది.
ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలే లక్ష్యంగా గల్ఫ్ లోని అనేక ప్రాంతాలపైకి ఇరాన్ మిస్సైల్లు ప్రయోగించింది. ఇందులో ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందారు. మరో వైపు ఇజ్రాయెల్ లోనూ ప్రజలు బంకర్ల నుంచి బయటకు రావడం లేదు. ఇప్పటి వరకూ ఇజ్రాయెల్ లో 11 మంది మరణించారు. అమెరికా, ఇజ్రాయెల్ కీలకమైన సైనిక, రాజకీయ లక్ష్యాలను ఎంచుకుంది. ఇది పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత పెంచే అవకాశం ఉంది.

ట్రంప్ శపథం..

తమ సైనిక సిబ్బంది మరణాలకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వివాదం ముగిసే సరికి ఇంకా ఎక్కువ మంది ఉగ్రవాదులను హతమారుస్తామని అన్నారు. ‘‘నాన్ స్టాప్’’ దాడులు చేస్తామన్నా ట్రంప్, టెహ్రన్ లోని వంద లక్ష్యాలపై వందల ఫైటర్ జెట్ లతో ఒకేసారి దాడులకు దిగుతామని ఐడీఎఫ్ బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రీన్ విలేకరుల సమావేశంలో అన్నారు.

ఇరాన్ దాడులు తీవ్రతరం..

గల్ఫ్ లో ఇరాన్ ప్రతీకార దాడులు, అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలను దాటి ప్రాంతీయ సురక్షిత స్వర్గ ధామాలుగా చాలాకాలంగా చెప్పబడుతున్న ప్రాంతాల్లోకి కూడా విస్తరించాయి. గల్ఫ్ అంతటా అనేక నగరాల్లోని హెటళ్లు, విమానాశ్రయాలు, ఇతర ప్రదేశాలపై ఇరాన్ దాడులు జరిగిన తరువాత ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమన్, బహ్రెయిన్ విదేశాంగ మంత్రులు స్పందించారు. తమకు కూడా ప్రతిస్పందించే హక్కు ఉందని అన్నారు.
Read More
Next Story