‘‘నన్ను అక్కడికి పంపొద్దు.. ఒంటినిండా రోగాలే’’
x

‘‘నన్ను అక్కడికి పంపొద్దు.. ఒంటినిండా రోగాలే’’

అమెరికా సుప్రీంకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేసిన ముంబై ఉగ్రవాద దాడి నిందితుడు రాణా


ముంబై ఉగ్రవాద దాడి నిందితుడు పాకిస్తానీ- కెనడియన్ తహవ్వూర్ రాణా మరోసారి అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ముస్లిం అయినందున భారత్ హింసిస్తారని నాటకాలు ఆడే ప్రయత్నం చేశారు.

ఫిబ్రవరిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. రాణాను భారత్ అప్పగించడానికి తన పరిపాలన వ్యవస్థ ఆమోదం తెలిపిందని ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్ పర్యటన తరువాత సందర్భంగా ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. తరువాత నిందితుడి న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్ దాఖలు..
రాణాను భారత్ కు అప్పగించడాన్ని అత్యవసరంగా నిలిపివేయాలని కోరుతూ అతని తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ జైలులో ఉన్న 63 ఏళ్ల రాణా పాకిస్తాన్ మూలానికి చెందిన ముస్లిం కాబట్టి భారత లో తనను హింసించే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నాడు.
2008 లో ముంబైలో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు దాడులు చేయడంతో 166 మంది సాధారణ ప్రజలు మరణించారు. దీనికి కుట్రపన్నిన తన స్నేహితుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి అవసరమైన అన్ని పత్రాలను సమకూర్చి ముంబై పంపింది రాణా అనే అమెరికా కోర్టులో పోలీసులు అభియోగపత్రాల్లో పేర్కొన్నారు.
రాణాకు అనారోగ్యమట..
రాణా తన పిటిషన్ లో తాను అనేక వ్యాధులతో బాధపడుతున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం తనకు కార్డియాక్ అనూరిజం, పార్కిసన్స్ వ్యాధి, మూత్రాశయ క్యాన్సర్ ఉందని అన్నారు. విచారణను ఎదుర్కొనే కాలం రాణా బ్రతలేకపోవచ్చని ఆయన తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు.
విచారణ ఎదుర్కొనేంత కాలం రానా బ్రతకపోవచ్చని తరఫు న్యాయవాదులు వాదించారు. ‘‘జాతీయ, మతపరమైన సాంస్కృతిక శత్రుత్వం ఉన్న దేశాల్లోకి పంపితే కందీరిగల గూటిలోకి తనను పంపడమే అని పిటిషన్ లో అభ్యర్థించారు.
భారత ప్రభుత్వంపై హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక..
భారత్ లో మతపరమైన మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలపై ఒక క్రమబద్దంగా వివక్ష అమలవుతోందని 2023 హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక విడుదల చేసిన దాన్ని కోర్టులో ఉదహరించారు.
భారత ప్రభుత్వం నిరంకుశత్వంతో వ్యవహరిస్తుందని, న్యాయ విచారణ సందర్భంగా రాణా హక్కులు ప్రమాదంలో పడతాయని పిటిషన్ లో వాదించారు. ఇంతకుముందు అంటే జనవరి 21న అమెరికా సుప్రీంకోర్టు రాణా దాఖలు చేసిన సమీక్ష పిటిషన్ ను తిరస్కరించింది. దీనితో తాజాగా మరోసారి పిటిషన్ దాఖలు చేశారు.
పాకిస్తాన్ సైన్యంలో వైద్యుడు..
పాకిస్తాన్ సైన్యంలో మాజీ వైద్యుడైన రాణా తరువాత కెనడాకు వెళ్లి, అక్కడ పౌరసత్వం పొందాడు. కెనడాలో ఇమ్మిగ్రేషన్ వ్యాపారాన్ని ప్రారంభించి తరవాత అమెరికాకు మార్చాడు.
ముంబై ఉగ్రవాద దాడి ఘటనలో రాణా- హెడ్లీపై ప్రమేయంపై ముంబై హైకోర్టులో విచారణ జరిగింది. వారిని అప్పగించాలని భారత్, అమెరికాను కోరింది.
అమెరికాకు ఎన్ఐఏ బృందం..
మే 2023 లో అమెరికా సుప్రీంకోర్టు రాణాను భారత్ కు అప్పగించడానికి ఆమోదం తెలిపింది. ట్రంప్ కూడా దీనిని ధృవీకరించారు. రాణా అప్పగింతకు ఎన్ఐఏ బృందం న్యూఢిల్లీ నుంచి వాషింగ్టన్ వెళ్తుందని పేరు వెల్లడించని ఓ అధికారి జాతీయ మీడియాకు వెళ్లడించారు.
Read More
Next Story