
వాషింగ్టన్ లో నిరసన చేస్తున్న ఆందోళనకారులు
ట్రంప్ కు వ్యతిరేకంగా అట్టుడికిన అమెరికా
ట్రంప్, మస్క్ విధానాలను వ్యతిరేకిస్తున్న 50 రాష్ట్రాలలో 12 వందల చోట్ల పెల్లుబికిన నిరసన
కఠిన వలస విధానాలు, ఉక్రెయిన్ కు నిధులు నిలిపివేయడం, అసలు ఉన్నారో లేరో తెలియని ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు, యూఎస్ ఎయిడ్ నిలుపుదల, ప్రపంచంపై సుంకాల యుద్దం ప్రారంభించిన తుంటరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డోజ్ కు ఇంఛార్జ్ కు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా ఏకకాలంలో నిరసనలు ప్రారంభం అయ్యాయి.
రాజధాని వాషింగ్టన్ లో గల వైట్ హౌజ్ ప్రాంగణంలోకి వేలాది మంది నిరసనకారులు ప్లకార్డులు చేతబూని, నినాదాలు చేస్తూ చొచ్చుకువచ్చారు. అక్కడ ఉన్న మైదానంలో మొత్తం నిరసనకారులతో నిండిపోయింది.
ఈ ప్రదర్శనలలో దాదాపుగా 20 వేల మంది ప్రజలు పాల్గొన్నారని అంచనా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దాదాపు 150 సంఘాలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయని నిర్వాహకులు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు.
"హ్యాండ్స్ ఆఫ్" పేరుతో నిరసన కారులు 50 US రాష్ట్రాలు సహా 1,200 ప్రదేశాలలో ర్యాలీలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రెశిడెంట్ ట్రంప్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు గోల్ఫ్ అడుకుంటూ గడుపుతున్నారు. ట్రంప్ శనివారం ఎటువంటి బహిరంగ కార్యక్రమాలను నిర్వహించలేదు. ఫ్లోరిడాలో తన రిసార్ట్‌లో గోల్ఫ్ ఆడుతూ రోజంతా గడిపాడు. ఆదివారం ఆయన మళ్ళీ గోల్ఫ్ ఆడాల్సి ఉంది.
మెక్సికో సరిహద్దు రాష్ట్రాల నుంచి మొదలు ఉత్తర ప్రాంతం వరకూ విస్తరించి ఉన్న ప్రాంతాలలో ఈ నిరసనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడి అధికారాల పెంపుతో పాటు పలు అంశాలను వీరు వ్యతిరేకిస్తున్నారు.
ఈ నిరసనలు ఇంతకుముందు క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడిని పోలి ఉంది. అయితే అప్పుడు కేవలం వాషింగ్టన్ లోనే ఇది కనిపించగా, తాజాగా జరిగిన నిరసనలు మాత్రం అన్ని రాష్ట్రాలలో కనిపిస్తున్నాయి. బోస్టన్, చికాగో, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, వాషింగ్టన్ DC, తదితర నగరాల్లో వేలాది మంది ప్రజలు హాజరయ్యారు.
నిరసనల్లో భాగంగా కొంతమంది పాలస్తీనా జెండాలు, మరికొంతమంది ఉక్రెయిన్ జెండాలు, కొంతమంది ఓక్ కల్చర్ కు సంబంధించిన చిహ్నాలతో ర్యాలీలలో పాల్గొన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ట్రంప్ విధించిన సుంకాల వల్ల రిపబ్లిక్ స్టేట్ లలో వ్యవసాయం పై ఆధారపడిన రైతులు తీవ్రంగా నష్టపోతారని కొంతమంది నిరసనకారులు వాదిస్తున్నారు. ‘‘సుంకాల వల్ల ప్రజలు ఉద్యోగాలు కోల్పోతారు. ఇది సంవత్సరంలో 401 కే డాలర్లుగా ఉంటుంది’’ అని హాఫ్ మన్ అనే నిరసనకారుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఆయన నిరసన ప్రదర్శనల్లో పాల్గొనేందుకు న్యూజెర్సీ నుంచి వాష్టింగ్టన్ కు వచ్చారు.
ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వ ఉద్యోగాలలో చాలామందిని ఇంటికి పంపించారు. వీరి సంఖ్య దాదాపు గా 2 లక్షల వరకూ ఉంటుందని ఓ అంచనా. అలాగే శుక్రవారం ఒక్కరోజే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ నుంచి 20 వేల మందిని తొలగించారు.
ఇది ఆ డిపార్ట్ మెంట్ మొత్తం కార్మికుల సంఖ్యలో 25 శాతానికి సమానం. చాలా మందికి నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించడం, వారి భవిష్యత్ అగమ్య గోచరంగా మారడంతో నిరసన ప్రదర్శనల్లో వారు ముందున్నారని తెలుస్తోంది.
ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ ఈ నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహిస్తోంది. ఇప్పటికే ట్రంప్ విధానాలతో ఆ పార్టీకి చెందిన డీప్ స్టేట్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఉత్సాహంగా గడిపిన ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీకెండ్ చాలా ఉత్సాహంగా తన సొంత రాష్ట్రంగా ఫ్లోరిడాలో గడిపారు. బీచ్ దగ్గరలో ఉన్న తన ఫామ్ హౌజ్ లో ఆయన సరదాగా గోల్ఫ్ ఆడారు. తరువాత తన కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు.
Next Story