అట్టహాసంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్..
x
ఒలింపిక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా పారిస్‌లో ఫ్రెంచ్ జెండా రంగుల్లో వ్యాపించిన పొగలు

అట్టహాసంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్..

33వ ఒలింపిక్ క్రీడలకు పారిస్ అతిథ్యమిచ్చింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నగరం వేదికగా క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.


33వ ఒలింపిక్ క్రీడలకు పారిస్ అతిథ్యమిచ్చింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నగరం వేదికగా ఒలింపిక్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్‌ చరిత్రలోనే తొలిసారి ఫ్రాన్స్‌లో సెన్‌ నదిలో ఈ వేడుకలు చేపట్టారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాక్, వివిధ క్రీడల్లోని దిగ్గజ అథ్లెట్లు, వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.


ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (మధ్యలో), IOC అధ్యక్షుడు థామస్ బాచ్ (ఎడమవైపు)

సెన్ నదిపై పరేడ్ ...

భారీ వర్షం మధ్య 'పెరేడ్ ఆఫ్ నేషన్స్' ప్రారంభమైంది. సెన్ నదిలో సుమారు 6 కిలోమీటర్ల మేర ఈ పరేడ్ జరిగింది. 85 పడవలపై 6800 మంది అథ్లెట్లు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందులో 205 దేశాలకు చెందిన అథ్లెట్లు, సహాయక సిబ్బంది, అధికారులు ఉన్నారు. ఈ వేడుకలను చూసేందుకు సుమారు 3.20 లక్షల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ప్రారంభ వేడుకలను చూసేందుకు వీలుగా నది పరిసరాల్లో సుమారు 80 భారీ స్ర్కీన్ లను ఏర్పాటు చేశారు.


పారిస్‌లో బోటు ఎక్కేందుకు వెళుతున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ PV సింధీ, ఇతర క్రీడాకారులు

భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ..

ఈ సారి ఒలింపిక్ క్రీడల్లో 47 మంది మహిళలతో సహా 117 మంది క్రీడాకారులు ఇండియా తరుపున పాల్గొనబోతున్నారు. భారత క్రీడాకారుల జట్టుకు రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు, టేబుల్ టెన్నిస్ లెజెండ్ ఎ శరత్ కమల్ నాయకత్వం వహించారు. జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. మహిళా క్రీడాకారులు చీరలు ధరించగా, పురుష క్రీడాకారులు సాంప్రదాయ 'కుర్తా-పైజామా'తో కనిపించారు.


Read More
Next Story