
యూఎస్: సొంత క్యాంపస్ పైనే దాడి చేయాలనుకున్న ఉగ్రవాదీ
పట్టుబడ్డ నిందితుడు పాక్ లో జన్మించిన అమెరికన్ పౌరుడు
తను చదువుకున్న క్యాంపస్ లో దాడి చేసి సామూహిక హత్యలకు కుట్రపన్నిన వ్యక్తిని యూఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి దగ్గర సామూహిక హత్యలకు సంబంధించిన ప్రణాళిక, మ్యానిఫెస్టో తో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పాకిస్తాన్ వలసదారుడని, డెలావర్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నాడని తేలింది.
భారీగా ఆయుధాలు..
నవంబర్ 24న అర్థరాత్రి నిమిషాల ముందు నిందితుడు లుక్మాన్ ఖాన్ (25) ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక పార్క్ సమీపంలో నిలిపి ఉంచిన పికప్ ట్రక్కులో అతన్ని గుర్తించారు.
లుక్మన్ ఖాన్ అనుమానస్పదంగా ప్రవర్తించడంతో పోలీసులు వచ్చి తనిఖీ చేయగా కుట్ర బయటపడింది. పోలీసులు వ్యాన్ నుంచి అనేక తుపాకులు, బాడీ ఆర్మర్, ఒక .357 గ్లాక్ పిస్టర్, లోడ్ చేయబడిన 27 రౌండ్ మ్యాగజైన్ లు లభించాయి. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. పిస్టల్ ను సెమీ ఆటోమెటిక్ గా మార్చేపరికరం బిగించి ఉంది.
తన సొంత పాఠశాల క్యాంపస్ ను ఎలా నిర్మూలించాలో, ఆయుధాలు ఎలా ఉపయోగించాలో ప్రణాళికలు రచించిన నోట్ బుక్ ను కూడా పోలీసులు కనుగొన్నారు. నిందితుడి దగ్గర ప్రధాన క్యాంపస్ ఫొటో కూడా ఉంది.
దానిలో ఎక్కడ ప్రవేశించాలి, ఎక్కడ నిష్క్రమించాలో వివరంగా రాసి ఉన్నాయి. ఇందులో అందరిని చంపాలి అనే నినాదాలు రాసి ఉన్నాయి. స్థానిక మీడియా ప్రకారం.. ముందస్తుగా ప్రణాళికలు, స్పష్టమైన యుద్ద పద్దతులను చూపించాయని పోలీసులు తెలిపారు. ఖాన్ పాకిస్తాన్ లో జన్మించాడని, అయితే చిన్నప్పటి నుంచి అమెరికాలో నివసిస్తున్నాడని ఆయనకు అమెరికన్ పౌరసత్వం ఉందని తెలిసింది.
ఎఫ్బీఐలో దాడిలో అతిపెద్ద ఆయుధాగారం..
లుక్మన్ ఖాన్ అరెస్ట్ తరువాత ఎఫ్బీఐ అతని ఇంటిపై దాడి చేసింది. రెడ్ డాట్ స్కోప్ ఉన్న ఏఆర్ రైఫిల్, రెండు గ్లోక్ పిస్టల్ తో ఉన్న అతిపెద్ద ఆయుధాగారం కనుగొన్నారు. ఈ తుపాకీని నిమిషానికి 1200 రౌండ్లు కాల్చగల పూర్తి ఆటోమేటిక్ మెషిన్ గన్ ను కూడా లభించింది. పదకొండు మ్యాగజైన్ లు, పాయింట్ బుల్లెట్లు, బుల్లెట్ ప్రూఫ్ చొక్కా లభించాయి. ఈ ఆయుధాలు ఏవీ కూడా నమోదు కాలేదు.
చుట్టుపక్కల వారితో పోలీసులు మాట్లాడగా.. ఖాన్ ఒకప్పుడు అందరితోనూ స్నేహంగా ఉండేవాడని, కానీ కొన్ని నెలలుగా చిత్రంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. ఒంటరిగా ఉంటున్నాడు. ఇప్పటి వరకూ ఒకసారి కూడా అరెస్ట్ కాలేదు.
మెషిన్ గన్ అక్రమంగా..
ప్రస్తుతం ఖాన్ పై మెషిన్ గన్ అక్రమంగా తీసుకున్న దానిపై కేసు నమోదు చేశారు. మిగిలిన వాటిపై ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ సంఘటన చాలా భిన్నంగా ముగిసేదని, కానీ ఏదో కాకతాళీయంగా అనుమానితుడు దొరికాడని పోలీసులు తెలిపారు. పార్క్ మూసివేస్తారని చెప్పడానికి పోలీసులు వెళ్లగా ఈ కుట్ర మొత్తం బయటపడింది.
Next Story

