ఉక్రెయిన్ పై మెరుపుదాడులకు దిగిన రష్యా
ఉక్రెయిన్ రాజధానిపై ఇన్నాళ్లు గురిపెట్టని రష్యా.. సోమవారం ఉదయం నుంచే బాంబుల వర్షం కురిపించింది. అనేక ప్రధాన నగరాల్లో వైమానిక సైరన్లు, బాంబుదాడులు జరిగినట్లు..
ఉక్రెయిన్ తో రెండున్నర సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధంలో క్రమక్రమంగా వెనకడుగు వేస్తున్న రష్యా.. సోమవారం తెల్లవారుజామున మెరుపుదాడులకు దిగింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహ ప్రధాన నగరాలైన ఖార్కీవ్, రేవు పట్టణమైన ఒడెస్సా సహ అనేక కీలక నగరాలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది.
అనేక ప్రాంతాలల్లో బాంబుదాడులు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దాడులకు ఎక్కువ మొత్తం డ్రోన్ లు వినియోగించినట్లు అంతర్జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.
వాయువ్య ఉక్రేనియన్ నగరమైన లుట్స్క్‌లో ఒక వ్యక్తి చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. రష్యా డ్రోన్ దాడులకు దిగడానికి ముందు ఉక్రెయిన్ సైన్యం కూడా భారీ స్థాయిలో దాడులకు దిగింది. రష్యా భూభాగంలో గల బెల్గారోడ్ పై దాడులు చేసింది. ఇందులో ఐదుగురు రష్యన్ పౌరులు మరణించారు. ముగ్గురు పిల్లలతో సహ 13 మంది గాయపడ్డారని సమాచారం.
ఉదయం 6 గంటల ముందు, ఉక్రెయిన్ అంతటా వైమానిక దాడి సైరన్లు వినిపించాయి. కీవ్‌లోని అనేక ప్రాంతాలు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని మేయర్ విటాలి క్లిట్ష్కో చెప్పారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా సమస్యలు తలెత్తాయని చెప్పారు.
నగరాల్లో పేలుళ్లు
కీవ్ ఇండిపెండెంట్ ప్రకారం, ఒడెసా, విన్నిట్సియా, జప్పోరిజ్జియా, క్రెమెన్‌చుక్, డ్నిప్రో, ఖ్మెల్‌నిట్స్కీ, క్రోపివ్‌నిట్స్కీ, క్రివీ రిహ్ నగరాలలో కూడా పేలుళ్లు జరిగాయి. ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకారం దాదాపు 17 రష్యాన్ బాంబర్ విమానాలు, అనేక కమికేజ్ డ్రోన్ లు, వివిధ నగరాల వైపు ప్రయోగించారు. తూర్పు డొనెట్స్క్ ప్రాంతంలో, క్రమాటోర్స్క్‌లోని ఒక హోటల్‌పై రాత్రిపూట రష్యా దాడుల్లో ఇద్దరు విదేశీ జర్నలిస్టులు గాయపడ్డారు. మరొకరు గల్లంతైనట్లు సమాచారం.
రెండో ప్రపంచయుద్దం తరువాత తొలిసారి..
రష్యా భూభాగంపై విదేశీ సైన్యాలు 1945 తరువాత తొలిసారిగా అడుగుపెట్టాయి. జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ నేతృత్వంలోని నాజీ సైన్యం రెండో ప్రపంచయుద్ధ కాలంలో రష్యా ను ఆక్రమించడానికి బయల్దేరాయి. కానీ స్టాలిన్ గ్రాండ్, కస్క్స్ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో నాజీ సైన్యం పరాజయం పాలైంది. రష్యాన్ ఆర్మీ విజయం సాధించి జర్మనీని ఆక్రమించడంతో నాజీలు లొంగిపోయారు. ఆ తరువాత ఇప్పుడే ఉక్రెయిన్ సైన్యం తొలిసారిగా రష్యా భూభాగంపై దాడులకు పాల్పడుతోంది.
Next Story