జెలెన్ స్కీకి సాదర స్వాగతం పలికిన బ్రిటన్ ప్రధాని
x

జెలెన్ స్కీకి సాదర స్వాగతం పలికిన బ్రిటన్ ప్రధాని

ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో యూరప్ తన దారి తాను చూసుకుంటుందా?


వైట్ హౌజ్ లో ఘోర అవమానం తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ శనివారం బ్రిటన్ చేరుకున్నారు. ఆయనకు ప్రధాని కీర్ స్టార్మర్ స్వాగతం పలికి ఆలింగనం చేసుకున్నాడు.

ఉక్రెయిన్ కు తమ సంపూర్ణ మద్దతు ఉందని అన్నారు. టెన్ డౌనింగ్ స్ట్రీట్ లో ఉన్న తనకు మద్దతుగా నినాదాలు చేస్తున్న ప్రజల మధ్య నడుకుంటూ వచ్చిన జెలెన్ స్కీని, స్టార్మర్ ఆలింగనం చేసుకున్నారు . అనంతరం ఇరువురు నేతలు యూరోపియన్ నాయకులతో సమావేశం అయ్యారు.

సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం: యూకే
జెలెన్ స్కీ- ట్రంప్ తో జరిపిన చర్చలల్లో ప్రతిష్టంభన తరువాత యూరోపియన్ దేశాలు తమను తాము రక్షించుకోవడానికి నడుం బిగించాయి. అందులో భాగంగా అవి శిఖరాగ్ర సమావేశానికి పిలుపునిచ్చాయి.
ఈ సందర్బంగా బ్రిటన్ ప్రధాని మాట్లాడుతూ ‘‘ మీరు(జెలెన్ స్కీ) వస్తుంటే వీధుల్లో వినిపించిన నినాదాలు విన్నారుగా, మీకు యూకే పూర్తి మద్దతు ఉంది’’ అని జెలెన్ స్కీతో అన్నారు. ‘‘ మేము మీతో ఉన్నాం, మీ దేశంతో ఉన్నాం.. అది ఎంతకాలమైన మా మద్దతు కొనసాగుతుంది’’ అని స్టార్మర్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై సంతోషం వ్యక్తం చేసిన జెలెన్ స్కీ బ్రిటన్ మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమావేశానికి ముందు ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో చర్చించినట్లు యూకే ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
నాటో చీఫ్ సలహ ఏంటంటే..
జెలెన్ స్కీ - ట్రంప్ మధ్య చర్చలు జరిగిన సంఘటనపై నాటో సెక్రటరీ జనరల్ మార్క్ బీబీసీ తో మాట్లాడుతూ.. ‘‘అమెరికా అధ్యక్షుడితో సంబంధాలను తిరిగి పునరుద్దరించడానికి మరోక దారిని వెతకాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు నిజంగా అమెరికా సాయానికి గౌరవం ఇవ్వాలి’’ అని సూచించారు.
ఇంతకుముందు అంటే 2019 లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కీవ్ కు జావేలిన్ ఆంటీ ట్యాంక్ మిస్సైల్ ను అమ్మడానికి అనుమతించారని, 2022 లో రష్యా యుద్దం ప్రకటించిన తరువాత వారిని అడ్డుకోవడానికి ఇవే కీలకంగా వ్యవహరించిన సంగతిని నాటో సెక్రటరీ గుర్తు చేశారు.
దురదృష్టకర సమావేశం..
ఉక్రెయిన్ అధ్యక్షుడు- అమెరికా అధ్యక్షుడి మధ్య జరిగిన సమావేశాన్ని ఆయన దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు. యుద్దం ముగించి శాంతి నెలకొనడానికి అమెరికా పరిపాలన వ్యవస్థ చాలా పెట్టుబడి పెట్టిందని ఆయన అన్నారు. ఉక్రెయిన్ పుననిర్మాణానికి అక్కడ ఉన్న ఖనిజ వనరులను అమెరికా పరం చేయడానికి, శాంతి చర్చలపై ముందడుగు వేయడానికి జెలెన్ స్కీ అక్కడకు చేరుకున్నారు కానీ అవేవీ చర్చకు రాకుంగా సమావేశం అర్థాంతరంగా రద్దయింది.

యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశం

యూరోపియన్ యూనియన్ పై ట్రంప్ వ్యాఖ్యలు, ఉక్రెయిన్ - రష్యా వివాదంలో పుతిన్ పక్షాన నిలవడంతో ఈయూ శిఖరాగ్ర సమావేశానికి పిలుపునిచ్చింది. దీనికి జెలెన్ స్కీ సైతం హజరయ్యే అవకాశం ఉంది.

అందులో ఉక్రెయిన్ కు సభ్యత్వం లేదు. అయితే ప్రస్తుతం వాషింగ్టన్ పర్యటన తరువాత ఏర్పడిన పరిణామాలతో ఆయన కీర్ స్టార్మర్ తో దౌత్య చర్చలు జరపాల్సి వచ్చింది. తరువాత ఆయన బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ - 2 తో బకింగ్ హమ్ ప్యాలెస్ తో సమావేశం అవుతారు. ఈ సమావేశాల అనంతరం ఈయూ సమ్మిట్ పై నిర్ణయం వెలువడనుంది.
Read More
Next Story