‘‘రెండు మిలియన్ టన్నుల ఎల్పీజీ రావాల్సి ఉంది’’
x

‘‘రెండు మిలియన్ టన్నుల ఎల్పీజీ రావాల్సి ఉంది’’

22 నౌకలు గల్ఫ్ లో చిక్కుకుపోయాయన్న భారత ప్రభుత్వం


Click the Play button to hear this message in audio format

హార్ముజ్ జలసంధిలో 22 భారత నౌకల నుంచి రాావాల్సిన 1.67 మిలియన్ టన్నుల ముడి చమురు, 3.2 లక్షల టన్నుల ఎల్‌పిజి సుమారు 2 లక్షల టన్నుల ఎల్‌ఎన్‌జి నిలిచిపోయాయని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా బుధవారం తెలిపారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత కొన్ని భారతీయ నౌకలు సురక్షితంగా హార్ముజ్ ను దాటి భారత్ కు చేరాయని కానీ ఇంకా కొన్ని నౌకలు అక్కడే చిక్కుబడినట్లు తెలిపారు. వాటిని సురక్షితంగా బయటకు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పుడూ హార్ముజ్ జలసంధిలో 28 భారత జెండా నౌకలు ఉండేవి. వీటిలో 24 నౌకలు జలసంధికి పశ్చిమ వైపున, నాలుగు తూర్పు వైపున ఉన్నాయి. గత వారంలో, ఇరువైపుల నుంచి రెండేసి నౌకలు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాయి.

"జలసంధికి పశ్చిమ వైపున ఉన్న 22 నౌకలలోని మొత్తం 611 మంది నావికులు ఉన్నారు. వారంతా ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు" అని ఆయన ఒక విలేకరుల సమావేశంలో తెలిపారు. భారత జెండా నౌక వాటితో చేరడంతో, ఇప్పుడు తూర్పు వైపున 3 నౌకలు ఉన్నాయి. హార్ముజ్ జలసంధికి పశ్చిమ వైపున మిగిలి ఉన్న 22 భారత జెండా నౌకలలో, ఆరు ఎల్‌పిజి క్యారియర్లు, ఒకటి ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జి) ట్యాంకర్, నాలుగు ముడి చమురు ట్యాంకర్లు, ఒకటి రసాయన ఉత్పత్తులను రవాణా చేస్తున్నది, మూడు కంటైనర్ నౌకలు రెండు బల్క్ క్యారియర్లు ఉన్నాయి.
అదనంగా, ఒక నౌక డ్రెడ్జర్, మరొకటి సరుకు లేకుండా ఖాళీగా ఉంది. మూడు సాధారణ నిర్వహణ పనుల కోసం డ్రై డాక్‌లో ఉన్నాయి. యుద్ధం వల్ల దెబ్బతిన్న ఈ జలసంధి గుండా భారత నౌకల రాకపోకల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని సిన్హా తెలిపారు.
పర్షియన్ గల్ఫ్‌ను అరేబియాా సముద్రంతో కలిపే ఇరుకైన జలమార్గమైన హార్ముజ్. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడ తరువాత టెహ్రాన్ ప్రతీకార చర్యలతో ఈ జలసంధిని మూసివేయబడింది. మొత్తం మీద, దాదాపు 500 ట్యాంకర్ నౌకలు పర్షియన్ (అరేబియన్) గల్ఫ్‌కే పరిమితమై ఉన్నాయి.
వీటిలో 108 ముడి చమురు ట్యాంకర్లు, 166 చమురు ఉత్పత్తుల ట్యాంకర్లు, 104 రసాయన/ఉత్పత్తుల ట్యాంకర్లు, 52 రసాయన ట్యాంకర్లు, 53 ఇతర రకాల ట్యాంకర్లు ఉన్నాయి. ధృవీకరణ తర్వాత ఎంపిక చేసిన కొన్ని నౌకలను జలసంధి గుండా ప్రయాణించడానికి ఇరాన్ అనుమతిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
గత రెండు రోజుల్లో, లారాక్-ఖేష్మ్ ఛానల్ మీదుగా కొద్దిసేపు దారి మళ్లించి, కనీసం 4 నౌకలు హార్ముజ్ జలసంధి నుంచి బయటకు వచ్చాయి. ఈ మార్గంలో ప్రయాణించిన నౌకలలో 3 బల్క్ క్యారియర్లు (2 గ్రీక్ / 1 భారతీయ). ఒక అఫ్రామాక్స్ ట్యాంకర్ (పాకిస్తాన్) ఉన్నాయి. భారత్ తన ముడి చమురులో సుమారు 88 శాతం, సహజ వాయువులో 50 శాతం, ఎల్‌పిజిలో 60 శాతం దిగుమతి చేసుకుంటుంది.
యుద్ధం ప్రారంభం కావడానికి ముందు, భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురులో సగానికి పైగా సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ వంటి దేశాల నుండి వచ్చేది. ఈ దేశాలు రవాణా కోసం ఈ జలసంధిని ఉపయోగించుకుంటాయి. ఎల్‌పిజిలో 85-95 శాతం, గ్యాస్‌లో 30 శాతం ఈ జలసంధి ద్వారానే వచ్చేవి. రష్యా, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా, లాటిన్ అమెరికా వంటి ప్రత్యామ్నాయ వనరుల ద్వారా ముడి చమురు సరఫరాలో అంతరాయాన్ని పాక్షికంగా భర్తీ చేసినప్పటికీ, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు గ్యాస్, ఎల్‌పిజి సరఫరాలు తగ్గాయి.
Read More
Next Story