గూగుల్ నుంచి చల్లటి చావు కబురు
x
సందర్ పిచాయ్, గూగుల్ సీఈఓ

గూగుల్ నుంచి చల్లటి చావు కబురు

టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన భవిష్యత్ ప్రణాళికను వివరించింది. వ్యయాన్ని తగ్గించుకోవడానికి మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.


టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి బాంబ్ పేల్చింది. ఇప్పటికే వివిధ విభాగాల నుంచి ఐటీ నిపుణులను తొలగించిన ఈ సంస్థ, తాజాగా మరో విడత తొలగింపును చేపడతామని ప్రకటించింది. ఈ మేరకు అంతర్గత నివేదికను ఉద్యోగుల ముందుంచింది. " మేము మరోమారు కఠిన నిర్ణయం తీసుకోబోతున్నాం, ఈ సంవత్సరం కంపెనీ తన ప్రతిష్టాత్మక లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన పెట్టుబడులపై దృష్టి పెట్టాలని అనుకుంటోంది, అందుకే మరోసారి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది " అని కంపెనీ అంతర్గత రిపోర్ట్ లో సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పినట్లు ఓ నివేదిక బయటకు వచ్చింది.

ఇప్పటికే కంపెనీ ఈ నెల మొదటి వారంలో దాదాపు వేయి మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. తాజాగా ఈ నివేదిక లో తొలగింపు ప్రస్తావన రావడంతో ఇంకెందరికి పింక్ స్లిప్ ఇస్తారో అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

కంపెనీ తన ప్రణాళిక లక్ష్యాలకు అనుగుణంగా వివిధ రంగాలలోని ఉద్యోగులను తొలగించి పున: వ్యవస్థీకరించింది. వీటిలో హర్డ్ వేర్, ప్రకటనల విక్రయాలు, ఇన్విస్టేగేషన్, షాపింగ్, మ్యాప్స్, పాలసీ, కోర్ ఇంజనీరింగ్, యూట్యూబ్ టీమ్ లో వారిని ఇంటికి పంపింది. వీటిలో గూగుల్ నెస్ట్, ఫిక్సల్, ఫిట్ బైట్, యాడ్ సేల్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ టీమ్ లలోని ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితం అయ్యారు.

అయితే ఈ సారి అన్నీ ఐటీ డిపార్ట్ మెంట్ లు ఉద్యోగుల కోతల వల్ల ప్రభావితం కావని సుందర్ పిచాయ్ హమీ ఇచ్చారు. " గత సంవత్సరం లా కాకుండా ఈ సంవత్సరం ఉద్యోగులను తొలగించం, అన్ని డిపార్ట్ మెంట్ ల నుంచి కూడా ఉద్యోగులను తొలగించం " అని చెప్పారు. 2023లో గూగుల్ ఏకంగా 12000 వేల మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చింది.

తొలగింపు మాత్రం కచ్చితంగా ఉంటుందని పిచాయ్ స్పష్టం చేశారు. కొన్ని విభాగాల్లో పనిని సులభం చేయడానికి ఆలోచిస్తున్నామని, వాటి పని తీరు మెరుగు పరిచే అవకాశాలు పరిశీలిస్తామని చెప్పారు. ఈ మార్పులన్నీ ఇప్పటికే ప్రకటించాం. అవన్నీ మీ ముందే కనిపిస్తున్నాయి. అయితే అవసరం ఉన్నచోట మాత్రం వనరులను కేటాయిస్తామని కొన్ని టీమ్ లు మాత్రం ప్రభావితం అవుతాయని అంతర్గత నివేదికలో చెప్పినట్లు తెలిసింది.

గూగూల్ మాతృసంస్థ అయిన అల్పాబెట్ ఏఐ పై పెట్టుబడులు, పరిశోధన చేయడానికి సిద్దం అవుతోంది. అందుకే కంపెనీ వ్యయాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. గత ఏడాది 12000 ఉద్యోగులను తొలగించింది. ఇదీ ప్రపంచవ్యాప్తంగా గూగుల్ కు ఉన్న వర్క్ ఫోర్స్ లో దాదాపు ఆరు శాతానికి సమానం. ప్రస్తుతం కూడా ఇదే దారిలో వెళ్తోంది. ఉద్యోగులను క్రమబద్దీకరించి తద్వారా కంపెనీ పున: నిర్మాణం చేయాలని, ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read More
Next Story