పైలెట్ ను రక్షించినట్లు ప్రకటించిన అమెరికా
x

పైలెట్ ను రక్షించినట్లు ప్రకటించిన అమెరికా

మొన్న యూఎస్ ఎఫ్-16 ఈ స్ట్రైకర్ ను కూల్చిన ఇరాన్, విజయవంతంగా రెస్య్కూ మిషన్ ముగింపు


Click the Play button to hear this message in audio format

ఇరాన్ దళాలు అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చిన ఘటనలో పైలెట్ ను సురక్షితంగా రెస్క్యూ చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. రెండు రోజుల క్రితం యూఎస్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఒక ఎఫ్-15ఈ స్టైక్ ఈగిల్ విమానాన్ని ఇరాన్ నేలకూల్చింది.

అయితే పైలెట్ ఈ దాడి నుంచి దిగ్విజయంగా తప్పించుకుని ఇరాన్ లో ల్యాండ్ అయ్యాడు. అప్పటి నుంచి ఇటూ ఇరాన్, అటూ అమెరికా పైలట్ కోసం జల్లెడ పట్టాయి. చివరకూ అమెరికా తన పైలెట్ ను సురక్షితంగా రక్షించినట్లు పేర్కొంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్రూత్ సోషల్‌లో "మేము అతన్ని పట్టుకున్నాం!" అనే మూడు పదాలతో ప్రారంభమైన ఒక విజయగర్వ పోస్ట్‌లో ఈ మిషన్‌ను ధృవీకరించారు. ఇది "అమెరికా చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన గాలింపు, రక్షణ చర్యలలో ఒకటి" అని ఆయన ప్రకటించారు.
శత్రువులు దగ్గరవుతున్న కానీ అమెరికా యోధుడు వారికి పట్టుబడకుండా చివరికి సురక్షిత స్థావరానికి చేరుకున్నట్లు ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నాడు. మొదటి రక్షణ ప్రయత్నంలో అమెరికా విఫలమైనప్పటికీ రెండో ప్రయత్నంలో రక్షించినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని వాషింగ్టన్ గోప్యంగా దాచింది. ఇందులోని విషయాలు ఏ హాలీవుడ్ సినిమా కైనా పోటీ వచ్చే విధంగా ఉన్నాయని సమాచారం.

రెస్క్యూ ఎలా జరిగింది?

ఆక్సియోస్ ప్రకారం, శుక్రవారం నాడు హెలికాప్టర్ నుంచి బయటకు దూకిన కొద్దిసేపటికే పైలట్, వెపన్స్ సిస్టమ్ ఆఫీసర్ ఇద్దరూ తమ కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా ఒకరితో ఒకరు సంప్రదించుకున్నారు. కొన్ని గంటల్లోనే పైలట్‌ను రక్షించారు. కానీ ఆ ఆపరేషన్ సమయంలో, ఇరాన్ ఒక అమెరికన్ బ్లాక్ హాక్ హెలికాప్టర్‌పై దాడి చేసింది. దీంతో అందులోని సిబ్బంది గాయపడ్డారు. ఆ తర్వాత అది తిరిగి ఎగరలేకపోయింది.
కల్నల్‌ను గుర్తించడానికి చాలా ఎక్కువ సమయం పట్టింది. CIA, తమకున్న ప్రత్యేక సామర్థ్యాలను ప్రదర్శించింది. అతను ఒక రోజుకు పైగా పర్వత ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ, స్థానికుల కంట పడకుండా తప్పించుకుంటుండగా అతని జాడను పసిగట్టింది. ఈలోగా, ఇరాన్ అధికారులు కూడా ఆ సైనికుడి కోసం గాలింపు చేపట్టింది.
అతన్ని సజీవంగా పట్టుకున్న పౌరులకు సుమారు 66,000 డాలర్ల బహుమతిని ప్రకటించినట్లు సమాచారం. అయితే పైలెట్ రక్షించడానికి సీఐఏ తప్పుడు ప్రచారం ప్రారంభించింది. అమెరికా దళాలు ఇప్పటికే సైనికుడి జాడ కనుగొన్నాయని వెంటనే భూమార్గం గుండా తీసుకువెళ్తున్నారని ప్రచారం చేసింది. ఇది మంచి ఫలితాలను ఇచ్చింది.
అతని కచ్చితమైన స్థానం తెలిసిన తర్వాత, ఆ సమాచారాన్ని వైట్ హౌస్, పెంటగాన్, అమెరికా సైనిక కమాండర్లతో పంచుకున్నారు. శనివారం రాత్రి ఒక ప్రత్యేక దళాల బృందాన్ని సమీపంలోకి దించారు. ఏ-10 వార్‌హాగ్ దాడి విమానాలు సమీప వైమానిక రక్షణను అందిస్తుండగా, బ్లాక్ హాక్ హెలికాప్టర్లు తీవ్రమైన కాల్పుల మధ్య దూసుకువచ్చి అతన్ని బయటకు లాగాయి. ఇందుకోసం డజన్ల కొద్దీ విమానాలను మోహరించారు.
ఈ విషయంలో కూడా ట్రంప్ క్రెడిట్ తీసుకోవడంలో వెనకాడలేదు. "నా ఆదేశాల మేరకు, ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ఆయుధాలతో కూడిన డజన్ల కొద్దీ విమానాలను అమెరికా సైన్యం అతన్ని తీసుకురావడానికి పంపింది," అని ఆయన రాశారు. తన కమాండర్లు, తోటి యోధులు కల్నల్ ఉన్న ప్రదేశాన్ని "రోజుకు 24 గంటలూ పర్యవేక్షిస్తూ, అతని రక్షణ కోసం శ్రద్ధగా ప్రణాళికలు రచిస్తున్నారని" కూడా ఆయన తెలిపారు.
శుక్రవారం జరిగిన మొదటి రికవరీ ప్రయత్నంలో, రక్షించబడిన పైలట్‌ను తీసుకువెళ్తున్న ఒక అమెరికన్ హెలికాప్టర్‌పై చిన్న ఆయుధాలతో కాల్పులు జరిగాయి. దీనివల్ల అందులోని సిబ్బంది గాయపడ్డారు. అయినప్పటికీ ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. నివేదికల ప్రకారం, ఈ మిషన్‌కు మద్దతు ఇస్తున్న ఏ-10 వార్‌హాగ్ కూడా కాల్పులకు గురై దెబ్బతింది, దాని పైలట్ పర్షియన్ గల్ఫ్‌పై ఎజెక్ట్ అయిన తర్వాత సురక్షితంగా రక్షించారు.

ఒక చారిత్రాత్మక మైలురాయి..

ఎఫ్-15ఈ కూల్చివేత గత 20 ఏళ్లకు పైగా యుద్ధంలో ఒక అమెరికన్ ఫైటర్ జెట్ కూలిపోవడం ఇదే మొదటిసారి. ఈ రెండు రక్షణ చర్యలను ట్రంప్ జాతీయ ఐక్యతకు ఒక కీలకమైన ఘట్టంగా అభివర్ణించారు. "ఇది రిపబ్లికన్, డెమోక్రాట్ మిగతా ప్రతి ఒక్కరూ గర్వపడాల్సిన ఐక్యంగా నిలవాల్సిన క్షణం," అని ఆయన రాశారు.
"ఒక్క అమెరికన్ కూడా చనిపోకుండా, కనీసం గాయపడకుండా ఈ రెండు ఆపరేషన్లను మనం విజయవంతంగా పూర్తి చేయగలిగామన్న వాస్తవం, ఇరాన్ గగనతలంపై మనం తిరుగులేని వాయు ఆధిపత్యాన్ని సాధించామని మరోసారి నిరూపిస్తుంది." ఐదు వారాల క్రితం ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 13 మంది అమెరికా సైనికులు మరణించారు.
ట్రంప్ ఈ మిషన్‌ను అమెరికా సైనిక ఆధిపత్యానికి నిదర్శనంగా కీర్తించినప్పటికీ, ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలపై నిరంతర బాంబు దాడులు జరుగుతున్నప్పటికీ అమెరికా బలగాలు ఇంకా బలహీనంగానే ఉన్నాయని ఈ సంఘటన స్పష్టం చేసిందని విశ్లేషకులు పేర్కొన్నారు.
Read More
Next Story