పార్లమెంట్ ను పునాదులతో సహ పెకిలిస్తాం: పన్నూ బెదిరింపు
x
గురుపత్వంత్ సింగ్ పన్నూ

పార్లమెంట్ ను పునాదులతో సహ పెకిలిస్తాం: పన్నూ బెదిరింపు

భారత పార్లమెంట్ ను పునాదులతో సహ పెకిలించి వేస్తామని నిషేధిత సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించారు.


డిసెంబర్ 13, 2001 న దాడి చేసిన తేదీనే తాము దాడి చేస్తామని మరోమారు బెదిరింపులో కూడిన వీడియోను విడుదల చేశాడు. దీంతో పార్లమెంట్ పరిసరాల్లో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరుగుతున్నాయని, అందుకే ప్రతి అంశాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తున్నామని, ముందు జాగ్రత్తగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.

భారత్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం.. అమెరికా

సిఖ్ వేర్పాటువాద నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్రలో భారతీయ అధికారి ప్రమేయం ఉందన్న ఆరోపణపై న్యూఢిల్లీ దర్యాప్తు కోసం ఎదురు చూస్తున్నామని అమెరికా ప్రకటించింది. ఈ సమస్యను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రభుత్వంలోని చాలా సీనియర్ వ్యక్తులు ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నారని, భారత విదేశాంగ అధికారితో చాలా రోజుల క్రితమే ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించినట్లు తెలిపారు. దర్యాప్తు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడించారు.

అమెరికా లో నివసిస్తున్న సిఖ్ వేర్పాటువాద నేత గురుపత్వంత్ సింగ్ ను హత్య చేయడానికి మనోజ్ గుప్తా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని వాషింగ్టన్ భారత్ పై అభియోగాలు మోపింది. ఈ కుట్రను భారత్ ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంది. ఒక ఉన్నత స్థాయి ప్యానెల్ కమిటీని నియమించి దర్యాప్తు చేస్తున్నట్లు, నివేదిక అందిన తరువాత తదుపరి చర్య తీసుకుంటామని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రకటించారు.

Read More
Next Story