భారత్ కు మరోసారి ట్రంప్ టారిఫ్ వార్నింగ్
x
యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

భారత్ కు మరోసారి ట్రంప్ టారిఫ్ వార్నింగ్

రష్యా నుంచి చమురు కొనడం ఆపకపోతే భారీ సుంకాలు తప్పవని హూంకారం


రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని భారత్ తక్షణమే నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. లేకపోతే మరోసారి సుంకాల బాదడం ఖాయమని అన్నారు. ఎయిర్ ఫోర్స్ వన్ లో యూఎస్ అధ్యక్షుడు విలేకరులతో మాట్లాడారు.

తన నిబంధనల ప్రకారం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భారత్ నిలిపివేయకపోతే, వాషింగ్టన్ దిగుమతి చేసుకునే న్యూఢిల్లీ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. తాను భారత ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడానని, రష్యా నుంచి దిగుమతి చేసుకునే చమురు కొనుగోలు చేయబోమని హమీ ఇచ్చినట్లు మరోసారి ప్రకటించారు.
భారత ప్రధాని మోదీ మీకు ఫోన్ చేయలేదని, అసలు ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరగలేదని ఖండించిన విషయాన్ని ట్రంప్ ముందు విలేకరులు ప్రస్తావించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. ‘‘వారు అలా చెప్పాలనుకుంటే వారు భారీ సుంకాలను చెల్లిస్తూనే ఉంటారు. వారు అలా చేయాలని అనుకోవడం లేదు’’ అని చెప్పారు.
భారత్ వాదన..
ట్రంప్ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ ఖండించింది. ట్రంప్, మోదీ మధ్య టెలిఫోన్ సంభాషణ జరగలేదని, అలాంటిదేమి లేదని పేర్కొంది. భారత వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే భారత ప్రధాన ఆందోళన అని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
అమెరికా చేసిన మరో వాదనను భారత్ ఖండించింది. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురు సగానికి పైగా తగ్గించుకుందనే వాదనలను కూడా న్యూఢిల్లీ తిరస్కరించింది. అలాంటి చర్యలకు పాల్పడలేదని కూడా తెలిపింది.
బయటకు వస్తున్న సమాచారం ప్రకారం.. భారత చమురు శుద్ది కర్మాగారాలు ఇప్పటికే నవంబర్ నెలలో రష్యన్ చమురును దిగుమతి చేసుకోవడానికి అక్కడికి చేరుకున్నాయి. కొన్ని డిసెంబర్ నెలకు సైతం ఆర్డర్లు ఇచ్చాయి. కొనుగోళ్లలో ఏదైన తగ్గింపు, కొనసాగింపు అనేవి తరువాత ఏడాదిలో తెలుస్తుంది.
అమెరికా సుంకాల విధింపు..
2022 లో నుంచి ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో అనేక పాశ్చాత్య దేశాలు రష్యా చమురు కొనుగోలును నిలిపివేసి, రష్యా పై ఆంక్షలు విధించాయి. ఫలితంగా రష్యా తన చమురును అతి తక్కువ ధరకు విక్రయిస్తోంది. భారత్ అలా తగ్గిన ధరలతోనే భారీ మొత్తంలో చమురును కొనుగోలు చేస్తోంది.
దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో వీటిని ఉపయోగించుకుంటోంది. అయితే అమెరికా మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని ఒత్తిడి చేస్తోంది. అయితే దీనిని భారత్ తిరస్కరిస్తోంది. న్యూఢిల్లీ నిర్ణయంతో భారత్, అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై 50 శాతం సుంకాలు విధించింది.
Read More
Next Story