అమెరికా అణు పరీక్షలు నిర్వహిస్తుంది: ట్రంప్
x
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

అమెరికా అణు పరీక్షలు నిర్వహిస్తుంది: ట్రంప్

భూగర్భ పరీక్షల ప్రశ్నలకు సమాధానాలు దాటవేసిన అమెరికా అధ్యక్షుడు, స్పందించిన రష్యా


అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలు తమ మధ్య కుదుర్చుకున్న ఒప్పందాల నుంచి క్రమంగా వైదొలుగుతూ ప్రపంచ భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అణు పరీక్షలు పున: ప్రారంభిస్తుందని ప్రకటించారు.

కోల్డ్ వార్ సమయంలో యూఎస్ఏ నిర్వహించిన భూగర్భ అణు పరీక్షలు కూడా ఉంటాయాన అనే ప్రశ్నలపై సమాధానం మాత్రం ఇవ్వకుండా తెలివిగా తప్పించుకున్నారు.

అణు పరీక్షలు..
‘‘మీరు అతి త్వరలో కొత్త విషయం చూస్తారు. మేము ఒక పరీక్ష చేయబోతున్నాము’’ అని ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ లో విలేకరుల సమావేశంలో చెప్పారు. భూగర్భ పరీక్షల గురించి అడిగినప్పుడూ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
‘‘ఇతర దేశాలు కూడా చేస్తున్నాయి. వాళ్లు అలా చేస్తే, మేము కూడా అదే చేస్తాము’’ అని ఆయన వివరించారు. దీనికి తదుపరి ప్రశ్నలకు అనుమతి ఇవ్వలేదు. దాదాపు 33 సంవత్సరాల విరామం తరువాత అమెరికా తిరిగి అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఈ చర్యను అణ్వాయుధ ప్రత్యర్థులు చైనా, రష్యాలకు హెచ్చరిక సంకేతంగా భావిస్తున్నారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో దక్షిణ కొరియాలో వాణిజ్య చర్చలు జరిపిన ట్రంప్.. తరువాత మెరైన్ వన్ లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎవరూ ఊహించని ప్రకటన అమెరికా సోషల్ మీడియా ద్వారా వచ్చింది.
అణు రంగంలో అగ్ర రాజ్యాలదే ఆధిపత్యం..
ప్రపంచంలోనే ఏ దేశంలో లేని అణ్వాయుధాలు తమ దగ్గర ఉన్నాయని ట్రంప్ చెబుతున్నారు. తన మొదటి పదవీకాలంలోనే అణ్వాయుధాలు పూర్తిగా ఆధునీకరించామని చెప్పారు.
‘‘యూఎస్ఏ వద్ద ఇతర దేశాల కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి. నా మొదటి పదవీకాలంలో ఇది సాధించాము. ఇంకా అణ్వాయుధాల పునరుద్దరణ, నవీకరణ జరుగుతోంది’’ అన్నారు.
అపారకరమైన విధ్వంసక శక్తి కారణంగా నేను అణ్వాయుధ పరీక్షలు చేయడానికి ఇష్టపడను. కానీ నాకు వేరే మార్గం కనిపించడం లేదు. రష్యా ప్రస్తుతం మా తరువాత రెండో స్థానంలో ఉంది. చైనా మూడో స్థానంలో ఉంది. కానీ ఆ దేశం ఐదు సంవత్సరాల లోపు సమానంగా ఉంటుందని ట్రంప్ అన్నారు.
నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన అణు పేలుడు పరీక్షను ప్రస్తావిస్తున్నారా? లేదా అనేది స్పష్టంగా తెలియరావడం లేదు.
అణు వార్ హెడ్ పరీక్షపై గందరగోళం..
1990 లలో చివరిగా పరీక్షలు నిర్వహించిన రష్యా- చైనాతో సమానంగా వాషింగ్టన్ అణు వార్ హెడ్ పరీక్షను తిరిగి ప్రారంభిస్తుందని ట్రంప్ చేసిన ప్రకటన తరువాత అమెరికా ప్రభుత్వం ఇంటా, బయట తీవ్ర గందరగోళానికి దారితీశాయి.
అమెరికా సైన్యం అణ్వాయుధ సామర్థ్య క్షిపణుల విమాన పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహిస్తుండగా, 1992 నుంచి అది ఒక్క వార్ హెడ్ ను కూడా ప్రయోగించలేదు.
యూఎస్ఏ సీటీబీటీ ఒప్పందం సంతకం చేసింది. అయితే దానిని ఇంకా అది ఆమోదించలేదు. కానీ దాని నిబంధనలకు కట్టుబడి ఉంది. ప్రపంచ తాత్కాలిక నిషేధాన్ని ఉల్లంఘించిన ఏకైక దేశం ఉత్తరకొరియా.
రష్యా ఏమంది?
రష్యా కొత్త అణు శక్తితో నడిచే, అణు సామర్థ్యం గల నీటి అడుగున డ్రోన్, కొత్త అణు శక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణులు పరీక్షించినట్లు ప్రకటించిన కొన్ని రోజుల తరువాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అణు పరీక్షలపై అంతర్జాతీయ నిషేధాన్ని తాము పాటిస్తున్నామని మాస్కో ప్రకటించింది.
అయితే అమెరికా పరీక్షలను తిరిగి ప్రారంభిస్తే రష్యా కూడా దానిని అనుసరిస్తుందని హెచ్చరించింది. ఈ ప్రకటనతో మరోసారి కోల్డ్ వార్ తరహ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉంది.
అమెరికా అణ్వాయుధాలను పర్యవేక్షించే సైనిక కమాండర్, ట్రంప్ నామిని అయిన వైస్ అడ్మిరల్ రిచర్డ్ కొరెల్ మాట్లాడుతూ.. ట్రంప్ వ్యాఖ్యలు తాను అర్థం చేసుకోలేనని అన్నారు.
అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. అణు నిరోధకతను కొనసాగించడానికి ఈ చర్య చాలా బాధ్యాతయుమైన చర్యగా అభివర్ణించారు. దీనికి సంబంధించి పెంటగాన్ తో సమన్వయం చేసుకుంటుందని అన్నారు.
Read More
Next Story