ఇజ్రాయిల్‌ - హమాస్‌ యుద్ధం :  మన వారికే ఆ  అవకాశం
x
FILE

ఇజ్రాయిల్‌ - హమాస్‌ యుద్ధం : మన వారికే ఆ అవకాశం

ఇజ్రాయిల్‌లో పాలస్తీనియుల వర్క్‌ పర్మిట్‌ను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించుకోనున్నారు.


ఇజ్రాయిల్‌ - హమాస్‌ యుద్ధం నేపథ్యంలో.. ఇజ్రాయిల్‌లోని 90 వేల మంది పాలస్తీనియుల వర్క్‌ పరిట్‌ని అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. వీరి స్థానంలో కొత్తవారిని నియమించుకోనున్నారు.

ఈ అవకాశాన్ని ఇజ్రాయిల్‌ భారత్‌కు ఇచ్చింది. ఇండియా నుంచి కార్మికులను రప్పించి నియమించుకోవాలని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహ ఇటీవల నిర్మాణరంగ కంపెనీలకు సూచించారు.

ఇజ్రాయిల్‌, భారత్‌ మధ్య సత్సంబంధాలే కారణం..

ఇజ్రాయిల్‌తో భారత్‌కు సత్సంబంధాలున్నాయి. ప్రధాని మోదీ 2017లో ఇజ్రాయిల్‌ను సందర్శించారు. ఆ దేశంలో పర్యటించిన భారత ప్రధానుల్లో మొదటి ప్రధాని కూడా ఆయనే.

ఇజ్రాయిల్‌ ‌- హమాస్‌ యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ బెంజమిన్‌ నెతన్యాహకు ఫోన్‌ చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.

1992లో ఇజ్రాయిల్‌ - భారత్‌ దౌత్యపర సంబంధాల కారణంగా భారత్‌ తనకు అవసరమైన మిలటరీ హార్డ్‌వేర్‌, ఇతరత్రా యుద్ధ సామాగ్రిని దిగుమతి చేసుకుంటోంది.

‘‘మేం ఇండియాతో సంప్రదింపులు జరుపుతున్నాం. సుమారు లక్ష మంది భారతీయ కార్మికులను ఇక్కడకు రప్పించాలనుకుంటున్నాం.

-హెమ్‌ ఫిగ్లిన్‌, ఇజ్రాయిల్‌ బిల్డింగ్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌.

ఈ యేడాది మేలో భారత్‌తో ఇజ్రాయిల్‌ చేసుకున్న ఎంవోయూ ప్రకారం.. 42వేల మంది భారతీయులకు అవకాశం కల్పించనుంది. ఇందులో 38 వేల మంది భవన నిర్మాణ రంగంలో, మరో 8 వేల మందిని నర్సింగ్‌ సెక్టార్‌లోకి తీసుకోనున్నారు.

ఇజ్రాయిల్‌లో 18 వేల మంది భారతీయ కార్మికులు ఉన్నారు. అక్టోబర్‌ 7న ఇజ్రాయిల్‌పై హమాస్‌ దాడి చేయడంతో వెయ్యిమంది కార్మికులు ఆ దేశాన్ని వీడారు.

అయితే ఇజ్రాయిల్‌ ఇచ్చిన ఆఫర్‌పై భారత మంత్రిత్వ శాఖ స్పందించాల్సి ఉంది. ప్రస్తుత యుద్ధ వాతావరణ నేపథ్యంలో.. ఇజ్రాయిల్‌ ఆఫర్‌ను ఇండియల్‌ గవర్నమెంట్‌ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Read More
Next Story