సోమాలియా సముద్రపు దొంగల భరతం పట్టిన నేవీ.. ఏకంగా
x

సోమాలియా సముద్రపు దొంగల భరతం పట్టిన నేవీ.. ఏకంగా

అరేబియా సముద్రంలో ఓ నౌకను హైజాక్ చేసిన సోమాలియా సముద్రపు దొంగలపై నేవీ తన ప్రతాపాన్ని చూపింది. తమపై దాడి చేసిన వారిపై పరిమిత స్థాయిలో..


గడిచిన కొన్నినెలలుగా హిందూ మహా సముద్రంలో అలజడి సృష్టిస్తున్న సోమాలియా సముద్రపు దొంగలపై ఇండియన నేవీ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఎప్పటిలాగే అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకను స్వాధీనం చేస్తుకున్న సముద్రపు దొంగలు దానిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇంతలోనే నౌక నుంచి సాయం కావాలని అభ్యర్థన రావడంతో భారత నేవీ రంగంలోకి దిగి ఆపరేషన్ మొదలుపెట్టి, సముద్రపు దొంగల ఆటకట్టించింది.

భారత తీరానికి 1,400 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న వాణిజ్య నౌకలో ఉన్న 35 మంది సముద్రపు దొంగలను భారత నేవీ అదుపులోకి తీసుకుంది. నౌకలో ఉన్న 17 మంది సిబ్బందిని రక్షించింది.
నావికాదళం దాని P-8I సముద్ర గస్తీ విమానం, ఫ్రంట్‌లైన్ నౌకలు INS కోల్‌కతా INS సుభద్ర తో కూడిన బృందం ఈ ఆపరేషన్ లో పాల్గొంది. మానవ రహిత విమానం ద్వారా నౌకలో ఉన్న పరిస్థితిని అంచనా వేసిన తరువాత C-17 విమానం ద్వారా MARCOS కమాండోలు ఆపరేషన్ కోసం నౌకలోకి ప్రవేశించారు.
అంతకుముందు, సోమాలియా సముద్రపు దొంగల బృందం సోమాలియా తూర్పు తీరంలో నౌకలను హైజాక్ చేయడానికి చేసిన ప్రయత్నాలను సైతం విఫలం చేసినట్లు నావికాదళం తెలిపింది. సాయుధ సముద్రపు దొంగలు మూడు నెలల క్రితం హైజాక్ చేయబడిన రుయెన్ అనే కార్గో షిప్‌లో ప్రయాణించారని వారు తెలిపారు.
"ఐఎన్ఎస్ కోల్‌కతా, గత 40 గంటల్లో విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించి 35 మంది సముద్రపు దొంగలను లొంగిపోయేలా చేసింది. అలాగే 17 మంది సిబ్బందిని ఎలాంటి గాయాలు కాకుండా కాపాడింది" అని నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వల్ తెలిపారు.
MV Ruen అనే ఓడను సోమాలియా సముద్రపు దొంగలు గత ఏడాది డిసెంబర్ 14న హైజాక్ చేశారని, సముద్రంలో పైరసీ కార్యకలాపాలు నిర్వహించేందుకు పైరేట్ షిప్‌గా దానినే ఉపయోగించుకున్నట్లు నేవీ తెలిపింది. అయితే సముద్రపు దొంగలు భారతీయ నౌకపై కాల్పులు జరిపారని, ఆత్మరక్షణ కోసం భారత నేవీ కూడా ఎదురుదాడికి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిందని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. దొంగ తనం చేసిన ఓడ, అందులోని పౌరులను విడుదల చేయాలని ఇండియన్ నేవీ ఆదేశించింది. దాడికి గురైన నౌక బంగ్లాదేశ్ జెండాతో ఉన్నట్లు తెలుస్తోంది. సోమాలియా సముద్ర తీరం వరకు నౌకకు రక్షణగా నేవీ వెళ్లినట్లు తెలిసింది.
ఈ నెల ప్రారంభంలో, సోమాలియా తూర్పు తీరం వెంబడి 11 మంది ఇరానియన్, ఎనిమిది మంది పాకిస్తానీ సిబ్బందితో ప్రయాణిస్తున్న నౌకపై కూడా దాడి జరిగింది. ఈ ప్రయత్నాన్ని కూడా భారత నేవీ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
అంతకుముందు జనవరిలో, సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగలు ఇరాన్ జెండాతో కూడిన ఫిషింగ్ ఓడపై దాడి చేయడంతో భారతీయ యుద్ధనౌక INS సాయమందించింది. ఇందులో పాకిస్తాన్ కు చెందిన 19 మంది సిబ్బంది ఉన్నారు.జనవరి 5న ఉత్తర అరేబియా సముద్రంలో లైబీరియన్ జెండాతో కూడిన MV లీలా నార్ఫోక్ నౌకను హైజాక్ చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంది
అరేబియా సముద్రంతో సహా కీలకమైన సముద్ర మార్గాలలో సముద్ర వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని సముద్ర భద్రతా కార్యకలాపాల కోసం నౌకాదళం ఇప్పటికే తన ఫ్రంట్‌లైన్ నౌకలు, నిఘా విమానాలను రంగంలోకి దించింది.
గత కొన్ని నెలలుగా ఎర్ర సముద్రంలో కార్గో నౌకలపై హౌతీ మిలిటెంట్లు వరుస దాడులు చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిని దృష్టి లో ఉంచుకుని భారత నేవీ అప్రమత్తతో వ్యవహరిస్తోంది. భారత్ కు సముద్ర వాణిజ్యం ఆయువు పట్టు కావడంతో వ్యాపారం సజావుగా సాగడానికి నేవీ భారత ప్రభుత్వం మోహరించింది.
Read More
Next Story