జైశంకర్ తో భేటీ అయినా చైనా విదేశాంగ మంత్రి, ఏం మాట్లాడుకున్నారంటే..
x

జైశంకర్ తో భేటీ అయినా చైనా విదేశాంగ మంత్రి, ఏం మాట్లాడుకున్నారంటే..

కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరుగుతున్న షాంఘై కో ఆపరేషన్ సమ్మిట్ లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ తో , చైనా కౌంటర్ వాంగ్ యీ సమావేశం అయ్యారు.


భారత్- చైనా మధ్య ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి దౌత్య, సైనిక మార్గాల ద్వారా ప్రయత్నించుకోవాలని ఇరు దేశాలు మరోసారి నిర్ణయించుకున్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా కజక్ రాజధాని అస్తానాలో జరిగిన సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ద్వైపాక్షిక సంబంధాలు
వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)ని గౌరవించడం, సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతతను కాపాడుకోవడం, సంబంధాలను మెరుగుపరచడానికి అవసరమని జైశంకర్, వాంగ్‌తో అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు పరస్పర గౌరవం, ఆసక్తి, సున్నితత్వంపై ఆధారపడి ఉండాలన్న భారత్ అభిప్రాయాన్ని జైశంకర్ మరోసారి పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి.
గాల్వన్ ఘటన తరువాత ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రికత్తలు తారాస్థాయికి చేరుకున్నాయి. సైన్యంలోని బీహార్ రెజిమెంట్ కు చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందారు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు చైనా ఆర్మీ దాష్టికాలను ముందుండి అడ్డుకుని, అసువులు బాశాడు. చైనా పై భారత సైనికులు చేసిన ప్రతిదాడిలో దాదాపు 45- 60 మంది దాకా పీఎల్ఏ సైనికులు మృతి చెందారని అమెరికా వెల్లడించింది. కానీ చైనా మాత్రం కేవలం ముగ్గురు మాత్రమే చనిపోయినట్లు సంవత్సరం తరువాత ప్రకటించింది. అయితే అంతర్జాతీయ సమాజానికి ఎప్పుడూ కూడా చైనా నిజాలు ప్రకటించిన దాఖలా లేదు.
"సరిహద్దు ప్రాంతాల్లో మిగిలి ఉన్న సమస్యలపై ముందస్తు పరిష్కారంపై చైనా ప్రతినిధితో మాట్లాడినట్లు జైశంకర్ వెల్లడించారు. దౌత్య సైనిక మార్గాల ద్వారా ప్రయత్నాలను రెట్టింపు చేయడానికి అంగీకరించారు," అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో భారత విదేశాంగ మంత్రి చెప్పారు. 1962 లో ఏర్పడిన యుద్దం తరువాత ఏర్పడిన సరిహద్దులో శాంతి ఉంటేనే చైనాతో చర్చలు సజావుగా సాగుతాయని, సంబంధాలు సాధారణంగా ఉంటాయని న్యూఢిల్లీ, బీజింగ్ తో కొన్ని రోజులగా తెగేసీ చెబుతోంది. ఇప్పటికే టిబెట్ లోని కొన్ని ప్రాంతాలకు భారత్ పేరు పెట్టడానికి సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో చైనా కూడా భారత్ తో చర్చలు జరపడానికి అంగీకరిస్తోంది.
Read More
Next Story