భారత్ పై మరోసారి నోరు పారేసుకున్న పీటర్ నవారో
x
పీటర్ నవారో

భారత్ పై మరోసారి నోరు పారేసుకున్న పీటర్ నవారో

రష్యాతో కాదు.. అమెరికా వైపు మోదీ నిలబడాలని సూచన


షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ లతో ప్రధాని మోదీ కలవడం సిగ్గుచేటని అమెరికా ఆర్థికవేత్త, ట్రంప్ వాణిజ్య సలహదారు పీటర్ నవారో విమర్శించారు. అమెరికాను కాదని రష్యా, చైనాలతో భారత్ సంబంధాలపై తన విమర్శలను తీవ్రతరం చేశాడు.

అంతకుముందు నవారో భారత్ ను సుంకాల మహారాజుగా అభివర్ణించాడు. న్యూఢిల్లీ ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో కొన్నింటిని అత్యంత తీవ్రమైన సుంకాలను విధిస్తుందని, దానిని తొలగించడానికి నిరాకరిస్తుందని ఆరోపించాడు.
దుమారం రేపిన పుతిన్- షీ- మోదీ సమావేశం..
‘‘మోదీ, పుతిన్- షీ లతో జతకట్టడం సిగ్గుచేటు. ఆయన ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. రష్యాతో కాదు. మనతో(అమెరికా) నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన గ్రహిస్తారని మేము ఆశిస్తున్నాము’’ అని నవారో వ్యాఖ్యానించారు. ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి మోదీ, చైనా పర్యటనకు వచ్చిన ఒకరోజు తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఆయన పుతిన్, జిన్ పింగ్ తో చర్చలు జరిపారు.
భారత్, రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను కొనసాగించడంపై నవారో పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. ఉక్రెయిన్ లో పుతిన్ యుద్ధానికి ఆర్థిక సాయం చేస్తున్నారని వైట్ హౌజ్ వాదిస్తోంది. ట్రంప్ భారత్ పై సుంకాలు విధించినప్పటికీ మాస్కో నుంచి మాత్రం చమురు దిగుమతులు ఆపడం లేదు.
సుంకాల మహారాజు..
ట్రంప్ ఆర్థిక సలహాదారు నవారో గతంలో భారత్ ను సుంకాల మహారాజుగా అభివర్ణించారు. ప్రపంచంలో ఏ దేశం కూడా అమెరికా వస్తువులపై ఇంత పెద్ద మొత్తంలో పన్నులు విధించడం లేదని ఆయన విమర్శిస్తున్నారు.
వాటిని తొలగించడానికి న్యూఢిల్లీ నిరాకరిస్తోందని ఆయన ఆరోపించారు. ‘‘భారత్ తో రెండు వైపులా సమస్య ఉంది. ఇరవై అయిదుశాతం పరస్పరం అన్యాయమైన వాణిజ్యం కారణంగా, మరో ఇరవై అయిదు శాతం రష్యాతో వాణిజ్యం కారణంగా పన్నులు విధించాం’’ అని నవారో సమర్థించుకున్నారు.
ఈ ఆరోపణలకు మరింత పదును పెడుతూ.. ఆయన నిన్న కులఆధారిత వ్యాఖ్యలు సైతం చేశారు. రాయితీపై రష్యన్ చమురు కొనుగోళ్ల ద్వారా బ్రాహ్మణులు సాధారణ భారతీయుల ఖర్చుతో లాభపడుతున్నారని ఆరోపించారు.
క్రెమ్లిన్ కోసం లాండ్రోమాట్..
భారత్ క్రిమ్లిన్ కోసం లాండ్రోమాట్ గా వ్యవహరిస్తుందని, భారత శుద్ది కర్మాగారాలు చౌకైన రష్యన్ ముడి చమురును కొనుగోలు చేసి దానిని ప్రాసెస్ చేసి అధిక లాభంతో ఎగుమతి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘‘రష్యా, ఉక్రేనియన్లను చంపుతుంది. పన్ను చెల్లింపుదారులను మనం ఏం చేయాలి? మనం వారికి ఎక్కువ డబ్బు పంపాల్సి వస్తోంది’’ అని నవారో అన్నారు.
భారత దిగుమతులపై ట్రంప్ విధించిన శిక్షాత్మక సుంకాలను ఆయన సమర్థించుకున్నారు. మాస్కో, బీజింగ్ తో న్యూఢిల్లీకి ఉన్న సాన్నిహిత్యం ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు.
భారత్ వైఖరి..
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ సమర్ధించుకుంది. ఇంధన ధరలను స్థిరంగా నిలపడానికి, మార్కెట్ ను స్థిరీకరించడానికి అవి అవసరమని ప్రకటించింది. యూఎస్ చర్యలు అసమంజసమైనవని పేర్కొంది. రష్యా నుంచి చైనా ఎక్కువ మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్నట్లు గణాంకాలను బయటపెట్టింది.
భారత్ చారిత్రాత్మకంగా ప్రధానంగా మధ్యప్రాచ్యం నుంచి చమురును దిగుమతి చేసుకునేదీ. 2022 లో రష్యా - ఉక్రెయిన్ వివాదం తరువాత రష్యా నుంచి చమురు దిగుమతులు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా ఒడిదుడుకులు ఏర్పడకుండా మాస్కో చమురు ఆదాయాలను పరిమితం చేయడానికి జీ7 దేశాలు బ్యారెల్ కు 60 డాలర్ల ధరకు పరిమితిన విధించాయి.
ప్రపంచ ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి వాషింగ్టన్ ప్రారంభంలో రష్యా చమురు దిగమతులను చురుకుగా ప్రొత్సహించిందని ఎంఈఏ పేర్కొంది.
Read More
Next Story