ఎయిర్ స్పేస్ ను మూసివేసిన పాకిస్తాన్
x
భారత వైమానిక దాడులు జరిపిన పాక్ ఎయిర్ బేస్ లు

ఎయిర్ స్పేస్ ను మూసివేసిన పాకిస్తాన్

భారత వైమానిక దళం దాడుల నేపథ్యంలో నిర్ణయం


పాకిస్తాన్ పై భారత్ వైమానిక దాడులు చేసిన నేపథ్యంలో పాక్ తన గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ ఎయిర్ పోర్ట్ అథారిటీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం తెల్లవారుజామున 3.15 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అన్ని రకాల విమాన రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది.

పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెప్టినెంట్ జనరల్ అహ్మాద్ షరీఫ్ చౌదరి తెల్లవారుజామున 4 గంటలకు ఇస్లామాబాద్ లోని హడావిడిగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన నూర్ ఖాన్(చక్లాలా, రావల్పిండి), మురిద్(చక్వాల్), రఫికీ(ఝాంగ్ జిల్లాలని షోర్కోట్) స్థావరాలపై భారత్ దాడి చేసిందని పేర్కొన్నారు.
అయితే ఈ దాడుల్లో వైమానిక దళానికి ఎటువంటి నష్టం జరగలేదని, అన్ని ఫైటర్ జెట్లు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. భారత ఫైటర్ జెట్లు గగనతలం నుంచి ఉపరితలానికి క్షిపణులను ప్రయోగించిందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థ అనేక క్షిపణులను అడ్డగించిందని ఆయన పేర్కొన్నారు.
భారత్ దక్షిణాసియా ప్రాంతాన్ని యుద్దంలోని నెడుతోందని, దుర్మార్గపు చర్యలు చేపడుతోందని, పాక్ ఈ దాడులకు స్పందించి తీరుతుందని అన్నారు. భారత్ తమ ప్రతిస్పందన కోసం వేచిచూడాలని హెచ్చరికలు జారీ చేశారు.
ఆయన ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. హఠాత్తుగా విలేకరుల సమావేశం ముగించి వెళ్లాడు. సమావేశం ముగిసిన కొద్దిసేపటి తరువాత అధికారిక పీటీవీలో భారత్ పైకి, పాక్ క్షిపణులు ప్రయోగించి దాడులు చేసినట్లు వార్తలు ప్రసారం అయ్యాయి.
పహల్గామ్ కు ప్రతిదాడి..
పహల్గామ్ లోని బైసారన్ గడ్డి మైదానంలో ఉన్న నిరాయుధుల పర్యాటకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు మతం అడిగి కాల్చి చంపారు. చంపిన విషయాన్ని వెళ్లి మోదీకి చెప్పుకోమని వికృత సమాధానాలు చెప్పి పారిపోయారు. దీనికి సమాధానంగా భారత్, పాకిస్తాన్ లోని 9 ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.
ఈ దాడులకు ప్రతిగా పాకిస్తాన్, భారత్ లోని జనవాసాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. వీటికి తోడు తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే పీఐబీ వీటిని ఎప్పటికప్పుడూ ఎండగడుతోంది.
ఈ రోజు కూడా భారత్ కు చెందిన ఫైటర్ జెట్ ను కూల్చినట్లు, మహిళా ఫైటర్ ను సజీవంగా పట్టుకున్నట్లు ప్రచారం చేసుకుంది. అలాగే ఎస్- 400 ను కూల్చివేసినట్లు కూడా గొప్పలు చెప్పుకుంది. అయితే వీటిని రక్షణ శాఖ ఖండించింది. అన్ని వ్యవస్థలు సక్రమంగా ఉన్నాయని ఫొటోలు సైతం ప్రదర్శించింది.
Read More
Next Story