హఫీజ్ సయీద్ స్నేహితుడిని హతమార్చిన గుర్తు తెలియని సాయుధులు
x

హఫీజ్ సయీద్ స్నేహితుడిని హతమార్చిన గుర్తు తెలియని సాయుధులు

జమ్మూకాశ్మీర్ లో అనేక ఉగ్రవాద దాడులకు సూత్రధారి అబూ ఖతల్


పాకిస్తాన్ లో గుర్తు తెలియని సాయుధులు ఉగ్రవాదులను ఏరివేయడం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో భారత వ్యతిరేక కరుడగట్టిన ఉగ్రవాదులను హతమార్చిన ఈ శక్తులు, తాజాగా మోస్ట్ వాంటేడ్ లష్కర్ ఏ తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాది అబూ కతల్ రాత్రి పాకిస్తాన్ లో అంతం చేశాయి.

అబూకతల్ 26/11 ముంబై ఉగ్రవాది దాడి సూత్రధారి హఫీజ్ సయీద్ సన్నిహితుడైన ఖతల్, జమ్మూకాశ్మీర్ లో అనేక దాడులకు కుట్రపన్నాడని చెబుతున్నారు.
గత ఏడాది జూన్ 9న జమ్మూకాశ్మీర్ లోని రియాసీ జిల్లాలోని శివ్ ఖోరీ ఆలయం నుంచి యాత్రికులకు తీసుకెళ్తున్న బస్సుపై దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా 41 మంది గాయపడ్డారు. దీని వెనక ప్రధాన సూత్రధారి అబూ కతల్ అని దర్యాప్తు సంస్థలు తేల్చయి.
కొన్ని నివేదికల ప్రకారం.. ఖతల్ ను ఎల్ఈటీ చీఫ్ ఆపరేషనల్ కమాండర్ గా సయీద్ ను నియమించాడని, జమ్మూకాశ్మీర్ లో పెద్దదాడులు చేయడానికి ఆదేశాలు ఇచ్చాడని తెలిసింది. 2023 లో రాజౌరిలో జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు మరణించిన కేసులో అబూను ఎన్ఐఏ నిందితుడిగా చేర్చింది.
ఈ కేసులో పాకిస్తాన్ కు చెందిన ముగ్గురు ఎల్ఈటీ నాయకులతో పాటు మరో నలుగురు నిందితులను ఎన్ఐఏ తన ఛార్జీషీట్ లో పేర్కొంది. జమ్మూకాశ్మీర్ లో మైనారిటీ కమ్యూనిటీకి చెందిన పౌరులను, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులను నియమించి పంపినట్లు ఎన్ఐఏ తెలిపింది.
కొన్నిరోజుల క్రితం బలూచిస్తాన్ లో ఇలాగే మరో ఉగ్రవాదిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ ను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి పాకిస్తాన్ కు అప్పగించినట్లు సదరు ఉగ్రవాదిపై ఆరోపణలు ఉన్నాయి.
Read More
Next Story