శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు.. అనేక సమస్యల మధ్య విపరీత పోటీ
x

శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు.. అనేక సమస్యల మధ్య విపరీత పోటీ

అసలే దేశంలో ఆర్థిక సంక్షోభం. ప్రజలలో తీవ్ర నిరాశ, నిస్పృహ. ఈ సమయంలో దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పదవి కోసం లంక రాజకీయ పార్టీలు తమ రాజకీయం..


భారత పొరుగు దేశం, ద్వీప దేశమైన సింహాళ ద్వీపంలో ఎన్నికల సమరం మొదలయింది. మరో రెండు నెలల్లో అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న శ్రీలంక, అధ్యక్ష ఎన్నికల కోసం భారీ స్థాయిలో అభ్యర్థుల పోటీని ఎదుర్కొబోతోంది. అసాధారణమైన రాజకీయ, ఆర్థిక సంక్షోభం మధ్య జూలై 2022లో పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత రణిల్ విక్రమసింఘేతో పాటు అధికారం కోసం అర డజను మంది పోటీపడుతున్నారు.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస, నేషనల్ పీపుల్స్ పవర్ లీడర్ అనూరా దిసనాయకే, మాజీ ఆర్మీ చీఫ్ శరత్ ఫోన్సెకా, న్యాయ శాఖ మంత్రి విజయదాస రాజపక్షే ఇతర కీలక అభ్యర్థులు పోటీలోకి దిగారు.
రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు?
ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్య దేశాలలో ఒకటైన శ్రీలంక అధ్యక్ష పాలనా విధానాన్ని అనుసరిస్తుంది. దీనికి 225 మంది సభ్యుల పార్లమెంటు కూడా ఉంది. దేశానికి అధిపతి, సాయుధ దళాల కమాండర్-ఇన్-చీఫ్ అయిన రాష్ట్రపతి ఐదు సంవత్సరాల కాలానికి నేరుగా ఎన్నుకోబడతారు.పార్లమెంటులో మంత్రివర్గానికి అధ్యక్షత వహించి, నియమించేది కూడా రాష్ట్రపతియే. అధికార పార్టీకి నాయకత్వం వహించే ప్రధానమంత్రి, అధ్యక్షుడి కంటే దిగువ స్థానంలో ఉంటారు.
కొత్త అధ్యక్షుడి నుంచి ఓటర్లు ఏం కోరుకుంటున్నారు
ఆర్థిక సంక్షోభం, రాజకీయ గందరగోళానికి కారణమైన తరువాత, 2022లో అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. తరువాత తన పదవికి రాజీనామా చేశారు. దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విత్త సంక్షోభం. అలాగే దేశం ముందు కూడా భారీ రుణాల చెల్లింపు సమస్య ఉంది. ద్వైపాక్షిక రుణదాతలు అయిన జపాన్, చైనా, భారత్ కు తిరిగి చెల్లించడంతోపాటు, ఈ ఏడాది చివర్లో జరిగే మూడవ IMF (అంతర్జాతీయ ద్రవ్యనిధి) సమీక్షకు ముందు $12.5 బిలియన్ల రుణాన్ని చెల్లించడంపై బాండ్ హోల్డర్‌లతో ప్రాథమిక ఒప్పందాన్ని శ్రీలంక పూర్తి చేయవలసి ఉంది.
ఎన్నికలను నడిపించే అంశాలు..
2022 ఆర్థిక సంక్షోభం వినాశనానికి కారణమైంది. లక్షలాది మంది ప్రజలను పేదరికంలోకి నెట్టివేసింది. దేశంలోని చాలామంది ప్రజలతో పాటు నిఫుణులైన పనివాళ్లు కూడా దేశం వదిలి వెళ్లిపోయారు. అంతులేని ద్రవ్యోల్బణం, తక్కువ ఆర్థిక వృద్ధి, స్తబ్దత, జాబ్ మార్కెట్ విస్తృతమైన కోపాన్ని రేకెత్తిస్తూనే ఉన్నాయి. సెప్టెంబర్‌లో ప్రజలు ఓటు వేసే విధానాన్ని కూడా ఇవన్నీ ప్రభావితం చేయవచ్చని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు.
విక్రమసింఘే, అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, కానీ మాస్ బేస్ లేని నాయకుడు కూడా. అతను శ్రీలంకను విపత్తు అంచు నుంచి బయటకు లాగినందున తాను తిరిగి ఎన్నుకోబడటానికి అర్హుడని పేర్కొనవచ్చు. కానీ 2022 నాటి పరిస్థితులు మాత్రం ఇప్పుడు శ్రీలంక కనిపించవని చెప్పవచ్చు.
విక్రమసింఘే ప్రత్యర్థులు
విక్రమసింఘే, మాజీ అధ్యక్షుడు రణసింగ్ ప్రేమదాస కుమారుడు సాజిత్ ప్రేమదాస, వామపక్ష నాయకుడు దిసానాయక నుంచి పోటీని ఎదుర్కొంటున్నారు. ప్రజల్లో ఉన్న సామూహిక అసంతృప్తిని ఉపయోగించుకోవాలని ఇద్దరూ నిశ్చయించుకున్నారు. ప్రజలకు మెరుగైన పరిపుష్టిని అందించడానికి IMFతో రుణ ఒప్పందాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు.
అయితే ఏ కొత్త ప్రభుత్వం అయినా ఇప్పటికే అమలులోకి వచ్చిన ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లి, ఆర్థిక వ్యవస్థను మార్చడానికి, దానిని సానుకూల మార్గంలో ఉంచడానికి నిర్ధారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.
తమిళ, ముస్లిం ఓటర్ల పాత్ర
ద్వీప దేశంలో సింహళీయులు ఆధిపత్య జాతి అయినప్పటికీ, ముస్లిం- తమిళ ఓటర్లు కూడా ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తారు, అధికారం కోసం పోటీ పడుతున్న ఐదుగురు మెజారిటీ వర్గానికి చెందిన వారు. వీరిలో ఎవరికి వీరి ఓట్లు పడతాయో చెప్పడం కష్టం. తమిళ వర్గాల నుంచి ఒకరు పోటీ పడతారని అనుకుంటున్న అతను గెలుస్తాడని మాత్రం చెప్పలేం. అందువల్ల వీరు ఏ పద్దతిని అనుసరిస్తారో చూడాలి. ప్రెసిడెంట్ పోటీకి నామినేషన్ల దాఖలు ఆగష్టు 15 న జరగనుంది. ఒకరోజు అధ్యక్ష ఎన్నికల తర్వాత పార్లమెంటరీ, స్థానిక కౌన్సిల్ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు.
Read More
Next Story