సానియా మీర్జా విడాకులు.. షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి..
x

సానియా మీర్జా విడాకులు.. షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి..

పాకిస్థాన్‌ క్రికెట్ జట్టు మాజీ క్యాప్టన్ షోయబ్ మాలిక్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నారు?


ఊహించినట్టే పాకిస్థాన్‌ క్రికెట్ జట్టు మాజీ సారథి షోయబ్ మాలిక్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నట్లు ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. షోయబ్‌ మాలిక్‌కు ఇంతకుముందు భారత టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జాతో వివాహం జరిగింది. గతకాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. విడాకులు తీసుకోబోతున్నట్టు వదంతులు కూడా వచ్చాయి. ఈ తరుణంలో షోయబ్‌ మాలిక్‌ తన పెళ్లి ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.

సానియాతో విడిపోతున్నట్టు వార్తలు..

షోయబ్-సానియా విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం విడాకులు అనేది చాలా కష్టమంటూ సానియా సోషల్ మీడియాలో పోస్టుపెట్టారు. అది వైరల్‌గా మారిన తరుణంలో మాలిక్ మరో వివాహం గురించి ప్రకటించారు. ఫోటోలూ పెట్టారు. ఆయనకు ఇది మూడో పెళ్లి. 2010లో అయేషాతో విడాకులు తీసుకున్న ఆయన.. అదే ఏడాది ఇండియాకు చెందిన ప్రముఖ టెన్నిస్‌ స్టార్‌ సానియాను వివాహమాడారు. ఈ వేడుక అప్పట్లో అందర్నీ ఆకర్షించింది. 2018లో వారికి కుమారుడు జన్మించాడు. షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. హైదరాబాద్‌లో 2010లో వీరి వివాహం ఎంతో ఘ‌నంగా జ‌రిగింది. 2018లో వీరికి ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు. దాదాపు గ‌త రెండు సంవ‌త్సరాలుగా సానియా, షోయ‌బ్‌లు విడిపోతున్నారు అనే వార్తలు వ‌స్తున్నాయి.

వీటిపై ఇంత వ‌ర‌కు కూడా వీరిద్దరు నేరుగా స్పందించ‌లేదు. పాక్ నటి అయేషా ఉమర్‌తో మాలిక్‌ వివాహేతర సంబంధం కొన‌సాగిస్తుండ‌మే ఇందుకు కార‌ణం అని వార్తలు రాగా.. ఆ వార్తల‌ను అయేషా ఖండించింది.

ఇక వీరిద్దరు కూడా విడివిడిగా జీవిస్తుండ‌డం కూడా పుకార్లకు మ‌రింత‌ ఆద్యం పోస్తోంది. ఇక ఇటీవ‌ల సానియా మీర్జా త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల నుంచి పోయ‌బ్ మాలిక్ ఫోటోల‌ను తొల‌గించ‌గా, అటు షోయ‌బ్ సైతం త‌న ట్విట్టర్ అకౌంట్ నుంచి సానియా మీర్జా పేరును తొల‌గించారు. తాజాగా సానియా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వీరిద్దరు విడిపోవం ఖాయ‌మ‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

ఇది మూడో పెళ్లి..

ఇప్పుడు షోయబ్‌ పెళ్లి చేసుకున్న సనా జావేద్‌ సినీనటి. ఆమెకు కూడా ఇంతకుముందే వివాహం జరిగింది. 2020లో పాక్‌కు చెందిన ఓ సింగర్‌ను పెళ్లిచేసుకున్న ఆమె.. 2023లో అతడితో విడిపోయింది.


Read More
Next Story