
ఇలాన్ మస్క్
వెనెజువెలాలో స్టార్ లింక్ ఫ్రీ ఇంటర్నెట్: ఇలాన్ మస్క్
వచ్చే నెల మూడో నెల వరకూ ఉచిత సేవలు
వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా కిడ్నాప్ చేసి పట్టుకుపోయిన తరువాత ఆ దేశ కార్పొరేట్ దిగ్గజాలు మెల్లగా కారకాస్ లో ప్రవేశించడం మొదలు పెట్టాయి. తాజాగా స్టార్ లింక్ ఉచిత ఇంటర్నెట్ సేవలను అందిస్తుందని స్పేస్ ఎక్స్ సీఈఓ ఇలాన్ మస్క్ ప్రకటించారు.
వచ్చే నెల అంటే ఫిబ్రవరి 3 వరకూ ఈ సేవలు అందిస్తుందని వెల్లడించారు. స్టార్ లింక్ అనేది మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ నిర్వహిస్తున్న ఉపగ్రహ ఇంటర్నెట్ సేవ. సంక్షోభం మధ్య వెనెజువెలా ప్రజలకు నిరంతర కనెక్టీవిటీని అందించాలని కోరుకుంటున్నట్లు కంపెనీ ఆదివారం తన ఎక్స్ ఖాతాలో తెలిపింది.
‘‘స్టార్ లింక్ ఫిబ్రవరి 3 వరకూ వెనెజువెలా ప్రజలకు ఉచిత బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిస్తోంది. ఇది నిరంతర కనెక్టివిటీని అందిస్తుంది’’ అని స్టార్ లింక్ తెలిపింది.
మస్క్ చెప్పింది ఏంటీ?
ఈ పోస్ట్ ను రీట్వీట్ చేసిన మస్క్.. ‘‘వెనెజువెలా ప్రజలకు మద్దతుగా’’ అని రాసుకొచ్చారు. అంతకుముందు మదురో, అతని భార్య సిలియా ప్లోర్స్ ను కారకాస్ నుంచి పట్టుకోవడానికి అమెరికా చేసిన సైనిక చర్యను మస్క్ మద్దతు ప్రకటించారు. ‘‘వెనెజువెలా ఇప్పుడు దానికి అర్హమైన శ్రేయస్సును పొందగలదు’’ అని మస్క్ ఆదివారం స్పానిష్ భాషలో ఎక్స్ లో ఖాతాలో రాసుకొచ్చాడు.
2024 లో కూడా మస్క్ ఎక్స్ లో అనేక పోస్ట్ లలో మదురోను విమర్శించాడు. అతడిని చెత్త వ్యక్తిగా అభివర్ణించారు. ‘‘మదురో మంచి వ్యక్తి కాదు. వెనెజువెలా చాలా మెరుగ్గా ఉండాలి.
అమెరికాలో దేశీయ చమురు అండ్ గ్యాస్ ఉత్పత్తి పుష్కలంగా ఉంది. వెనెజువెలా లో ఏమి త్వరగా జరగదు. కాబట్టి అది ఈ ఎన్నికలను కచ్చితంగా ప్రభావితం చేయదు. వెనెజువెలా చమురు ఉత్పత్తిని పునర్మించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది’’ అని మస్క్ జూలై 2024 లో రాశారు.
‘‘మదురో పాలనను చూసి వెనెజువెలా ప్రజలు విసిగిపోయారు’’ అని మదురో పోస్టర్లను ప్రజలు చించివేస్తున్న వీడియోకు ప్రతిస్పందనకు మస్క్ పోస్ట్ చేశారు.
కోర్టుకు హజరుకానున్న మదురో..
వెనెజువెలా నుంచి తీసుకువచ్చిన మదురోను సోమవారం నార్కో టెర్రరిజం కింద మొదటి సారి అమెరికన్ కోర్టులో హజరు కానున్నాడని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.
మదురో అతని భార్య మధ్యాహ్నం ఒక న్యాయమూర్తి ముందు ఒక చిన్న, కానీ అవసరమైన చట్టపరమైన చర్య కోసం హజరు కానున్నారు. ఇది అమెరికాలో అతనిని విచారణకు తీసుకురావచ్చా?
లేదా అనే దానిపై సుదీర్ఘమైన చట్టపరమైన పోరాటానికి నాంది పలికే అవకాశం ఉంది. 2024 లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాపార రికార్డులను తప్పుడుగా చూపించినందుకు దోషిగా నిర్ధారించబడిన బ్రూక్లిన్ జైలు నుంచి మాన్ హట్టన్ కోర్టుకు ఈ జంటను తీసుకురానున్నట్లు నివేదిక పేర్కొంది.
Next Story

