బీబీసీకి షాక్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
x
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

బీబీసీకి షాక్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

పది బిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా, పనోరమా కార్యక్రమంలో వీడియో మార్పింగ్ చేసిన బీబీసీ


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీబీసీకి షాక్ ఇచ్చాడు. తనపై అసత్య ప్రచారం చేస్తూ వీడియోలు విడుదల చేయడంపై కోర్టు మెట్లెక్కాడు. పది బిలియన్ల డాలర్లు నష్టపరిహారం కోరుతూ కేసు పెట్టాడు.

‘‘అసత్య ప్రచారం, అవమానించే ఉద్దేశం, మోసం, తన ఖ్యాతికి భంగం కలిగించడం’’ వంటి చర్యలకు పాల్పడినట్లు ముప్పు మూడు పేజీల లా సూట్ లో ట్రంప్ ఆరోపించారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయడమే లక్ష్యంగా బీబీసీ సిగ్గుమాలిన ప్రయత్నం చేసిందని ట్రంప్ పేర్కొన్నారు.

కోర్టులో ట్రంప్ దాఖలు చేసిన సూట్ వివరాలను కోట్ చేస్తూ రాయిటర్స్ వార్తా కథనాలు ప్రసారం చేసింది. బీబీసీ మీద పది బిలియన్ డాలర్ల నష్టపరిహారం కోరతూ కేసు దాఖలు చేశాడు.
క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడిని పనోరమ పేరుతో బీబీసీ విడుదల చేసిందని, వేర్వేరు సందర్భాల్లో తను మాట్లాడిన మాటలను కలిపి ఇందులో ఉపయోగించదని ఆయన చెప్పారు.
ఈ వివాదం బయటకు రాగానే బీబీసీ సీనియర్ అధికారులు వెంటనే రాజీనామా చేశారు. బీబీసీ ఇప్పటికే ట్రంప్ కు క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం నష్టపరిహారం కేసు దాఖలు చేయడంతో ఆ సంస్థలో కలకలం రేగింది.
పనోరమా కార్యక్రమంలో సెలెక్టివ్ ఎడిటింగ్ తన వ్యాఖ్యలను వక్రీకరించిందని, జనవరి 6, 2021 నాటి సంఘటనలలో తన పాత్రపై తప్పుడు సమాచారం వ్యాపింపజేసి, ప్రజలలో చెడు అభిప్రాయం సృష్టించే ప్రయత్నం బీబీసీ చేసిందని ఆయన వాదించారు. డాక్యుమెంటరీ హింసను ప్రొత్సహించాడని, అయితే తన ప్రసంగం అలా సాగలేదని ఆయన చెప్పుకొచ్చారు.
‘‘నేను ఎప్పుడు చెప్పని విషయాలను వారు నా నోటి వెంట వచ్చినట్లు కల్పిత వీడియోలో సృష్టించారు. వారు అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా అలాంటిది ఉపయోగించారని నేను అనుకుంటున్నాను. ’’ అని ట్రంప్ అన్నారు. కాబట్టి నేను తప్పనిసరి పరిస్థితుల్లో దావా వేశానని ట్రంప్ సోమవారం అన్నారు.
ఈ వివాదం 2024 అక్టోబర్ యూకే లో ప్రసారం అయిన బీబీసీ పనోరమా డాక్యుమెంటరీ ట్రంప్: ఏ సెకండ్ ఛాన్స్? పై కేంద్రీకృతమై ఉంది. ‘ది టెలిగ్రాఫ్’ నివేదిక ప్రకారం, ట్రంప్ ప్రసంగంలోని రెండు వేర్వేరు భాగాలు కలిసి సవరించబడ్డాయని, కాపిటల్ అల్లర్లకు సంబంధించిన చర్యకు ఆయన నిరంతర పిలుపునిచ్చినట్లుగా కనిపిస్తుందని ఆరోపించిన తరువాత ఈ కార్యక్రమం పరిశీలనలోకి వచ్చింది.
ప్రసంగంలోని వివిధ ప్రదేశాలలో దాదాపు గంట వ్యవధిలో చేసిన వ్యాఖ్యలను ఒక చిన్న క్లిప్ గా కలపి పెట్టారని బీబీసీ తరువాత అంగీకరించింది. ట్రంప్ మద్దతుదారులు దేశభక్తితో, శాంతియుతంగా తమ గొంతులను వినిపించాలనే పిలుపును ఈ వీడియోలో జోడించినట్లు తెలిపింది.
Read More
Next Story