ఉగ్రవాద శిబిరాలను మట్టికరిపించారిలా..
x

ఉగ్రవాద శిబిరాలను మట్టికరిపించారిలా..

పాక్ ఉగ్ర స్థావరాలపై దాడులకు ‘ముందు-తరువాత’ ఉపగ్రహ చిత్రాలు విడుదల చేసిన భారత సేన..


పాకిస్థాన్‌(Pakistan)లోని ప్రధాన ఉగ్ర శిబిరాలపై (Terror camps) భారత రక్షణ దళాలు మెరుపుదాడి చేశాయి. ఈ దాడులకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను (Satellite Images) భారత వాయుసేన విడుదల చేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతిదాడికి పూనుకుంది. మొత్తం 9 ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడులు చేసింది. వీటిలో నలుగురు పాకిస్థాన్‌లో ఉండగా.. ఐదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉన్నాయి.

పాకిస్తాన్‌లో నలుగు శిబిరాలు: మురిద్కే, బహావల్పూర్, సర్జాల్, మెహ్మూనా జోయా.

PoKలోని ఐదు శిబిరాలు: ముజఫ్ఫరాబాద్‌లోని సవాయ్ నాలా, సయ్యద్నా బిలాల్,

కోట్లీలోని గుల్పూర్, అబ్బాస్, భిమ్‌బెర్‌లోని బర్నాలా.

మురిద్కే ఉగ్రశిబిరం..

లష్కరే తోయ్బా (LeT) ప్రధాన కేంద్రంగా ఉన్న మురిద్కే శిబిరం సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. భారత్ చేసిన క్షిపణి దాడికి ఉగ్రవాదులకు శిక్షణ నిచ్చే ఈ కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది.




బహావల్పూర్ ఉగ్రశిబిరం..

ఇది పాక్ పంజాబ్‌లో ఉన్న మరో ఉగ్ర స్థావరం. మసూద్ అజహర్ నేతృత్వంలోని జైషే మహ్మద్ సంస్థ ప్రధాన కేంద్రం. ముంబయిలో 2008లో జరిగిన 26/11 ఉగ్రదాడులకు ఇదే సంస్థ బాధ్యత వహించింది.








Bholari airfield


Sukkur airfield

పాకిస్థాన్ విమానాశ్రయాలపై దాడులు..

తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత దళాలు దాడులు చేసిన అనంతరం.. భారత్ పౌర ప్రాంతాలపై పాకిస్థాన్ డ్రోన్లతో దాడులు చేయడం ప్రారంభించింది. ప్రతిస్పందనగా భారత్ రాడార్ వ్యవస్థలు పాకిస్థాన్ విమానాశ్రయాలపై దాడులు జరిపాయి.

సోమవారం (మే 12) నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ.. “మూడు గంటల వ్యవధిలో 11 పాక్ కేంద్రాలపై దాడులు నిర్వహించాం. వీటిలో నూర్ ఖాన్, రఫిఖీ, మురిడ్, సుక్కూర్, సియాల్కోట్, పస్రూర్, చునియన్, సర్గోధా, స్కారూ, భోలారీ, జాకోబాబాద్ ఉన్నాయి.” అని తెలిపారు. పాక్ విమానాశ్రయాల్లోని అన్ని వ్యవస్థలపై దాడులు చేయగల శక్తి భారత్‌కు ఉన్నా.. గుణాత్మక దాడులు మాత్రమే చేశామని స్పష్టం చేశారు.


Chunian air defence radar


Pasrur air defence radar


Sukkur airfield


‘100కి పైగా ఉగ్రవాదులు హతం’

ఆదివారం రాత్రి జరిగిన మీడియా సమావేశంలో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ (Director General of Military Operations) మాట్లాడారు. ఈ దాడుల్లో 100కి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. హతమైన ప్రముఖ ఉగ్రవాదుల పేర్లు కూడా వెల్లడించారు. యూసుఫ్ అజహర్ (జైషే మహ్మద్), అబ్దుల్ మాలిక్ రౌఫ్ (లష్కరే తోయ్బా కమాండర్), ముదాసిర్ అహ్మద్ (పుల్వామా దాడిలో పాత్ర ఉన్న ఉగ్రవాది). మృతుల్లో ఉన్నారని చెప్పారు.

Read More
Next Story