పాకిస్తాన్: గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ట్విస్ట్.. తాంబా ఇంకా..
పాకిస్తాన్ లో భారత వ్యతిరేక శక్తులను టార్గెట్ చేసి హతమారుస్తున్న అన్ నోన్ గన్ మ్యాన్ లకు తొలిసారి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..
పాకిస్తాన్ లో జరుగుతున్న వరుస హత్య విషయంలో మరో ట్విస్ట్. లాహోర్ డాన్, 2013లో సరబ్ జిత్ సింగ్ ను హత్య చేసిన తాంబాను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం తుఫాకీతో కాల్చి హత్య చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే పాకిస్తాన్ పంజాజ్ కు చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. తాంబా ఇంకా బతికే ఉన్నాడని, గాయాలు తీవ్రంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు.
లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సన్నిహితుడైన తంబాపై లాహోర్‌లోని సనత్ నగర్‌లో గల అతని నివాసం వద్ద మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు దాడి చేసినట్లు ఆదివారం సాయంత్రం వార్తలు వచ్చాయి. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.
ఎస్ఎస్పీ ప్రకటన
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP), ఆపరేషన్స్, లాహోర్, సయ్యద్ అలీ రజా డాన్ వార్తాపత్రికతో మాట్లాడుతూ, "తాంబ ఇంకా బతికే ఉన్నాడు కానీ తీవ్రంగా గాయపడ్డాడు". అయితే,ప్రస్తుతం అతడిని ఎక్కడ ఉంచి చికిత్స అందిస్తున్నారో మాత్రం వివరాలు వెల్లడించలేదు. సోమవారం SSP ప్రకటన గురించి జాతీయ పత్రిక ఒకటి లాహోర్ పోలీసు ప్రతినిధి ఫర్హాన్ షాను సంప్రదించి వివరాలు కోరగా అతను నిరాకరించాడు. ఈ విషయం అత్యంత సున్నితమైందని వివరాలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు.
భారత్ హస్తం ఉండొచ్చు.. పాక్ అనుమానం..
తంబా హత్యలో భారత్ హస్తం ఉందనే అంశాన్ని పాక్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ తోసిపుచ్చలేదు. ‘‘గతంలో ఇక్కడ జరిగిన కొన్ని హత్య ఘటనల్లో భారత్ కు ప్రత్యక్షంగా ప్రమేయం ఉంది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. తాంబా కేసులో భారత్ ప్రమేయం ఉందని, లేదని చెప్పడం సబబుగా ఉండదు. భారత్ ప్రమేయం మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది పాత హత్యల సిగ్నేచర్ లోనే ఉంది. ”అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ కూడా అయిన నఖ్వీ సోమవారం లాహోర్‌లో విలేకరులతో అన్నారు.
తంబా హత్య
ఓల్డ్ లాహోర్‌లోని దట్టమైన జనసాంద్రత ప్రాంతమైన సనత్ నగర్‌లోని అతని నివాసంలో ఇద్దరు ముష్కరులు ఆదివారం మధ్యాహ్నం తంబాను కాల్చి చంపారు. తంబా రక్తంతో తడిసిన అతని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తంబ తమ్ముడు జునైద్ సర్ఫరాజ్ ఫిర్యాదు మేరకు ఇద్దరు గుర్తుతెలియని దుండగులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సరబ్‌జిత్‌పై దాడి
తాంబా, అతని సహచరుడు ముదస్సర్ ఇద్దరు 2013లో లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్న సరబ్ జిత్ సింగ్ (49)పై దాడి చేసి హత్య చేశారు.సింగ్ హత్య కేసులో 2018లో పాకిస్తాన్ కోర్టు వారిద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది. వారికి వ్యతిరేకంగా “సాక్ష్యం లేవు” అని కేసు కొట్టివేసింది. ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో లాహోర్ సెషన్స్ కోర్టు తీర్పును ప్రకటించింది.
న్యాయం కోసం కుటుంబం పోరాటం
1990లో పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వరుస బాంబు పేలుళ్లలో పాల్గొన్నందుకు సింగ్‌కు మరణశిక్ష విధించినట్లు పాకిస్తాన్ కోర్టు తీర్పునిచ్చాయి. అయితే, అదంతా బూటకమని సరబ్ జిత్ సింగ్ కుటుంబం తెలిపింది. సరిహద్దుకు ఆవల తమకు భూములు ఉన్నాయని, వ్యవసాయం వెళ్లిన తమ తమ్ముడు హఠాత్తుగా ఒక రోజు కనిపించకుండా పోయారని సింగ్ అక్క దల్బీర్ కౌర్ తెలిపింది. అతడిని విడుదల చేసేందుకు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసింది. కానీ విజయం సాధించలేకపోయింది.
Next Story