
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
కొలంబియా, క్యూబా, మెక్సికోలను హెచ్చరించిన ట్రంప్
మీ అస్తిత్వాలను జాగ్రత్తగా చూసుకోమని బెదిరింపులు
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసి, అమెరికాకు తరలించిన కొన్ని గంటల తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాటిన్ అమెరికా దేశాల అధినేతలకు హెచ్చరికలు జారీ చేశారు.
వెనెజువెలా లో వాషింగ్టన్ జోక్యం ఇతర లాటిన్ అమెరికా దేశాలలో ఉన్న మాదక ద్రవ్య ఉగ్రవాదం పై పోరుకు తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు అని చెప్పారు.
‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిసల్వ్’ తరువాత మదురోను న్యూయార్క్ లోని జైలుకు తరలించిన సందర్బంగా విలేకరులతో మాట్లాడారు. కొలింబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను తన అస్తిత్వాన్ని జాగ్రత్తగా చూసుకో అని హెచ్చరించారు. మెక్సికోను డ్రగ్ కార్టెల్స్ ను నడుపుతున్నారన ఆగ్రహించారు. క్యూబా త్వరలో అమెరికా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చని సూచించారు.
ఈ సందర్బంగా అత్యంత అసహ్యకరమైన వ్యాఖ్యలు కొలంబియన్ అధ్యక్షుడు గుస్తావ్ పెట్రోపై చేశారు. ఆయన వెనెజువెలా లో అమెరికా సైనిక చర్యను తీవ్రంగా వ్యతిరేకించాడు. దీనితో ఆగ్రహంతో ట్రంప్ జుగుప్సకరమైన పదాలు వాడారు.
‘‘అతను కొకైన్ తయారు చేస్తున్నాడు. వారు కొకైన్ తయారు చేసి యునైటెడ్ స్టేట్స్ కు పంపుతున్నారు’’ అని ట్రంప్, పెట్రోను ప్రస్తావిస్తూ అంటూ.. ఈ రాయలేని పదాలను వాడాడు.
మదురోను అమెరికా ఎత్తుకెళ్లిన తరువాత లాటిన్ అమెరికా దేశాల సార్వభౌమాధికారం దాడిగా పెట్రో ఖండించారు. తరువాత వాషింగ్టన్ చర్యలు మానవతా సంక్షోభానికి దారితీయవచ్చని హెచ్చరించాడు.
మెక్సికోను కార్టెల్ ను నడుపుతున్నాయి..
మెక్సికోపై తీవ్ర విమర్శలు గుప్పించిన ట్రంప్.. ఆ దేశాన్ని డ్రగ్ కార్టెల్ లు నడుపుతున్నాయి. తాను చెబుతున్న దేశం గురించి ఏదైనా చేయాలని అన్నారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్ ను మంచి మహిళగా అంగీకరిస్తూనే ఆమె నిజంగా బాధ్యత వహించలేదని ట్రంప్ అన్నారు.
‘‘కార్టెల్ మెక్సికోను నడుపుతున్నాయి. ఆమె మెక్సికోను నడపడం లేదు’’ అని ట్రంప్ అన్నారు. ‘‘కార్టెల్స్ ను బయటకు తీసుకురావడానికి అమెరికా సహాయం కావాలా అని షీన్ బామ్ ను పదే పదే అడిగానని, ఆమె ఈ ఆఫర్ ను నిరంతరం తిరస్కరించింది’’ అన్నారు.
క్యూబా తదుపరి టార్గెట్?
వెనెజువెలాకు ఆది నుంచి అండగా ఉన్న క్యూబాకు ను సైతం ట్రంప్ ఈ సందర్భంగా హెచ్చరించారు. హవానా తరువాత స్థానంలో ఉండవచ్చని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను హవానాలో నివసిస్తూ ప్రభుత్వంలో ఉంటే నేను ఆందోళన చెందుతాను. కనీసం కొంచెం అయినా’’ అన రూబియో అన్నారు.
అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కానెల్ నేతృత్వంలోని క్యూబాను విఫలమవుతున్న దేశం అని, అక్కడి ప్రజల దశాబ్ధాలుగా బాధలుపడటానికి ప్రభుత్వమే కారణమని నిందించారు. అమెరికా క్యూబన్లకు సహాయం చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
లాటిన్ అమెరికా అంతటా షాక్ వేవ్ లు..
మదురోను అమెరికా ఎత్తుకెళ్లడం లాటిన్ అమెరికా అంతటా బలమైన ప్రతిచర్యలకు దారితీసింది. పశ్చిమ అర్థగోళంలో అమెరికా జోక్యం పై తిరిగి వారి ఆందోళనలను తిరిగి ప్రారంభించింది. ఈ ప్రాంతంలో స్థిరత్వం, ఇంధన భద్రత పై ప్రశ్నలు లేవనెత్తింది. ఇది అమెరికా ఆధిపత్యమే అని వారంతా ఆందోళన చెందుతున్నారు.
Next Story

