
పాక్ అధికారితో మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు..
దుబాయ్ నుంచి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ..
హర్యానా యూట్యూబర్ (Youtuber) జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra) విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ గూఢచర్యం ఆరోపణలపై ఇటీవల అరెస్టు అయిన ఆమెను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారులు విచారిస్తున్నారు. ఆమె వాట్సప్ ఛాట్, బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. పాకిస్తాన్(Pakistan) గూఢచారి సంస్థ, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కి చెందిన అలీ హసన్‌తో చాట్ చేసినట్లు గుర్తించారు. “నన్ను పాకిస్తాన్‌లో పెళ్లి చేసుకోండి” అన్న వాట్సప్ చాట్ వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాన్ని బయటపడినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య జరిగిన కోడ్ సంభాషణపై కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. మల్హోత్రా బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తు్న్నారు. ఆమెకు దుబాయ్ నుంచి డబ్బు జమ అయినట్లు గుర్తించారు.
గతంలో మల్హోత్ర పాకిస్తాన్‌ను సందర్శించినప్పుడు.. అక్కడ ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారి రహీమ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆయనే మల్హోత్రాను పాకిస్తాన్ నిఘా అధికారులకు పరిచయం చేశారని విచారణలో తేలింది. తిరిగి ఆమె భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని వారితో పంచుకున్నట్లు గుర్తించారు.
గూఢచర్యం ఆరోపణలతో మే 13న భారతదేశం నుంచి బహిష్కరించిన పాకిస్తాన్ అధికారితో మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వీరిద్దరూ కలిసి గతంలో బాలికి వెళ్లారని తెలిసింది. మల్హోత్రా వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ యాప్‌ల ద్వారా సమాచారాన్ని పంపేందని, తన ఐడెంటీటీని దాచిపెట్టేందుకు "జాట్ రాంధావా" పేరుతో చాట్ చేసేదని గుర్తించారు.