
పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ లో నిరసన ప్రదర్శన చేస్తున్న కశ్మీరీలు
రణరంగంగా పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్
ఉద్యమకారులపై పాక్ ఆర్మీ కాల్పులు, 12 మంది మృతి, 200 మందికి గాయాలు
పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ ప్రజలు చేస్తున్న ఉద్యమం పై పాక్ సైన్యం దాష్టీకాలు కొనసాగుతున్నాయి. నిరసనకారులపై పాక్ ఆర్మీ కాల్పులు జరపడంతో కనీసం 12 మంది చనిపోయినట్లు సమాచారం.
కొన్ని వార్తా కథనాల ప్రకారం.. బాగ్ జిల్లాలోని ధిర్ కోట్ లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ముజఫరాబాద్ లో మరో ఐదుగురు మరణించారు. మీర్పుర్ లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కనీసం 200 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. ఘర్షణలో ముగ్గురు పోలీసులు కూడా మరణించినట్లు పాక్ ప్రకటించింది. మరో తొమ్మిది మంది గాయపడ్డారు.
అతిపెద్ద నిరసన..
ఇటీవల సంవత్సరాలలో పీఓజేకేలో జరిగిన అతిపెద్ద నిరసన ఇదే. ఈ ఉద్యమానికి జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ లీగ్ యాక్షన్ కమిటీ నాయకత్వం వహించింది.
నిరసనకారులు పాక్ ప్రభుత్వం ముందు 38 డిమాండ్లను ప్రతిపాదించారు. కానీ వాటిని పాక్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యమం ఉధృతంగా ప్రారంభం అయింది.
కానీ వీటిపై సైన్యం కర్కశంగా దాడి చేసి అణచివేయడానికి ప్రయత్నిస్తోంది. రోజువారీగా నిరసన కార్యక్రమాలు ఉన్నప్పటికీ ముజఫరాబాద్ కు వెళ్తున్న లాంగ్ మార్చ్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో పాక్ సైన్యం చేస్తున్న ఆక్రమణలు వెంటనే తొలగించాలని కూడా నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు నిరసనను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ముజఫరాబాద్ వంతెనపై నిలిపి ఉంచిన పెద్ద షిప్పింగ్ కంటైనర్లను దిగువన ఉన్న నదిలోకి తోసివేశారు. డజన్ల కొద్ది నిరసనకారులు కంటెనర్లను వంతెన నుంచి కిందికి తోస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి.
హింసాత్మక చర్యలు..
పీఓకే లో జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని పాక్ సైన్యం హింసాత్మక చర్యలో అణిచి వేయడానికి ప్రయత్నిస్తోంది. భద్రతా దళాలు జనసమూహాన్ని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్, లైవ్ మందుగుండు సామగ్రిని ప్రయోగిస్తున్నాయి. పెరుగుతున్న అశాంతికి ప్రతిస్పందనగా పంజాబ్, ఇస్లామాబాద్ నుంచి వేలాది అదనపు బలగాలను రప్పించారు.
38 డిమాండ్లు ఏంటీ..
పాకిస్తాన్ జమ్మూకశ్మీర్ లోని భూభాగాన్ని ఆక్రమించిన తరువాత కొన్ని కీలక చట్టాలు చేసింది. పీఓజేకే నుంచి పాక్ లోకి వచ్చిన వారి కోసం స్థానిక అసెంబ్లీలో 12 స్థానాలను రిజర్వ్ చేసింది. వీటిని వెంటనే తొలగించాలని కోరింది. ఇది స్థానిక పాలనను బలహీనపరుస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
‘‘70 సంవత్సరాలకు పైగా మా ప్రజలను పాక్ ప్రాథమిక హక్కులను నిరాకరిస్తోంది. మా హక్కులను మాకు ఇవ్వండి.. లేదా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొండి’’ అని జేఏసీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ మీడియాతో అన్నారు.
ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి మీర్ అల్టిమేటం జారీ చేశారు. కొనసాగుతున్న ఉద్యమం కేవలం మొదటి దశ ప్లాన్ ఏ అని, ఇది ప్రజల అసహనం బయటకు తెచ్చిందని, జేఏఏసీ వద్ద బలమైన ప్లాన్ డీ ఉందని హెచ్చరించాడు.
ఇందులో ఆకస్మిక వ్యూహాలు ఉన్నాయని చెప్పారు. ముజఫరాబాద్ లో జరిగిన ఘోరమైన కాల్పులకు మద్దతు ఇస్తున్న ముస్లిం కాన్ఫరెన్స్ ను అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని డిమాండ్ చేశాడు.
ఈ సంస్థ పాకిస్థాన్ నిఘా, ఐఎస్ఐ కు మద్దతు ఇస్తోందని అన్నారు. హింసలో మరణించిన వారికి ఆర్థిక పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా జేఏఏసీ డిమాండ్ చేసింది.
స్తంభించిన పీఓజేకే..
సెప్టెంబర్ 29 న ప్రారంభమైన నిరసనలతో మార్కెట్లు, దుకాణాలు, స్థానిక వ్యాపారాలు అన్ని స్తంభించిపోయాయి. నిరసనలతో ఈ ప్రాంతం రోజువారీ జీవితం స్తంభించిపోయింది. అధికారులు మొబైల్, ఇంటర్నేట్, ల్యాండ్ లైన్ సేవలను పూర్తిగా నిలిపివేశారు.
ఇస్లామాబాద్ ఏం అంటుంది..
పీఓజేకే లో తీవ్రమవుతున్న నిరసనలకు ఇస్లామాబాద్ బలప్రదర్శనతో సమాధానం ఇస్తోంది. పాకిస్తాన్ వార్తా సంస్థల ప్రకారం.. భారీగా సాయుధ దళాలు పీఓజేకే వైపు కదులుతున్నాయి.
స్థానిక పట్టణాలలో సైనికులు ప్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. పంజాబ్ నుంచి వేలాది సైనికులను హుటాహుటిని పాక్ ప్రభుత్వం తరలించింది. రాజధాని నుంచి వెయి మంది సైనికులను ముజఫరాబాద్ పంపారు.
అంతర్జాతీయ సమాజం స్పందించాలి
ఈ ఆందోళనలపై యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ ప్రతినిధి నాసిర్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ.. యూఎన్ఓ, అంతర్జాతీయ సమాజం అత్యవసరంగా జోక్యం చేసుకుని సంక్షోభాన్ని పరిష్కరించాలని పిలుపునిచ్చారు.
జెనీవాలో జరిగిన యూఎన్ మానవ హక్కుల మండలి 60 వ సమావేశంలో ఖాన్ మాట్లాడుతూ.. పీఓజేకేలో మానవతా సంక్షోభం గురించి హెచ్చరించాడు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం.. సభ్య దేశాల బాధ్యతలను గుర్తు చేశాడు.
గతవారం ఖైబర్ ఫంక్తూన్ ఖ్వా లో జరిగన విషాదం తరువాత ఈ తీవ్రత పెరిగింది. పాక్ ఇక్కడ సాధారణ ప్రజలపై జరిపిన వైమానిక దాడుల్లో 30 మంది సాధారణ ప్రజలు మరణించారు. ఇందుకోసం చైనా మేడ్ జేఎఫ్-17 ఫైటర్ జెట్ లలో ఎల్ఎస్-6 లేజర్ గైడెడ్ బాంబులు వాడారు.
Next Story