
అమెరికా విదేశాంగ సెక్రటరీ మార్కో రూబియో
భారత్, పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుకు అమెరికా కీలక సూచన
ఇరు దేశాలు తమ కమ్యూనికేషన్ ఆపవద్దని సలహ ఇచ్చిన మార్కో రూబియో
పాకిస్తాన్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ ను ప్రారంభించిన తరువాత అమెరికా స్పందించింది. యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు రెండు దేశాలకు జాతీయ భద్రతా సలహాదారుల కమ్యూనికేషన్ మార్గాలను తెరిచే ఉండాలని, తీవ్రతరం కాకుండా నిరోధించాలని కోరినట్లు ఆయన కార్యాలయం బుధవారం తెలిపింది.
‘‘ఈ మధ్యాహ్నం ప్రారంభంలో సెక్రటరీ మార్క్ రూబియో భారత్, పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారులో మాట్లాడారు. ఇరు దేశాలు కమ్యూనికేషన్ మార్గాలను తెరిచే ఉంచాలని, ఉద్రిక్తతలను నివారించాలని ఇరు దేశాలను కోరారు’’ అని విదేశాంగ శాఖ ఒక పోస్ట్ లో తెలిపింది.
దాడులు జరిగిన కొద్దిసేపటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రూబియో మాట్లాడారని, వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. రూబియో పాకిస్తాన్ జాతీయ భదత్రా సలహదారు అసిమ్ మాలిక్ తో కూడా మాట్లాడారు.
భారత్,పాకిస్తాన్ మధ్య పరిస్థితిని తాను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఇది త్వరగా ముగియాలని ఆశిస్తున్నానని రూబియో అన్నారు.
‘‘భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితిని నేను నిశితంగా పరిశీలిస్తున్నాను. ఇది త్వరగా ముగిసిపోతుందని, శాంతియుత పరిష్కారం కోసం భారత్, పాకిస్తాన్ నాయకత్వాన్ని నిమగ్నం చేస్తున్నాను. ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలకు నేను ప్రతిధ్వనిస్తున్నాను’’ అని రూబియో ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.
ట్రంప్ స్పందన..
పాకిస్తాన్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ ప్రారంభించిన దాడులకు మొదటి స్పందనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ చాలాకాలంగా పోరాడుతున్నాయని, ఏదో జరగబోతుందని ప్రజలకు తెలుసన్నారు.
రెండు దేశాలకు ఏదైనా సందేశం ఉందా? అని ట్రంప్ ను అడిగినప్పుడూ ఆయన మాట్లాడుతూ.. ‘‘లేదు, ఇది చాలా త్వరగా ముగియాలని నేను ఆశిస్తున్నాను.’’ అని సమాధానం ఇచ్చారు.
ఈ దాడిలో భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడినట్లు వెల్లడించింది. పాకిస్తాన్ పౌర, ఆర్ధిక, సైనిక లక్ష్యాలపై దాడులు చేయలేదని తెలిపింది. దాడుల తరువాత అజిత్ దోభాల్ అమెరికా విదేశాంగ కార్యదర్శితో మాట్లాడి వివరాలు పంచుకున్నట్లు మాత్రం వాషింగ్టన్ లోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది.
ఈ దాడులపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, తుర్కియో విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ కు ఫోన్ చేసి దక్షిణాసియాలో క్షీణిస్తున్న ప్రాంతీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది.
Next Story