
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో నెతన్యాహూ
‘‘ఇజ్రాయెల్ చెప్పింది నమ్మి దాడులకు దిగారు’’
ట్రంప్ మాతో మాట్లాడానికి కూడా నిరాకరించారన్న మాజీ ఉగ్రవాద వ్యతిరేక అధికారి
ఇరాన్ పై దాడి విషయంలో పూర్తి నిర్ణయం అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నది కాదని, ఇజ్రాయెల్ ఒత్తిడి మేరకు వైమానికదాడులు జరిగాయని ఇటీవల రాజీనామా చేసిన అమెరికా మాజీ ఉగ్రవాద నిరోధక డైరెక్టర్ జో కెంట్ అన్నారు. వైమానిక దాడులపై సందేహాలున్నప్పటికీ తనతో పాటు ఇతర సీనియర్ అధికారులతో డొనాల్డ్ ట్రంప్‌తో ఎలాంటి చర్చలకు అంగీకరించలేదని ఆయన ఆరోపించారు.
ఇరాన్‌పై దాడి చేయాలనే తను నిర్ణయం తీసుకోవడంలో అధ్యక్షుడు కొద్దిమంది సలహాదారుల బృందంపై మాత్రమే ఆధారపడ్డారని కెంట్ అన్నారు. ఇరాన్ అమెరికాకు తక్షణ ముప్పు కలిగిస్తుందనడానికి ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ, ఇజ్రాయెల్ ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చిందని కెంట్ అన్నారు.
"చాలా కీలక అధికారులు వచ్చి అధ్యక్షుడికి తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఆయన అనుమతించలేదు," అని కెంట్ ఓ టీవీ షో కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. "అక్కడ బలమైన చర్చ జరగలేదు" అని కెంట్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలు ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడి చేయాలన్న ట్రంప్ నిర్ణయం వెనుక ఉన్న అంతర్గత విషయాలను కెంట్ వెల్లడించారు.
జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం అధిపతిగా, ఉగ్రవాద ముప్పులను విశ్లేషించడం, గుర్తించడం వంటి బాధ్యతలు కలిగిన ఏజెన్సీకి కెంట్ నాయకత్వం వహించారు. అతని పనిని జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్ పర్యవేక్షించారు. ఇరాన్ ఒక ముప్పుగా పరిణమిస్తుందా లేదా అనే విషయాన్ని నిర్ణయించాల్సింది ట్రంప్ మాత్రమేనని బుధవారం తులసీ గబ్బార్డ్ అన్నారు.
హవాయికి చెందిన మాజీ కాంగ్రెస్ సభ్యురాలు, సైనిక అనుభవజ్ఞురాలైన గబ్బార్డ్, గతంలో ఇరాన్‌పై సైనిక దాడుల విషయంలో విమర్శించారు. ప్రస్తుత దాడుల గురించి ఆమె ఏమనుకుంటున్నారో మాత్రం చెప్పలేదు. ఆమె ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ట్రంప్‌ను కలిసేందుకు తనకు ఉన్న మార్గాన్ని ఎవరు అడ్డుకున్నారో చెప్పడానికి కూడా కెంట్ నిరాకరించారు.
ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి పనిచేస్తోందని ఏ నిఘా సమాచారం లేదని, అయితే ఇజ్రాయెల్ ఒత్తిడి మేరకే ఈ దాడులు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ దాడులతో అమెరికా ప్రయోజనాలు ప్రమాదంలో పడ్డాయని మాత్రం చెప్పారు.
ఇరాన్ పై తప్పుడు ప్రచారం చేయడంలో అమెరికా మీడియా కూడా ముఖ్యపాత్ర పోషించిందని ఆయన ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రణాళికలే అమెరికాను చర్య తీసుకునేలా ప్రేరేపించాయని సూచిస్తూ, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మరియు హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఉదహరించారు. ధృవీకరించలేని సమాచారంలో ఇజ్రాయెల్ ప్రధానితో పాటు ఇతర అధికారులు ట్రంప్ పై దాడులు చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
"వారు చెప్పేది మేము విన్నప్పుడు, అది నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని ప్రతిబింబించలేదు," అని కెంట్ చెప్పారు. ఇరాన్ పై దాడి విషయంలో తన మాట ఎవరూ పట్టించుకోరని తెలిసిన తరువాత రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.
తన రాజీనామా తర్వాత కెంట్, కార్ల్‌సన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బహిరంగంగా మాట్లాడారు. కార్ల్‌సన్ కూడా ఇంతకుముందు యూదు వ్యతిరేక వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. కెంట్ ఒకప్పుడు సైన్యంలో పనిచేశారు. తరువాత సీఐఏలో చేరారు. 2019 లో సిరియాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో భార్య పిల్లలను కోల్పోయాడు.
Next Story

