పాకిస్తాన్ లో భారీ ఆత్మాహుతి దాడి
x
క్వెట్టాలో జరిగిన పేలుడు

పాకిస్తాన్ లో భారీ ఆత్మాహుతి దాడి

14 మంది మృతి, 35 మందికి తీవ్ర గాయాలు


పాకిస్తాన్ లోని క్వెట్టాలో బలూచిస్తాన్ నేషనల్ పార్టీ(బీఎన్పీ) నిర్వహించిన బహిరంగ ర్యాలీ సందర్భంగా భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 14 మంది మరణించారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సర్ధార్ అత్తౌల్లా మెంగల్ నాల్గవ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీ ముగిసిన తరువాత మంగళవారం రాత్రి సరియాబ్ ప్రాంతంలో షావానీ స్టేడియం సమీపంలో పేలుడు సంభవించిందని ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక కథనం ప్రసారం చేసింది.

ప్రజలు మరణించారని ప్రావిన్షియల్ ఆరోగ్యమంత్రి బఖ్త్ ముహ్మద్ కాకర్ ధృవీకరించారు. ఇది ఆత్మాహుతి దాడి అని అధికారులు నిర్ధారించారని డాన్ పత్రిక కూడా నివేదించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమావేశం ముగిసిన 15 నిమిషాల తరువాత పేలుడు సంభవించింది. సమావేశంలో పాల్గొన్నవారు బయటకు వెళ్తుండగా పార్కింగ్ ప్రాంతంలో బాంబుదాడి చేసిన వ్యక్తి తన పేలుడు పదార్థాలు నిండిన జాకెట్ ను పేల్చుకున్నాడని తెలుస్తోంది.

డాన్ పత్రిక ప్రకారం.. సమావేశానికి అధ్యక్షత వహించిన బీఎన్పీ చీఫ్ అక్తర్ మెంగల్ ఇంటికి బయలుదేరినప్పుడు పేలుడు సంభవించింది. అయితే అతను గాయపడలేదు. ఇందులో ఫఖ్తున్వ్కా మిల్లీ అవామీ పార్టీ చీఫ్ మెహమూద్ ఖాన్ అచక్జాయ్, అవామీ నేషనల్ పార్టీకి చెందిన అస్గర్ ఖాన్ అచక్జాయ్, నేషనల్ పార్టీకి చెందిన మాజీ సెనేటర్ మీర్ కబీర్ ముహ్మద్ షాయ్ కూడా ర్యాలీలో పేర్కొన్నారు. అయితే వీరు కూడా దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

అయితే గాయపడిన వారిలో బీఎన్పీ మాజీ ప్రావిన్షియన్ అసెంబ్లీ సభ్యుడు మీర్ అహ్మద్ నవాజ్ బలోచ్, పార్టీ కేంద్ర కార్మిక కార్యదర్శి మూసా జాన్, అనేక మంది పార్టీ కార్యకర్తలు మద్దతుదారులు ఉన్నారు.
బీఎన్పీ చీఫ్ మెంగల్ సోషల్ మీడియా పోస్ట్ లో తాను సురక్షితంగా ఉన్నానని ధృవీకరించారు. పేలుడులో 15 మంది బీఎన్పీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి మీర్ సర్ప్రాజ్ బుగ్తి ఈ దాడిని ఖండించారు. దీనిని మానవత్వ శత్రువుల పిరికి చర్యగా అభివర్ణించారు.
ఇటువంటి ఉగ్రవాద చర్యలు ప్రావిన్స్ ను అస్థిరపరచడానికి, అమాయక పౌరులలో భయాన్ని వ్యాప్తి చేయడానికి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పేలుడు తరువాత క్వెట్టా చుట్టుపక్కల ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేసి, ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. బాంబు దాడికి ఇప్పటి వరకూ ఏ సంస్థ బాధ్యత వహించలేదు.
Read More
Next Story