పౌల్ట్రీ ఉత్పత్తులను నిషేధించిన సౌదీ అరేబియా
x

పౌల్ట్రీ ఉత్పత్తులను నిషేధించిన సౌదీ అరేబియా

భారత్, చైనా సహ 40 దేశాలకు వర్తింపు, ‘హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా’ కారణంతోనే నిషేధం


Click the Play button to hear this message in audio format

సౌదీ అరేబియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 దేశాలనుంచి పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులను నిషేధించింది. హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (HPAI) వ్యాప్తి కారణంగా భారత్, బ్రిటన్, చైనాతో ఈ 40 దేశాల నుండి కోళ్ల, గుడ్ల దిగుమతులపై నిషేధం విధించింది.

అయితే, ఈ నిషేధం తాత్కాలికమని సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) వెబ్‌సైట్‌లో అధికారులు పేర్కొన్నారు. కొన్ని దేశాలు 2004 నుంచి ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఎవియన్ ఇన్ ఫ్లుయంజా లేదా న్యూకాజిల్ వైరస్ ను కోడిమాంసం, కోడి గుడ్లకు ఈ నిషేధం వర్తించదు. 2021లో ప్రారంభమైన ఈ జబ్బు మెల్లిగా 50 రకాల క్షీరద జాతులకు వ్యాపించింది.

దీనితో సాంప్రదాయ వ్యాధి నియంత్రణ కష్టమయింది. ఇటీవల ఏవియన్ వ్యాధి వ్యాప్తి చెందడం మొదలయింది. గతంలో ఇది పక్షులు, కోళ్లు, ఇటీవల పాడి పశువులకు కూడా సోకింది. అప్పుడప్పుడు మానవులకు వ్యాపిస్తూన్నట్లు వార్తలు వస్తున్నాయి.

కానీ మనిషి నుంచి మరొక మనిషికి సంక్రమించిన ఆధారాలు లేవు. అయితే, ఇన్ ఫ్లుయంజా వైరస్ ను తెలిగించేందుకు హీట్ ట్రీట్ మెంటు చేసిన కోడిమాంసం మీద నిషేధం లేదు. అయితే ఇలా మాంసాన్ని ట్రీట్ చేసినట్లు మెడికల్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.

నిషేధిత జాబితాలోని దేశాలు ఏమిటి?

ఈ మొత్తం నిషేధం కింది 40 దేశాలకు వర్తిస్తుంది: జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, ఇండోనేషియా, చైనా, కంబోడియా, లావోస్, హాంకాంగ్, కజకిస్తాన్, మంగోలియా, అజర్‌బైజాన్, బల్గేరియా, ఇరాన్, స్లోవేనియా, ఇరాక్, ఈజిప్ట్, నైజీరియా, భారతదేశం, నైజర్, బోస్నియా , హెర్జెగోవినా, ఆఫ్ఘనిస్తాన్, కామెరూన్, సూడాన్, బుర్కినా ఫాసో, సెర్బియా, మోంటెనెగ్రో, జిబౌటి, ఐవరీ కోస్ట్, బ్రిటన్, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, దక్షిణాఫ్రికా, మెక్సికో, ఉత్తర కొరియా, లిబియా, పాలస్తీనా, తైవాన్, జర్మనీ, ఘనా వంటి దేశాలు ఉన్నాయి.


Read More
Next Story