భూటాన్ పర్యటనకు ప్రధాని మోదీ
x

భూటాన్ పర్యటనకు ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ హిమాలయ దేశమైన భూటాన్ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో కొన్ని కీలక అంశాలను చర్చించే అవకాశం ఉంది. అవేంటంటే..


హిమాలయ దేశం భూటాన్ తో భారత్‌కు ఉన్న ప్రత్యేక సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం భూటాన్ రాజధాని థింపు చేరుకున్నారు. ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు భారత్ అనుసరిస్తున్న 'నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ'లో భాగంగా ప్రధాని ఈ పర్యటనకు వెళ్లారు.

ప్రధాని గురువారమే ఈ పర్యటనకు బయలుదేరాల్సి ఉండగా హిమాలయ దేశంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా పడింది.
భారత్-భూటాన్ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన పలు కార్యక్రమాలకు తాను హాజరవుతానని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధాని మోదీ ఇంతకుముందు తెలిపారు.
"నేను భూటాన్ రాజు, అతని మెజెస్టి నాల్గవ డ్రక్ గ్యాల్పో, ప్రధాన మంత్రి @tsheringtobgayతో చర్చల కోసం ఎదురుచూస్తున్నాను" అని ఆయన ట్వీట్ చేశారు. కాగా మోదీ 2014 లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదట పర్యటించిన దేశం భూటానే.
కాాగా ఈ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇందులో అస్సాం రాజధాని గువాహాటీి నుంచి తవాంగ్ చేరుకోవడానికి రెండో మార్గాన్ని భూటాన్ మీదుగా నిర్మించాలని న్యూఢిల్లీ కోరుకుంటోంది. దీనిపై చర్చలు జరిగే అవకాశం ఉంది. అలాగే డోక్లాం పీఠభూమి ప్రాంతానికి అనుకుని ఉన్నా భూటాన్ భూభాగాన్ని చైనా తనకు ఇవ్వాలని థింపు నాయకత్వంపై ఒత్తిడి చేస్తోంది. అందుకు బదులుగా తనదగ్గర ఉన్న రెండు ప్రాంతాలను భూటాన్ ఇస్తానని ప్రతిపాదిస్తోంది. ఇది అమల్లోకి వస్తే మన చికెన్ నెక్ కు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. దీనిపై ఇరుదేశాలు చర్చించే అవకాశం ఉంది.


Read More
Next Story