ఇటలీ చేరుకున్న ప్రధాని
x

ఇటలీ చేరుకున్న ప్రధాని

ప్రధాని మోదీ ఇటలీ చేరుకున్నారు. దక్షిణ ఇటలీ అపులియాలో బోర్గో ఎగ్ణాజియా రిస్టార్టులో రేపు జరుగుతున్న జీ7 సమ్మిట్ ఔట్ రీచ్ సెషన్‌లో ఆయన ప్రసంగించనున్నారు.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటలీ చేరుకున్నారు. దక్షిణ ఇటలీ అపులియాలో బోర్గో ఎగ్ణాజియా రిస్టార్టులో రేపు జరుగుతున్న జీ7 సమ్మిట్ ఔట్ రీచ్ సెషన్‌లో ఆయన ప్రసంగించనున్నారు. మూడో సారి ప్రధాని అయ్యాక మోదీకి ఇదే తొలి విదేశీ పర్యటన.

ఎవరెవరు హాజరవుతున్నారు?

జూన్‌ 14న తమ దేశంలో జరగనున్న 50వ జీ-7 సమ్మిట్‌కు హాజరుకావాలని ఇటలీ భారత్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ముందుగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ అయిన తర్వాత ఇతర దేశాల నేతలతో కూడా కలిసే అవకాశం ఉంది.

సదస్సులో పాల్గొనేందుకు అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, కెనడా, జర్మనీ, జపాన్‌ దేశాధినేతలు ఇప్పటికే ఇటలీకి చేరుకున్నారు. జీ7 కూటమిలో అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ వార్షిక సమావేశానికి భారత్‌తో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని 11 అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలను ఇటలీ ఆహ్వానించింది.

జీ7 చర్చల్లో కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా, గ్లోబల్‌ సౌత్‌ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు సమాచారం.

భారతదేశం గత సెప్టెంబర్‌లో న్యూ ఢిల్లీలో G20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే.

Read More
Next Story