ట్రంప్.. హారిస్ మధ్య దూషణల పర్వం.. ఇద్దరి నోట ‘చెత్త’ పదమే..
x

ట్రంప్.. హారిస్ మధ్య దూషణల పర్వం.. ఇద్దరి నోట ‘చెత్త’ పదమే..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండు పార్టీలకు చెందిన అభ్యర్థుల డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ అధ్యక్ష డిబెట్ లో పాల్గొన్నారు. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు ..


మీరు, మీ అధ్యక్షుడు అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కాదు.. నువ్వే అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు, మీ పరిపాలన కాలంలో చెత్త ఉపాధి కల్పన చేశారు.. ఇలా సాగింది అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన తొలి డిబెట్...

ఫిలడెల్ఫియాలో మంగళవారం రాత్రి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మధ్య జరిగిన మొదటి చర్చలో ఇద్దరు నేతలు ఒకరినొకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ , ABC న్యూస్ ద్వారా హోస్ట్ చేశారు. NBCలో సిమ్యుల్‌కాస్ట్ చేయబడింది, అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 9 EST (భారత్ కాలమానం ప్రకారం ఉదయం 6.30 am IST)కి ప్రారంభమైంది
ఈ డిబెట్ దాదాపు ఒకటిన్నర గంటల పాటు సాగింది. ఇరువురు అభ్యర్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ హక్కులు, ఇజ్రాయెల్-గాజా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలు, ఇమ్మిగ్రేషన్ చట్టాలపై వాదించుకున్నారు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు తమ వాగ్థాటిని కొనసాగించారు.
జో బైడెన్- కమలా హ్యారిస్ లు ఇద్దరు అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అని మాజీ అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు. దీనికి కౌంటర్ గా ‘‘ అమెరికా అంటే అందరిదని, మనల్ని వేరు చేసే వ్యవస్థల నుంచి కొత్త మార్గాన్ని కనుగొన్నామని’’ హ్యారిస్ వ్యాఖ్యానించారు.
పదునైన వాగ్థానాలు..
వయో భారం.. డెమోక్రాటిక్ పార్టీలో వచ్చిన విభేదాలతో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి అధ్యక్ష రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. కేవలం ఏడు వారాల క్రితమే కమలా హ్యారిస్ ఎన్నికల అభ్యర్థిత్వంలోకి అడుగుపెట్టింది. ఆమె విధానాలను ప్రజలకు, పార్టీ నాయకులకు వివరించే సమయం కూడా చిక్కలేదు. అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన చర్చల్లో జో బైడెన్ తడబడటం, తరువాత ట్రంప్ పై హత్యాయత్నంతో అమెరికా మాజీ అధ్యక్షుడి గ్రాఫ్ అమాంత పెరిగిన సంగతి తెలిసిందే.
ఎనిమిదేళ్లలో మొదటిసారి, ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు చర్చకు ముందు కరచాలనం చేశారు, హారిస్ ట్రంప్‌కు తనను తాను పరిచయం చేసుకుని కరచాలనం చేశారు. అభ్యర్థులుగా కూడా ఒకరినొకరు కలుసుకోవడం ఇదే తొలిసారి.
2017 నుంచి 2021 వరకు తన పదవీ కాలంలో మహా మాంద్యం నుంచి దేశాన్ని "చెత్త ఉపాధి" స్థితిలోకి నెట్టారని హారిస్ తీవ్రంగా విమర్శించారు.కరోనా కాలంలో దేశాన్ని విడిచిపెట్టాడని ఆరోపించారు. బైడెన్ పరిపాలన కాలంలో ట్రంప్ పరిపాలన కాలంలో జరిగిన తప్పులను సవరించాల్సి వచ్చిందని హరిస్ వివరించారు.
హారిస్ తన మధ్యతరగతి నేపథ్యాన్ని, ఆమె అధ్యక్షుడైతే చిన్న వ్యాపారాలు, కుటుంబాలకు మద్దతు ఇవ్వాలనే ఆమె ప్రణాళికలను కూడా హైలైట్ చేసింది. మరోవైపు బిలియనీర్లు, పెద్ద కంపెనీలకు ట్రంప్ పన్ను తగ్గింపును అందజేస్తారని ఆమె అన్నారు. "డొనాల్డ్ ట్రంప్‌కు మీ కోసం ఎటువంటి ప్రణాళికలు లేవు" అని హారిస్ అన్నారు.
హారిస్ మార్క్సిస్ట్
కమలా హ్యారిస్ ఓ మార్క్సిస్టు అని, ఆమె తండ్రి కూడా మార్క్సిస్టు అని ట్రంప్ ఆమెకు కౌంటర్ ఇచ్చారు. మహమ్మారితో తన పరిపాలన చేసిన "అద్భుతమైన పని" కోసం తనకు తగినంత క్రెడిట్ లభించలేదని ట్రంప్ చెప్పారు.
అబార్షన్ల వివాదాస్పద అంశంపై, హారిస్ మాట్లాడుతూ, ఒక మహిళ తన శరీరంతో ఏమి చేయాలో ట్రంప్ చెప్పకూడదు. అత్యాచార బాధితులు తమ బిడ్డలను ప్రసవానికి తీసుకురావడానికి ఇష్టపడరని ఆమె వాదించారు. "అబార్షన్‌పై నిషేధంపై నేను సంతకం చేయడం లేదు. రాష్ట్రాలు దానిపై ఓటింగ్ చేస్తున్నాయి" అని ట్రంప్ అన్నారు.
"నేను IVFలో నాయకురాలిగా ఉన్నాను. ఆమె 7వ, 8వ 9వ నెలల్లో మరియు బహుశా పుట్టిన తర్వాత అబార్షన్‌ని అనుమతిస్తుందా?" అని ట్రంప్ ప్రశ్నించాడు.
ఇజ్రాయెల్-పాలస్తీనా
హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌పై దాడి చేసిందని, తనను తాను రక్షించుకునే హక్కు వారికి ఉందని హారిస్ అన్నారు. "ఈ యుద్ధం ముగియాలి - మాకు కాల్పుల విరమణ ఒప్పందం అవసరం. మాకు బందీలు కావాలి. ఇజ్రాయెల్, పాలస్తీనాకు భద్రత ఉండాలి," హ్యరిస్ అన్నారు. ఉక్రెయిన్ వివాదంపై ట్రంప్ మాట్లాడుతూ.. "నేను అధ్యక్షుడిగా ఉంటే, యుద్ధం ప్రారంభమయ్యేది కాదు. . అసలు రష్యా, ఉక్రెయిన్ లోని ప్రవేశించేది కాదు’’ అని చెప్పారు.
"కమలాకు.. ఇజ్రాయెల్- అరబ్ జనాభా ను ద్వేషిస్తుంది. ఆమె అధ్యక్షుడైతే, ఇజ్రాయెల్ ఇక ఉండబోదు. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఇరాన్‌లో ఉగ్రవాదానికి డబ్బు లేదు. నేను ఎన్నుకోబడితే ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగిస్తాను," ట్రంప్ అన్నారు.
Read More
Next Story