ఆ సవాల్ తట్టుకునే శక్తి మాకుంది: అమెరికా టారిఫ్ లపై భారత్
x
తులసీ గబ్బార్డ్ తో ఎస్. జైశంకర్

ఆ సవాల్ తట్టుకునే శక్తి మాకుంది: అమెరికా టారిఫ్ లపై భారత్

రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై 500 శాతం సుంకం విధించే యోచనలో వైట్ హౌజ్


రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై 500 శాతం వరకూ సుంకాలు విధించే ప్రతిపాదిత బిల్లుపై భారత్ ఆందోళన చెందుతోందని, కానీ ఈ అడ్డంకిని తాము దాటుతామని భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.

న్యూఢిల్లీ ఆందోళనలను బిల్లు తీసుకువచ్చే అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహంకు తెలియజేసిందని, ఈ చర్య దేశంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

నాలుగు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్, రష్యా నుంచి చమురును ప్రధానంగా కొనుగోలు చేసే భారత్ కు ఈ బిల్లు వల్ల కలిగే పరిణామాల గురించి తెలుసని అన్నారు.

‘‘ఇంధన భద్రతపై మా ఆందోళనలు, ఆసక్తులను ఆయనకు తెలియజేసినట్లు నేను భావిస్తున్నాను. కాబట్టి మనం దానికి వచ్చినప్పుడూ ఆ వంతెనను దాటవలసి ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
నిశితంగా గమనిస్తున్నాం..
వాషింగ్టన్ లో జరిగిన విలేకరులు సమావేశంలో విదేశాంగమంత్రి మాట్లాడుతూ.. భారత్ తన ప్రయోజనాలను సంబంధించిన లేదా దేశంపై ప్రభావం చూపే పరిణామాలను అమెరికా కాంగ్రెస్ లో నిశితంగా పరిశీలన జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ప్రవేశపెట్టన బిల్లును ప్రస్తావిస్తూ, భారత అధికారులు, రాయబార కార్యాలయం సెనేటర్ తో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపుతున్నారని జైశంకర్ అన్నారు.
బిల్లును ప్రవేశపెడుతూ.. గ్రాహం ప్రత్యేకంగా భారత్, చైనా పేర్లను ప్రస్తావించారు. రెండు దేశాలు రష్యన్ చమురు ఎగుమతుల్లో 70 శాతం కొనుగోలు చేస్తున్నాయని ఆరోపించారు.
రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాల నుంచి దిగుమతులపై 500 శాతం సుంకాలు విధించే లక్ష్యంతో ప్రతిపాదిత చట్టం గురించిన ప్రశ్నలకు జైశంకర్ సమాధానమిచ్చారు. ఈ చర్య ముఖ్యంగా క్రెమ్లిన్ తో కొనసాగుతున్న ఇంధన ఒప్పందాల కారణంగా భారత్, చైనాలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
విద్యుత్ కు సంబంధించిన ఆందోళనలు..
‘‘సెనేటర్ లిండ్సే గ్రాహం బిల్లు విషయానికి వస్తే యూఎస్ కాంగ్రెస్ లో జరుగుతున్న ఏదైన పరిణామం మా ఆసక్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మేము సెనేటర్ గ్రాహంతో సంప్రదింపులు జరుపుతున్నాము. రాయబార కార్యాలయం, రాయబారీ సంప్రదింపులు జరుపుతున్నారు’’ అని ఆయన అన్నారు.
ఇంధన భద్రతపై మా ఆందోళనలు, మా ఆసక్తులను తెలియజేశాము. కాబట్టి మనం దానికి వచ్చినప్పుడూ ఆ వంతెన దాటవలసి ఉంటుంది’’ అని కేంద్రమంత్రి చెప్పినట్లు జాతీయ మీడియా తెలిపింది.
రష్యా పై ఒత్తిడికి అమెరికా ప్రయత్నం..
ఉక్రెయిన్ లో యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరపాలని రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ పరిపాలన చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ బిల్లును తెస్తున్నారు. ఈ చట్టం ఆమోదం పొందితే అమెరికాకు, భారత ఎగుమతులపై 500 భారీ సుంకం విధించే అవకాశం లభిస్తుంది.
అయితే ఏప్రిల్ లో ట్రంప్ ప్రకటించిన 26శాతం పరస్పర సుంకాన్ని నివారించడానికి భారత్, అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే దశలో ఉంది. ఈ ఒప్పందం భారతీయ వస్తువులపై అమెరికా సుంకాలను గణనీయంగా తగ్గిస్తుందని భావిస్తున్నారు.
చమురు దిగుమతులు పెరుగుతున్నాయి..
ఈ సమస్యకు కేంద్ర బిందువు రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు పెరగడం. ఇది ఇప్పుడు దేశ ఇంధన అవసరాల్లో 40 నుంచి 45 శాతం వరకూ ఉంది.
నిజానికి మే నెలలో భారత్, రష్యా నుంచి దిగుమతి చేసుకునే చమురు పది నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఇది రోజుకు 1.96 మిలియన్ బ్యారెళ్లు కి చేరాయి. ఈ పరిణామం చాలా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. రష్యన్ చమురు ఇప్పుడు భారత్ అవసరాల్లో పశ్చిమాసియా సరఫరాదారులను అధిగమించింది.
ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడంతో పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన తరువాత 2022 లో ఈ మార్పు ప్రారంభం అయింది. దీనికి ప్రతిస్పందనగా పశ్చిమాసియా దేశాల కంటే తక్కువ ధరకు ముడి చమురును అందించడం ప్రారంభించింది. భారత్, చైనా వంటి దేశాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాయి. భారతీయ శుద్ది కర్మాగారాలు రాయితీపై రష్యన్ ముడిచమురు దిగుమతులను పెంచాయి.
Read More
Next Story