అవామీ లీగ్ నిషేధంపై అమెరికా ఆందోళన
x
బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మాద్ యూనస్

అవామీ లీగ్ నిషేధంపై అమెరికా ఆందోళన

ప్రజాస్వామ్యంలో అందరి గొంతు వినాలన్న యూఎస్ చట్టసభ సభ్యులు


బంగ్లాదేశ్ లో మొన్నటి వరకూ అధికారంలో ఉన్న అవామీ లీగ్ పై మహ్మాద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించడంపై అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్ ప్రజలు స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉండాలని వారు అభిప్రాయపడ్డారు.

యూనస్ కు లేఖ..
హౌజ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ ర్యాంకింగ్ సభ్యుడు గ్రెగోరి మీక్స్, దక్షిణ మధ్య ఆసియా సబ్ కమిటీ చైర్మన్ బిల్ హుయిజేంగా, అదే సబ్ కమిటీ ర్యాంకింగ్ సభ్యురాలు సిడ్నీ కమ్లేగర్- డోవ్ కాంగ్రెస్ మహిళా జూలీ జాన్సన్ ఫిబ్రవరి ఎన్నికలకు ముందు ఒక రాజకీయ పార్టీపై పూర్తి నిషేధం విధించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై బంగ్లా తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ కు లేఖ రాశారు.
బంగ్లాదేశ్ ప్రజల గొంతును బ్యాలెట్ బాక్స్ ద్వారా శాంతియుతంగా వ్యక్తీకరించడానికి స్వేచ్చాయుతంగా ఎన్నికలు నిర్వహించాలని, అలాగే రాజ్యాంగ సంస్థలపై విశ్వాసాన్ని పునరుద్దరించే చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు లేఖలో కోరారు.
‘‘ప్రభుత్వం రాజకీయ పార్టీల కార్యకలాపాలను నిలిపివేసినా లేదా లోపభూయిష్ట అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్ ను తిరిగి ప్రారంభించినా ఇది జరగదని మేము ఆందోళన చెందుతున్నాము’’ అని వారు అన్నారు.
బంగ్లాదేశ్ లో 2018, 2024 లో స్వార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగలేదని విదేశాంగ శాఖ, ఇతర అంతర్జాతీయ పరిశీలకులు గుర్తించారని శాసనసభ్యులు తెలిపారు.
గత ఏడాది జూలై- ఆగష్టు లలో జరిగిన నిరసనల సందర్భంగా భద్రతా సంస్థలు 1400 మందిని హత్య చేశాయని, ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఫిబ్రవరిలో విడుదల చేసిన నిజనిర్థారణ నివేదికలో అంచనా వేసింది.
‘‘ఈ చర్యలకు, ఇతర చర్యలకు నిజమైన జవాబుదారీతనం బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించాలి. ప్రతీకార చక్రాన్ని కొనసాగించకూడదు’’ అని శాసనసభ్యులు అన్నారు. ఏదైన రాజకీయ పార్టీ కార్యకలాపాలను నిలిపివేయాలనే నిర్ణయం ఆ సహజ సూత్రాలకు విరుద్దంగా ఉందని అమెరికా చట్టసభ్యులు అన్నారు.
ఉగ్రవాద చట్టం..
ఏదైన రాజకీయ పార్టీ కార్యకలాపాలను నిలిపివేయాలనే నిర్ణయాన్ని యూనస్ ప్రభుత్వం లేదా ఎన్నికైన వారసుడు పున:పరిశీలిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘బంగ్లాదేశ్ ప్రజలు స్వేచ్ఛగా, న్యాయంగా జరిగే ఎన్నికలలో గెలిచిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అర్హత కలిగి ఉంది. దీనిలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలి. తద్వారా వారి గొంతు ప్రజాస్వామ్యంలో వినిపిస్తుంది’’ అని యూఎస్ చట్టసభ సభ్యులు అన్నారు.
బంగ్లాదేశ్ రాత్రికి రాత్రే సవరించిన ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం.. పదవీచ్యుడుతైన ప్రధానమంత్రి షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ కార్యకలాపాలన్నింటిని నిషేధించింది.
బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్ దాని నాయకులు, కార్యకర్తలపై విచారణ పూర్తి చేసే వరకూ అవామీ లీగ్ దాని అనుబంధ సంస్థలను ఉగ్రవాద నిరోధక చట్టం-2025 కింద నిషేధించారు.
Read More
Next Story