
శిథిలాల దిబ్బగా మారిన గాజా స్ట్రిప్
‘‘అవి యూదు పౌరుల మృతదేహాలు కాదు’’
15 డెడ్ బాడీలను హమాస్ కు అప్పగించిన ఇజ్రాయెల్
హమాస్, ఇజ్రాయెల్ కు అప్పగించిన మృతదేహాలలో కొన్నింటిని యూదు దేశం వెనక్కి పంపింది. అవి 2023, అక్టోబర్ 7 న కిడ్నాప్ చేశాక మరణించిన తమ పౌరుల డెడ్ బాడీలు కావని పేర్కొంది.
ఇజ్రాయెల్- గాజా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నిబంధనల ప్రకారం ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉండి మరణించిన యూదు పౌరుల అవశేషాలకు సైతం టెల్ అవీవ్ కు అప్పగించాలి. అయితే తొలి విడతగా హమాస్ అందించిన మృతదేహాలలో 15 డెడ్ బాడీలను యూదు దేశం తిరిగి వెనక్కి పంపింది. ఈ మృతదేహాల మార్పిడి అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగింది. గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలోని నాజర్ ఆసుపత్రికి 15 మృతదేహాలను తీసుకొచ్చి వాటిని యూఎస్ అప్పగించింది.
2023 అక్టోబర్ 7న హామాస్ చేసిన పాశవిక దాడి సమయంలో పోరాడుతూ మరణించిన సైనికుడు మృతదేహం అవశేషాలు దొరికాయని ప్రభుత్వం ప్రకటించిన కాసేపటికే 15 మృతదేహాలను వెనక్కి పంపే ప్రక్రియ ప్రారంభించారు.
ఆ ఒక్క మృతదేహం లియర్ రుడాఫ్ గా నెతన్యాహూ కార్యాలయం తెలిపింది. రుడాఫ్ అర్జెంటీనాలోని యూదు కుటుంబంలో జన్మించాడని, చిన్నతనంలోనే ఇజ్రాయెల్ లోని కిబ్బట్ నిర్ యిట్జాక్ మారాడని హోస్టేజేస్ అండ్ మిస్సింగ్ ఫ్యామిలీస్ ఫోరం తెలిపింది.
రుడాఫ్ అంబులెన్స్ డ్రైవర్ గా 40 సంవత్సరాలకు పైగా స్వచ్చందంగా పనిచేశాడని, వ్యవసాయ కమ్యూనిటీలోని అత్యవసర బృందంలో సభ్యుడిగాను ఉన్నట్లు వెల్లడించారు.
హమాస్ దాడి సమయంలో ప్రతిదాడి చేసిన సమయంలో రుడాఫ్ మరణించగా, అతడి మృతదేహాన్ని కూడా హమాస్ తీవ్రవాదులు గాజాకు ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ఇంకో 23 మంది బందీల అవశేషాలను హమాస్ అప్పగించాల్సి ఉంటుంది.
శనివారం ఒక్కరోజే ఇజ్రాయెల్ దాదాపు 300 మంది పాలస్తీనియన్ల మృతదేహాలను అప్పగించింది. గాజాలోని ఆరోగ్య అధికారులు డీఎన్ఏ కిట్ లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇందులో దాదాపు 84 మృతదేహాలను గుర్తించారు. అమెరికా నిబంధనల ప్రకారం.. మృతదేహాల ప్రక్రియ ముగిసిన తరువాత గాజాలోకి భారీగా మానవతా సాయం అందించడానికి ఇజ్రాయెల్ అనుమతించాలి.
అయితే ఇప్పటికి చాలా తక్కువ మోతాదులో సాయం అందుతోందని ఐరాస డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. గాజాలోకి 2 లక్షల మెట్రిక్ టన్నుల సాయం తరలించడానికి సిద్దంగా ఉందని, కానీ ఇప్పటి వరకూ కేవలం 37 వేల టన్నులు మాత్రమే అనుమతించారని చెప్పారు. ఇందులో కూడా ఎక్కువగా ఆహార పదార్థాలు మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు.
2023 అక్టోబర్ 7 న ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్ పై పాశవికంగా దాడికి పాల్పడింది. కనిపించిన ప్రతి యూదుడిని పై కాల్పులు జరిపింది. ఫలితంగా 1200 మంది సాధారణ పౌరులు మరణించారు. దాడి తరువాత 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు.
తరువాత ఇజ్రాయెల్ ప్రతిదాడికి దిగింది. గాజాను దాదాపుగా నేలమట్టం చేసింది. హమాస్ అక్కడి సాధారణ పాలస్తీనియన్లను మానవ కవచాలుగా వాడుకుని దాడులు చేస్తుండటంతో ఐడీఎఫ్ బలగాలు జరిపిన ప్రతిదాడిలో దాదాపు 68 వేల మంది మరణించారు. ఇందులో దాదాపు 25 వేల మంది హమాస్ తీవ్రవాదులు ఉన్నారని ఇజ్రాయెల్ ప్రకటించింది.
యూదు సంప్రదాయం ప్రకారం ఎవరైన యూదుడు మరణిస్తే అతడికి తమ మత సంప్రదాయాల ప్రకారం కచ్చితంగా అంత్యక్రియలు నిర్వహించాలి. మృతదేహంలోని అని భాగాలు ఉండాలనే సంప్రదాయం వారు పాటిస్తారు. లేకపోతే ఆ భాగాన్ని వెతికి తీసుకురావాడానికి ప్రత్యేక సంస్థలను నియమించుకుంటారు. అందుకే ఇజ్రాయెల్ ప్రభుత్వం కచ్చితంగా యూదు పౌరుల అవశేషాలను తమకు అప్పగించాలని హమాస్ పై ఒత్తిడి చేస్తోంది.
Next Story

