గాజాలో క్రిస్మస్ రక్తపాతం
పాలస్తీనాలో యుద్ధం రక్తపాతానికి దారితీస్తుంది. ఇజ్రాయిల్ వైమానికి దాడులు అమాయక జనాన్ని పొట్టన పెట్టుకుంటున్నాయి.
పాలస్తీనాలోని సెంట్రల్ గాజాపై ఇజ్రాయిల్ వైమానికి దాడులకు పాల్పడింది. ఆదివారం అర్ధరాత్రి క్రిస్మస్ వేడుకలకు కొన్ని గంటల ముందు అల్ మగాజీ శరణార్థుల శిబిరంపై దాడి చేసింది. దాటి దాటికి చుట్టుపక్కల ఇల్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 78 మంది పౌరులు చనిపోయారు. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని గాజా వైద్య ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి అశ్రఫ్ అల్‌ఖద్రా తెలిపారు. ఇజ్రాయిల్ బలగాలు రద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. అల్ బురుజీ శరణార్థుల శిబిరంపై కూడా దాడి చేశారని సమాచారం. కాగా ఇజ్రాయిల్ మిలిటరీ అధికార ప్రతినిధి ఈ ఘటనను పరిశీలిస్తున్నామని చెప్పారు. హమాస్ మాత్రం ఈ ఘటనను ఊచకోతగా భావిస్తోంది.
Next Story