
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్
అమెరికా, పాక్ లపై విమర్శలు గుప్పించిన ఎస్. జైశంకర్
ఆ రెండు దేశాలకు చరిత్రను పట్టించుకోని చరిత్ర ఉందని వ్యాఖ్యలు
భారత్- అమెరికా సంబంధాలు క్రమంగా వేడెక్కుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా ట్రంప్ అనుసరిస్తున్న వైఖరితో గుర్రుగా ఉన్న న్యూఢిల్లీ క్రమంగా తన వాయిస్ ను పెంచుతోంది. తాజాగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా, పాకిస్తాన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రెండు దేశాలు కూడా చరిత్రను పట్టించుకోని చరిత్రను కలిగి ఉన్నాయని చెప్పారు.
2011 లో పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో 9/11 ఉగ్రవాద దాడుల సూత్రధారి అయిన అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా దళాలు హతం చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశాయి.
‘‘వాళ్లిద్దరూ ఒకరితో ఒకరు మంచి చరిత్ర కలిగి ఉన్నారు. అందులో ఒకటి తమ చరిత్రను విస్మరించిన చరిత్ర ఉంది. అమెరికా సైన్యం అబోటాబాద్ లోకి వెళ్లి అక్కడ ఎవరిని కనుగొంది?’’ ఆయన ప్రేక్షకులను ఉద్దేశించి అన్నారు. అమెరికా- పాక్ మధ్య కొద్దికాలంగా పెరుగుతున్న సానిహిత్యంపై ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
డొనాల్డ్ ట్రంప్ కొంతకాలంగా భారత్ పై కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. అదే సమయంలో పాకిస్తాన్ తో స్నేహం తిరిగి ప్రారంభించారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, ఈ రెండు నెలలో రెండుసార్లు అమెరికాను సందర్శించారు. అమెరికా వేదికగా పాక్ జనరల్ భారత్ పై అణు బెదిరింపులు సైతం చేశారు.
భారత్ పై వరుసుగా ఆంక్షలు, సైనిక జనరల్ తో వరుస సమావేశాలు, మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో తన ప్రమేయంతో కాల్పుల విరమణ కుదిరిందని ట్రంప్ చేసిన ప్రకటనను న్యూఢిల్లీ అంగీకరించకపోవడంతో రెండు దేశాల మధ్య భేదాబిప్రాయాలు క్రమంగా పెరుగుతున్నాయి.
పాకిస్తాన్ పై తక్కువ స్థాయి సుంకాలు విధించిన ట్రంప్ ను ప్రశంసిస్తూ ఇస్లామాబాద్ ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. ఈ నెలలో రెండు స్థాయిల ఉన్నతాధికారుల బృందం ఉగ్రవాదులను ఎదుర్కోవాలనే అంశంపై చర్చలు జరిపాయి. అది కూడా ఇస్లామాబాద్ లో జరిగింది. ఈ చర్యలను భారత్ నిశితంగా గమనిస్తోంది.
ఈ నేపథ్యంలో జైశంకర్ మాట్లాడుతూ.. మరోసారి ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాల్పుల విరమణ కేవలం పాకిస్తాన్- భారత్ మాత్రమే నిర్ణయించుకున్నాయని మంత్రి చెప్పారు. ఆ తరువాత రెండు దేశాలు చరిత్రను పట్టించుకోని చరిత్ర ఈ రెండు దేశాలకు ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇలాంటి పరిణామాలు గతంలోనూ కనిపించాయని ఆయన గుర్తు చేశారు. ‘‘సమస్య ఏమిటంటే.. దేశాలు సౌలభ్యం కోసం రాజకీయాలు చేయడంపై దృష్టి సారిస్తున్నాయి’’ అని ఆయన విశ్లేషించారు. వాటిలో కొన్ని నిర్ణయాలు వ్యూహాత్మకం కాగా, మరికొన్ని ఇతర ప్రయోజనాలు లేదా లెక్కలు కూడా ఉన్నాయని అన్నారు.
అమెరికా, పాక్ సంబంధాలు ఎలా బలపడుతున్నాయో గమనిస్తూనే అమెరికాతో మన సంబంధాలు ఎలా ఉన్నాయో భారత్ కూడా తెలుసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
కోల్డ్ వార్ లో అమెరికా- పాకిస్తాన్ కు అత్యంత సన్నిహిత మిత్రదేశాలలో ఒకటి. 21 వ శతాబ్దంలో భౌగోళిక రాజకీయ వాస్తవాలు భారత్, అమెరికాకు దగ్గరవుతుండగా, పాక్ మాత్రం చైనా కూటమిలో చేరింది. ట్రంప్ తన మొదటి టర్మ్ పాలనలో పాక్ పై కఠిన ఆంక్షలు విధించారు. కానీ ప్రస్తుతం ఆయన వైఖరి న్యూఢిల్లీకి వ్యతిరేకంగా ఉంది.
రష్యాలో అమెరికాపై..
అమెరికా- పాకిస్తాన్ సంబంధాలపై వ్యాఖ్యానించడానికి రెండు రోజుల ముందు జై శంకర్ రష్యాను సందర్శించి, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కలిశారు. ఆగష్టు 21 గురువారం ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించడానికి అమెరికా అన్నీ చేయాలని కోరిందని, అందులో భాగంగానే రష్యా నుంచి చమురు సైతం తీసుకోవాలని సూచించదని ఆయన పేర్కొన్నారు.
కానీ ప్రస్తుతం ఇదే నెపంతో భారత్ పై అమెరికా 25 శాతం పెనాల్టీ సుంకం విధించింది. దీని వల్ల భారత్ పై అమెరికా విధించిన సుంకాలు 50 శాతానికి చేరుకున్నాయి. ఇది న్యూఢిల్లీ వైఖరిలో మార్పుకు కారణమైంది.
Next Story