ఆప్ఘనిస్తాన్ కు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ హెచ్చరిక
x
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్

ఆప్ఘనిస్తాన్ కు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ హెచ్చరిక

శాంతి, కల్లోలమా? ఏది కావాలో తేల్చుకోండన్న ఫీల్డ్ మార్షల్


ఆప్ఘనిస్తాన్- పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై పాక్ ఆర్మీ చీఫ్ తాలిబన్లకు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఆప్ఘన్లు శాంతి, కల్లోలంలో ఏదో ఒకటి ఎంచుకోవాలని అన్నారు. పాకిస్తాన్ లో దాడులు చేయడానికి ఆప్ఘన్ భూభాగాన్ని ఉపయోగిస్తున్న ఉగ్రవాదులపై వేగంగా చర్య తీసుకోవాలని కాబూల్ ను కోరారు.

తాలిబన్లకు మునీర్ హెచ్చరిక
ఇస్లామాబాద్- కాబూల్ మధ్య రెండు రోజుల కాల్పుల విరమణ జరిగిన కాసేపటికే శుక్రవారం పాక్ వైమానిక దళం మరోసారి తాలిబన్లపై దాడులకు దిగింది. ఈ దాడులలో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మరణించినట్లు పాక్ ప్రకటించగా, అమాయక ప్రజలు మృతి చెందినట్లు కాబూల్ వెల్లడించింది.
ఖైబర్ ఫంక్తూన్ ఖ్వాలోని అబోటాబాద్(లాడెన్ ను అమెరికా నేవీ సీల్స్ హతమార్చిన పట్టణం) లోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ కాకుల్ లో జరిగిన ఆర్మీ క్యాడెట్ల స్నాతకోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్ఘన్లు శాంతి- కల్లోలంలో ఏది కావాలో తేల్చుకోవాలని తనకు అలవాటైన వాచాలత్వంతో మాట్లాడాడు.
పాకిస్తాన్- ఆఫ్ఘన్ ఘర్షణ
ఉత్తర వజీరిస్తాన్ లోని ఒక సైనిక స్థావరంపై ఉగ్రవాదులు తుపాకీ, బాంబుదాడులతో దాడి చేసింది. ఈ దాడికి తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ కు చెందిన హఫీజ్ గుల్ బహదూర్ వర్గం తమ పనే అని ప్రకటించింది. దోహాలో కాబూల్- ఇస్లామాబాద్ మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన సందర్భంలో ఈ దాడి జరగింది.
పాక్ మీద దాడులు చేస్తున్న టీటీపీ ఉగ్రవాదులు తిరిగి ఆప్ఘన్ కు వెళ్లిపోతున్నారు. కాబూల్ తన భూభాగాన్ని ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి ఉపయోగించుకోకూడదని పాక్ ప్రధాన డిమాండ్.
అయితే తాలిబన్లు వీటిని ఖండిస్తున్నారు. ఆప్ఘన్ భూభాగాన్ని ఎలాంటి ఉగ్రవాదులకు కేంద్రంగా లేదని ప్రకటించారు. టీటీపీ ఉగ్రవాదులు కూడా స్వయంగా తాము పాక్ కేంద్రంగా నే పోరాడుతున్నట్లు ప్రకటించారు. టీటీపీ చీఫ్ తాను పాకిస్తాన్ లో ఉన్నానని ఆప్ఘన్ నుంచి దాడి చేయటేదని ఆడియో విడుదల చేశాడు.
టీటీపీ పాక్ సైన్యమే లక్ష్యంగా వరుసగా దాడులకు పాల్పడుతోంది. ఖైబర్ ఫంక్తూన్ ఖ్వాలోని చాలా ప్రాంతాలలో దాని ఉనికి నామమాత్రమే. వీరంతా పస్తూన్ తెగకు చెందిన వారు. వీరంతా ఆప్ఘన్ లో కలవాలని కోరుకుంటున్నారు.
ఇటీవల ఒరాక్జాయ్ జిల్లాలో టీటీపీ చేసిన దాడుల వల్ల లెప్టినెంట్ కల్నల్, మేజర్ సహ 11 మంది పాక్ సైనికులు మరణించారు. దీనితో రెండు దేశాల మధ్యసైనిక ఘర్షణ ప్రారంభం అయింది.


Read More
Next Story