
కాల్పులు జరిపినట్లు భావిస్తున్న అనుమానుతుడి చిత్రం
ట్రంప్ స్నేహితుడి హత్య..అనుమాతుడి సమాచారం చెప్తే లక్ష డాలర్లు
పన్నెండు గంటలైన షూటర్ ను పట్టుకోలేకపోయిన దర్యాప్తు సంస్థలు, సమీపంలోని అడవులో తుపాకీ స్వాధీనం
ట్రంప్ స్నేహితుడు, సంప్రదాయవాదీ చార్లీ కిర్క్ ను హత్య చేసినట్లు అనుమానిస్తున్న వ్యక్తి ఫోటోను ఎఫ్బీఐ విడుదల చేసింది. పైకప్పు నుంచి అడవుల్లోకి దూకి అదృశ్యమైన వ్యక్తి గత 12 గంటలుగా పరారీలో ఉన్నాడు.
అనుమానిత వ్యక్తి ఫొటోను దర్యాప్తు సంస్థ విడుదల చేసి, ప్రజల సాయం కోరింది. కాల్పులు జరిపిన వ్యక్తికి సంబంధించిన కొన్ని ముద్రలు అటవీ ప్రాంతంలో దొరికాయి. అలాగే ఒక రైఫిల్ కూడా పోలీసులు కనుగొన్నారు.
కానీ ఇంత వరకూ అనుమానుతుడు హత్య చేయడానికి గల కారణాలు కనుగొనలేదు. అమెరికాను సైద్దాంతిక అంశాలతో రాజకీయ హింసను ప్రేరేపించడానికి చేసిన చర్యగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఫొటోలు..
టోపీ, సన్ గ్లాసెస్, పొడవాటి చేతుల నల్ల చొక్కా ధరించిన వ్యక్తి ఫొటోలు విడుదల చేసింది. అలాగే అరెస్ట్ కు సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి లక్ష డాలర్ల రివార్డు ను ప్రకటించింది. కేసును ఛేదించడానికి ప్రజల నుంచి సలహాలు అవసరమని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయని తేలింది.
ఉటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన కాల్పుల ఘటన తరువాత కొద్దిసేపటికే అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులను తరువాత విడుదల చేశారు. దీంతో వారు కొత్త అనుమానితుల కోసం వేట సాగించారు.
అడవిలో ఒక టవల్ లో మౌజర్.30 క్యాలిబర్, బోల్ట్ యాక్షన్ రైఫిల్ లభించాయి. అలాగే అక్కడే ఒక కార్ట్రిడ్జ్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనిలో మూడు రౌండ్ల మ్యాగజైన్లు లోడ్ చేశారు. ఆయుధం, మందుగుండు సామగ్రిని ఫెడరల్ ల్యాబ్ లో దర్యాప్తు అధికారులు విశ్లేషిస్తున్నారు.
షూటింగ్ ఎలా..
చార్లీ కిర్క్ విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచి సామాజిక సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడూ అందరూ చూస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ హత్యకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గత ఏడాది జరిగిన అమెరికా ఎన్నికల్లో యువ రిపబ్లికన్ ఓటర్లను సమీకరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
‘‘కాలేజీ వయస్సు’’ వ్యక్తిగా కనిపించడం వల్ల క్యాంపస్ జనంలో కలిసిపోయాడని పరిశోధకులు భావిస్తున్నారు. కాల్పులు జరపడానికి అతను క్యాంపస్ లోని ఒక భవనం పైకప్పు పైన కూర్చున్నాడని, కేవలం ఒకే ఒక తూటాతో కిర్క్ ను చంపేశాడని తేలింది.
బుల్లెట్ తగలగానే అతను దూకి అడవుల్లోకి పారిపోయాడని తేలింది. ఈ కాల్పుల ఘటనపై క్యాంపస్ లో చాలాకాలంగా నివసిస్తున్న కాథ్లీన్ మర్పీ మాట్లాడారు. తలుపుకు తాళం వేసి ఇంట్లోనే ఉంటున్నాని చెప్పారు. ‘‘హంతకుడిని ఇంకా పట్టుకోకపోవడం ఆందోళనకరంగా ఉంది’’ అని మర్పీ అన్నారు.
Next Story