
యుద్ధ గాయాలను దాచిపెడుతున్న అమెరికా
అమెరికా రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న ఇరాన్
అమెరికాకు యుద్ధంలో ఇరాన్ ఎంత నష్టం కలిగించిందనే వాస్తవాలు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే, గల్ఫ్ లో ఉన్న అమెరికా నౌకా, వైమానిక స్థావరాల మీద జరిగిన దాడుల గురించి వార్తలు ప్రచురించకుండ సర్వత్రా సెన్సార్ విధించారు.
ఒకవైపు అమెరికా పత్రికలు ఈ వార్తలను ప్రచురించడం లేదు. అలాగే తమ దేశాలలో ఉన్న అమెరికా స్థావరాల మీద ఇరాన్ దాడుల గురించి, ఈ దాడుల్లో చనిపోయిన పౌరుల గురించి ఆస్తుల నష్టం గురించి ఎవరూ మాట్లాడ్డానికి వీల్లేదని గల్ఫ్ దేశాలు కూడా ప్రజల మీద ఆంక్షలు విధించాయి.
కువాయిట్ లోనయితే, ఒక యుద్ధ దాడి గురించి వీడియో తీసిన వ్యక్తికి మరణశిక్షవిధించాలని ప్రాసిక్యూటర్లు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అమెరికాకు జరిగినష్టం తెలిసే అవకాశాలు కొన్నే. అవి, కొన్ని ఉపగ్రహ చిత్రాలు, కొంతమంది పౌరులు ధైర్యంగా, సెన్సార్ అంక్షలను లెక్క చేయకుండా షేర్ చేసి వీడియోల ద్వారానే తెలుస్తాయి.
యుద్ధం ప్రారంభమైన పది రోజుల్లో, ఎనిమిది మంది మరణించినట్లు అమెరికా అంగీకరించింది. మూడు ఫైటర్ జెట్‌లు అనుమానాస్పద పరిస్థితులలో కూలి పోయాయి. అయితే అమెరికన్ స్థావరాల నష్టం గురించి నివేదికలను పెంటగాన్ పత్రికా ప్రకటనలు విడుదల చేయడం లేదు. అవన్నీ ఉపగ్రహ చిత్రాలు, సెల్ ఫోన్ వీడియోల నుండి వచ్చాయి. యుద్ధకాల సెన్సార్‌షిప్ చట్టాలను ధిక్కరిస్తూ కొంతమంది వీటిని చిత్రీకరించారు. సెన్సార్‌షిప్ ముసుగు వెనుక, పెంటగాన్ అంగీకరించిన దానికంటే నష్టం చాలా తీవ్రంగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది.
అమెరికా 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury) ప్రారంభించిన కొన్ని గంటల్లోనే, ఇరాన్ మధ్యప్రాచ్యంలోని అమెరికన్ సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులను ప్రారంభించింది. అమెరికన్ విమానాలను కూల్చేయడం, ముఖ్యంగా, యుఎస్ అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి రక్షణ నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయడం లక్ష్యంగా ఇరాన్ దాడులను జరుపుతూ ఉంది. ఇరుగు పొరుగు దేశాలలో తిష్ట వేసి తన మీద ఈజీగా దాడులు చేస్తున్న అమెరికా గల్ఫ్ నుంచి దూరంగా తరిమేసే వ్యూహాన్ని ఇరాన్ పకడ్బందీగా అమలు చేేస్తున్నది. యుద్ధంలోగాయపడిన కొన్ని భారీ యుద్ధనౌకలు కూడా గల్ఫ్ నుంచి దూరంగా జరుగుతున్నట్లు స మాచారం.
మధ్యప్రాచ్యంలో అమెరికా కి ఎన్ని స్థావరాలు ఉన్నాయి?
అమెరికా మధ్యప్రాచ్యం అంతటా 19 శాశ్వత, తాత్కాలిక సైనిక స్థావరాల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో ఖతార్‌లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరం చాలా పెద్దది. ఇందులో ఏల్లపుడూ 10,000 మంది సైనికులుంటారు. ఇది US సెంట్రల్ కమాండ్ (CENTCOM) కు ఫార్వర్డ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది.
బహ్రెయిన్, ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో ఎనిమిది శాశ్వత US స్థావరాలు ఉన్నాయి. ఒక దశలో, 2025 మధ్యలో, ఈ ప్రాంతంలో ఒకేసారి 40,000 నుండి 50,000 మంది అమెరికన్ సైనికులు ఉండినారు.
ఈ స్థావరాలన్నీ పశ్చిమ, దక్షిణం నుండి ఇరాన్‌ను చుట్టుముట్టాయి. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో USS అబ్రహం లింకన్, USS గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ యుద్ధనౌకలతోఈ స్థావరాలు బలోపేతం అయ్యాయి. అణుశక్తితో నడిచే ఈ విమాన వాహక నౌకలలో 10,000 కంటే ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారు. వీటి మీద 130 కంటే ఎక్కువ యుద్ధ జెట్ లు ఉన్నాయి. అందుకే ఇరాన్ ఈ స్థావరాల మీద, ఈ యుద్ధ నౌకల మీద దాడిచేయమే తన ప్రధాన లక్ష్యమని ఇరాన్ తొలి నుంచి ప్రకటిస్తూ ఉంది. అలాగే దాడులు చేస్తూ ఉంది. ఆరు దేశాలలోని అమెరికా స్థావరాలను ఇప్పటికే ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ఢీకొట్టాయి. ముఖ్యమయిన అమెరికా, ఇజ్రేల్ సైన్యానికి కళ్ళలాగా పనిచేస్తున్న రాడార్ లను ఇరాన్ విజయవంతంగా దెబ్బతీసింది. ఒక వీడియో ని ఇక్కడ చూడవచ్చు.
ఏ అమెరికా స్థావరాలు దెబ్బతిన్నాయి?
మార్చి 10 నాటికి, అనేక US స్థావరాలను, కొన్ని అనుబంధ భవనాలను, అమెరికా మిలటీరీ అధికారులు ఉన్న హోటళ్లను ఇరానియన్ క్షిపణులు, డ్రోన్లు ధ్వంసం చేశాయి. కొన్నింటి మీద ఒకటి కంటే ఎక్కువసార్ల దాడి జరిగింది. ఇరాన్ దాడి చేసిన లక్ష్యాల్లో కొన్ని:
- నావికాదళ సహాయ కార్యకలాపాలు, బహ్రెయిన్ (US ఐదవ నౌకాదళం యొక్క ప్రధాన కార్యాలయం)
- మనామా, బహ్రెయిన్ (నగరంలో US దళాలు ఉన్న బహుళ అంతస్థలు హోటళ్ళు)
- ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇరాక్ (యుఎస్ బేస్ ప్రక్కనే ఉన్న విమానాశ్రయం)
- మువాఫాక్ సాల్టీ ఎయిర్ బేస్, జోర్డాన్
- అలీ అల్-సలేం ఎయిర్ బేస్, కువైట్
- క్యాంప్ బ్యూహ్రింగ్, కువైట్
- క్యాంప్ అరిఫ్జాన్, కువైట్
- మొహమ్మద్ అల్-అహ్మద్ కువైట్ నావల్ బేస్, కువైట్
- అల్-ఉదీద్ ఎయిర్ బేస్, ఖతార్
- అల్-దఫ్రా ఎయిర్ బేస్, యుఎఇ
- జెబెల్ అలీ పోర్ట్, యుఎఇ
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, సౌదీ అరేబియా
ఇరాన్ లక్ష్య జాబితాలో ఏముంది?
తమ దేశం మీద వైమానిక దాడి చేయకుండా అమెరికా సామర్థ్యాన్ని దెబ్బతీయడం, వైమానిక స్థావరాలను దూరంగా అమెరికా తరలించేలా చేయడం తన తక్షణ లక్ష్యాలని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ఆశించినట్లే ‘ఫ్లైట్‌రాడార్ 24’ నుండి వచ్చిన డేటా ప్రకారం, మార్చి 9న ‘ప్రిన్స్ సుల్తాన్’ ఎయిర్ బేస్ నుండి KC-135 స్ట్రాటోట్యాంకర్లను భారీగాఅమెరికా దూరప్రాంతాలకు తరలించింది. ప్రాథమిక లెక్క ప్రకారం, ఇరాన్‌పై అమెరికా విమానాలు ఎగిరే సామర్థ్యం 35-50% తగ్గింది.
అమెరికా సైన్యం దృష్టి చెదరగొట్టడం, ధాడ్ (THAAD) క్షిపణి రక్షణ నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయడంపై ఎక్కువగా ఇరాన్ ఎక్కువ దృష్టి పెట్టింది. యుద్దం మొదటి రోజున బహ్రెయిన్‌లోని నావల్ సపోర్ట్ యాక్టివిటీ వద్ద ఇరానియన్ షాహెద్ డ్రోన్ అమెరికా కు చెందిన AN/TPS-59 రాడార్ డోమ్‌పైకి దూసుకెళ్లి, $300 మిలియన్ల విలువైన వ్యవస్థను తుడిచిపెట్టింది.
ఈ రాడార్‌ను 2007లో స్థాపించారు. "వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణులను గుర్తించడానికి ప్రపంచంలో ఏర్పాటయిన ఏకైక 360-డిగ్రీల కవరేజ్ మొబైల్ రాడార్” లాక్‌హీడ్ మార్టిన్ అనే సంస్థ చెప్పింది. కాని ఇపుడేమయింది?
ఉపగ్రహ చిత్రాలు, వీడియో ఫుటేజ్ ప్రకారం, కువైట్‌లోని క్యాంప్ అరిఫ్జాన్, అలీ అల్-సలేం ఎయిర్ బేస్, యుఎఇలోని అల్-దఫ్రా వద్ద కూడా రాడార్ డోమ్‌లు ఇరాన్ దాడుల్లో ధ్వంసమయ్యాయి.
ఖతార్‌లోని అల్-ఉదీద్ ఎయిర్ బేస్ వద్ద, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరింటిలో ఒకటైన $1 బిలియన్ విలువైన AN/FPS-132 ‘ముందస్తు హెచ్చరిక రాడార్’ ఇన్‌స్టాలేషన్ ఉంది. దానిని ఫిబ్రవరి 28నే ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణి ఢీకొట్టిందని ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాడార్ పరికరాలను ధ్వంసం చేయడం ద్వారా, అమెరికా, ఇజ్రాయెల్ వచ్చే బాలిస్టిక్ క్షిపణులను ట్రాక్ చేసే సామర్థ్యాన్ని ఇరాన్ దెబ్బతీసింది.
దీని పర్యవసానాలను ఇజ్రాయెల్‌లో చూడవచ్చు. మార్చి 6 నాటికి ఇజ్రేల్ లో దాడి హెచ్చరిక గురించి సాధారణ సైరన్లు మోగించిన మూడు నిమిషాల లోపే ఇజ్రేల్ రాజధాని టెల్ అవీవ్ ఇరాన్ క్షిపణులు ఢీకొట్టాయి. సాధారణంగా దాడికి ఎనిమిది నిమిషాలు అవసరమవుతాయి. ఈ అంచానతో ఇజ్రేల్ ఉండింది. కానీ మూడునిమిషాల్లొనే క్షిపణలు వచ్చి పడ్డాయి. అంటే ఇరాన్ దాడిని ఇజ్రేల్ గుర్తించలేకపోయిందని అర్థం.
కనీసం నాలుగు ప్రదేశాలలో - జోర్డాన్‌లోని మువాఫ్ఫాక్ సాల్టి ఎయిర్ బేస్, సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, యుఎఇలోని రెండు ఎమిరాటీ నడిపే స్థావరాలు, యుఎస్-నిర్మించిన టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (THAAD) బ్యాటరీలతో అనుసంధానించబడిన AN/TPY-2 రాడార్ వ్యవస్థలను ఇరాన్ ఢీకొట్టింది. జోర్డాన్, సౌదీ అరేబియాలో, ఈ $500 మిలియన్ల రక్షణ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి.
నష్టాన్ని ఎలా కప్పిపుచ్చుతున్నారు?
నష్టం గురించి చెప్పండని పత్రికలు చేస్తున్న అభ్యర్థనలకు సమాధానం ఇవ్వడానికి పెంటగాన్ నిరాకరిస్తున్నది. ఏదైనా అడిగినపుడు అమెరికా మౌనంగా ఉండటం లేదా తిరస్కరించడం చేస్తున్నది. THAAD స్టేషన్లకు జరిగిన నష్టం గురించి అడిగినప్పుడు, "కార్యకలాపాల భద్రత కారణంగా, ఈ ప్రాంతంలోని స్థావరాల స్థితిగతుల మీద మేము వ్యాఖ్యానించబోము" అని అమెరికా డిఫెన్స్ శాఖ CNN కి చెప్పింది.
శుక్రవారం నాడు పశ్చిమ ఇరాక్‌లో అమెరికన్ కెసి-135 స్ట్రాటోట్యాంకర్ ఇంధనం నింపుకునే విమానం కూలిపోయింది. అందులో ఉన్న ఆరుగురు సిబ్బంది మరణించారని యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) తెలిపింది.
CENTCOM ముందుగా X లో ఒక పోస్ట్‌లో నలుగురు సిబ్బంది మరణించినట్లు నిర్ధారించబడిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మొదట పేర్కొంది. తరువాతి అప్డేట్ చేస్తూ , ఆరుగురు సిబ్బంది "మరణించినట్లు నిర్ధారించబడ్డారు" అని తెలిపింది.
జోర్డాన్ లో ఇరాన్ ధ్వంసం చేసిన THAAD AN/TPY-2 రాడార్ వ్యవస్థ. సోర్స్: Suhas Yeole on facebook
"సంఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతోంది. అయితే, విమానం నష్టం శత్రు కాల్పుల వల్ల లేదా స్నేహపూర్వకంగా జరిగిన కాల్పుల వల్ల జరగలేదు" అని CENTCOM తెలిపింది.
ఇరాన్ "అనేక అమెరికా స్థావరాలకు తీవ్ర నష్టం కలిగించింది" అనే వాదనను CENTCOM పూర్తిగా ఖండించింది . ఉపగ్రహ చిత్రాలు, వీడియో ఫుటేజ్ దీనికి విరుద్ధంగా ఉన్నప్పటికి, CENTCOM సోషల్ మీడియాలో "అమెరికా స్థావరాలకు నష్టం చాలా తక్కువగా ఉందని, కార్యకలాపాలపై ప్రభావం చూపలేదని" పేర్కొంది.
ఉపగ్రహ ఇమేజింగ్ సంస్థలైన ప్లానెట్ ల్యాబ్స్ మాక్సర్ టెక్నాలజీస్ రెండూ ఈ ప్రాంతం నుండి ఫుటేజ్ విడుదలను నిలిపి వేసాయి. బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లోని స్థావరాలకు జరిగిన నష్టాన్ని చిత్రాల ద్వారా వెల్లడించిన ప్లానెట్ ల్యాబ్స్, "మిత్రరాజ్యాలు, నాటో-భాగస్వామ్య సిబ్బంది భద్రతకు శత్రువుల నుంచి ప్రమాదం నిరోధించడానికి" కొత్త చిత్రాలను 14 రోజుల తర్వాత విడుదల చేస్తాం,” అని తెలిపింది.
గల్ఫ్ రాచరిక వ్యవస్థలు మరింత కఠినమైన విధానాన్ని తీసుకున్నాయి, ఇరానియన్ దాడుల వీడియోలను పంచుకునే ఎవరికైనా జరిమానా, జైలు శిక్ష విధించనున్నట్లు యుఎఇ బెదిరించింది. ఒక నివాస ప్రాంతాన్ని తాకి 30 మందికి పైగా పౌరులను చంపిన యుఎస్ పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థ ని వీడియోను రికార్డ్ చేసినందుకు ఒక వ్యక్తికి బహ్రెయిన్ ప్రాసిక్యూటర్లు మరణశిక్షను కోరుతున్నట్లు తెలిసింది. CENTCOM బహ్రెయిన్ ప్రభుత్వం ఈ పౌరుల మరణాలకు ఇరానియన్ డ్రోన్ కారణమని పేర్కొన్నాయి.
ఎంత మంది అమెరికా సైనికులు చంపబడ్డారు?
యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి మార్చి 10 నాటికి ఎనిమిది మంది US సైనికులు మరణించినట్లు నిర్ధారించబడింది. కువైట్‌లోని క్యాంప్ అరిఫ్జాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి జరగడంతో ఆరుగురు మరణించారు ఈ స్థావరం "బలమైన వ్యూహాత్మక ఆపరేషన్ కేంద్రం"మని అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సేత్ అభివర్ణించారు. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై జరిగిన క్షిపణి దాడిలో ఒక సైనికుడు మరణించాడని పెంటగాన్ తెలిపింది, మరొకరు కువైట్‌లోని క్యాంప్ బుహ్రింగ్‌లో జరిగిన "యుద్ధానికి సంబంధం లేని" సంఘటనలో మరణించారని భావిస్తున్నారు. ఫిబ్రవరి 28 నుండి దాదాపు 140 మంది అమెరికన్ సైనికులు గాయపడ్డారు. నిజమైన US మరణాల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉందని టెహ్రాన్ పేర్కొంటున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరణాల సంఖ్య గురించి "అబద్ధం" చెబుతున్నారని మార్చి 7న ఒక ఇంటర్వ్యూలో, ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిజాని ఆరోపించారు , "బహుశా, ప్రమాదాలు లేదా అలాంటిదేదో సాకుతో తర్వాత మరణాల సంఖ్యను క్రమంగా పెంచుతుందని" ఆయన అంచనా వేశారు. అయితే, ట్రంప్, హెగ్సేత్ ఇద్దరూ మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని అమెరికన్ ప్రజలను హెచ్చరించారు. "ఇలాంటివి ప్రాణనష్టం లేకుండా జరగవు" అని అంటూ హెగ్సేత్ మార్చి 8న "మరింత ప్రాణనష్టం జరుగుతుంది, " అన్నారు.
అమెరికా ఎఫ్-15లను కూల్చివేసింది ఎవరు?
మార్చి 2న కువైట్ పై మూడు US F-15E స్ట్రైక్ ‘ఈగిల్ ఫైటర్ జెట్ల’ ను కూల్చివేసారు, దీనిని CENTCOM "స్నేహపూర్వక కాల్పుల సంఘటన" అని పిలిచింది. ఆరుగురు సిబ్బంది విజయవంతంగా బయట పడ్డారు. అయితే, ఇరానియన్ జెట్‌లతో చురుకైన పోరాటంలో "కువైట్ వైమానిక రక్షణ దళాలు పొరపాటున వాటిని కూల్చివేసాయని" CENTCOM మళ్లీ మాట మార్చింది.
సంఘటన వీడియో ఫుటేజ్‌లో కువైట్ ప్రయోగించినట్లు చెబుతున్న పేట్రియాట్, HAWK, NASAMS లేదా Spada 2000 ఇంటర్‌సెప్టర్‌ల ఆనవాళ్లు కనిపించలేదు, అయితే జెట్‌లకు ఇంజన్ల దగ్గిర దెబ్బతగలింది. ఈ నష్టం చూస్తే కువైట్ ప్రయోగించిన ఈ దాడిచేశాయని అనిపించదు.
ఈ F-15లను ఇరానియన్ లేదా కువైట్ ఫైటర్ జెట్‌ల నుండి ప్రయోగించిన హీట్-సీకింగ్ క్షిపణులతో కూల్చివేసే అవకాశం ఉంది. ఫుటేజ్ ప్రకారం కనీసం ఒక విమానాన్ని మాత్రం కువైట్ F-18 కూల్చివేసి ఉండవచ్చని ధృవీకరించని వీడియో సూచిస్తుంది.

