
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
‘‘పాకిస్తాన్ నిత్యం అణు పరిజ్ఞానాన్ని సానబెడుతోంది’’
రష్యా, చైనా, ఉత్తర కొరియా అదే పనిచేస్తున్నాయని ఆరోపించిన ట్రంప్
అమెరికా సైన్యానికి అణు పరీక్షలు నిర్వహించే ఆదేశాలు జారీ చేయడంపై ట్రంప్ తనను తాను సమర్థించుకున్నారు. పాక్ తో పాటు ఇతర దేశాలు నిత్యం అణ్వాయుధాలను పరీక్షించుకుంటున్నాయని అన్నారు. అందుకే అదే పని అమెరికా చేస్తుందని చెప్పుకొచ్చారు.
ప్రపంచంలోని అణ్వాయుధ దేశాలైన పాకిస్తాన్ తో పాటు చైనా, రష్యా, ఉత్తరకొరియా నిత్యం తమ అణ్వాయుధాలను సానబెట్టుకుంటున్నాయని విమర్శించారు. ఇక నుంచి వాషింగ్టన్ కూడా అదే దారిలో నడవాలని తాను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
రష్యా, చైనా రహస్యంగా ఈ పరిశోధనలు చేస్తున్నాయని, కానీ వాటి గురించి వార్తలు రాసే విలేకరలు అక్కడ లేరని ట్రంప్ అన్నారు. కానీ అమెరికా బహిరంగ సమాజం అవటం వల్ల అన్ని నిర్ణయాలు గోప్యంగా ఉంచలేమని వివరించారు.
‘‘వారు పరీక్షిస్తారు. ఇతర అణ్వాయుధ దేశాలు పరిక్షీస్తాయి. కచ్చితంగా ఉత్తర కొరియా, పాకిస్తాన్ పరీక్షలు నిర్వహిస్తోంది’’ అని ట్రంప్ అన్నారు. ఇవి భూగర్భంలో చాలా లోతైన సొరంగాలలో పరీక్షలు నిర్వహిస్తున్నాయని, ప్రజలకు తేలికపాటి కంపనాలు మాత్రమే భరిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ఆరోపించారు.
‘‘వారు భూగర్భంలో పరీక్షిస్తారు. అక్కడ పరీక్షతో ఏమి జరిగుతుందో ప్రజలకు కచ్చితంగా తెలియదు. మీకు కొంచెం కంపనాలు మాత్రమే కనిపిస్తాయి. వారు పరీక్షిస్తున్నారు. మేము పరీక్షించము. మనం పరీక్షించాలి’’ అని ట్రంప్ అన్నారు.
పుతిన్ అణు పరీక్ష ప్రకటన..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల అణు శక్తితో నడిచే వ్యవస్థలను పరీక్షించినట్లు ప్రకటించారు. అందులో పోసిడాన్ వంటి అడుగున డ్రోన్ ను పరీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిని ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్ అణు పరీక్షలు జరపని ఏకైక దేశంగా అమెరికా ఉందని చెప్పారు.
ప్రపంచాన్ని 150 సార్లు పేల్చివేయగల అణ్వాయుధాలు తమ దేశంలో ఉన్నాయని, సంఖ్యాపరంగా చూస్తే అది ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు అన్నారు.
అణు విస్ఫోటనాలు కాదు..
అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్ అణుపరీక్షలపై స్పందించారు. తమ దేశంలో అణ్వాయుధాలను పరీక్షించడంలో అణు విస్ఫోటనాలు ఉండవని స్పష్టం చేశారు. ఈ పరీక్షలలో నాన్ క్లిష్టమైన పేలుళ్లు మాత్రమే ఉంటాయని అన్నారు.
ఈ పరీక్షలో అణు పేలుడును ఏర్పాటు చేసే అణ్వాయుధంలోని అన్ని ఇతర భాగాలు కూడా ఉంటాయని రైట్ చెప్పారు. పాత వాటి కంటే అవి మెరుగ్గా పనిచేస్తాయని నిర్ధారించుకోవడానికి కొత్త వ్యవస్థలు పరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు.
Next Story

