భారత్ పై 500 శాతం సుంకాలు విధించబోతున్న అమెరికా
x
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

భారత్ పై 500 శాతం సుంకాలు విధించబోతున్న అమెరికా

రష్యా నుంచి ఆయిల్ కోనుగోలు చేయడమే ప్రధాన కారణం, బిల్లు రూపొందించిన అమెరికా, వచ్చే వారం సెనెట్ లో ఓటింగ్


రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్నందున భారత్ పై 500 శాతం సుంకాలు విధించాలని అమెరికా భావిస్తోంది. ‘ద్వైపాక్షిక ఆంక్షల బిల్లు’ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించిన తరువాత జరిమానా విధించడానికి వీలు కల్పించింది.

ఈ అంశంతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా దిగుమతులపై అమెరికా సుంకాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇది వచ్చే వారం ప్రారంభంలో 500 శాతం వరకూ ఉండవచ్చు.

రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహం ఎక్స్ లో ఈ మేరకు ట్వీట్ చేశారు. బుధవారం జరిగిన ఉత్పాదక సమావేశం తరువాత రష్యా నుంచి యురేనియం కొనుగోలు చేసే దేశాలను కూడా నిషేధించే చట్టాన్ని అధ్యక్షుడు ఆమోదించారని వచ్చే వారం ప్రారంభంలో దీనిపై ఓటింగ్ జరగవచ్చని అన్నారు.
నెలల తరబడి పనిలో ఉన్న రష్యా ఆంక్షల బిల్లుకు అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన అన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడితో ప్రారంభమైన యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ పరిపాలన ఒప్పందం పై చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ కఠినమైన ఆంక్షల ప్యాకేజీ ప్రధానంగా మాస్కోను ఆర్థికంగా కుంగదీసేందుకు ఉద్దేశించబడింది.
రష్యా వాణిజ్యమే లక్ష్యం..
ట్రంప్ బిల్లును అంగీకరించారని గ్రాహం గతంలోనే చెప్పారు. కానీ ఇది కొన్ని అడ్డంకులు ఎదుర్కొంది. కానీ ప్రస్తుతం అధ్యక్షుడు ఆంక్షల చట్టానికి మద్దతు ఇస్తున్నారని వైట్ హౌజ్ అధికారి బుధవారం వెల్లడించారు.
‘‘ఇది సకాలంలో జరుగుతుంది. ఉక్రెయిన్ శాంతి కోసం రాయితీలు ఇస్తోంది. పుతిన్ తో అంతా మాట్లాడుకున్నారు. అమాయకులను చంపుతూనే ఉన్నారు’’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ప్రస్తావిస్తూ గ్రాహం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ బిల్లుకు గ్రాహంతో పాటు సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటర్ డి క్లాన్ రాసిన బిల్లులో రష్యా నుంచి చమురు, గ్యాస్, యురేనియం, ఇతర వస్తువులు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించడానికి అమెరికాకు అనుమతి ఇస్తుంది. అలా చేయడం వల్ల రష్యా సైనిక చర్యలకు చాలావరకూ నిధుల ప్రవాహం ఆగిపోతుందని అమెరికా భావిస్తోంది.
ఆంక్షల కాలక్రమం..
ఆంక్షల విషయంలో ట్రంప్ కొన్ని సవరణలు ప్రతిపాదించారు. కానీ బుధవారం వైట్ హౌజ్ అధికారి మాట్లాడుతూ.. దీనిపై ఏవైన మార్పులు చేర్పులు చేశారో చెప్పలేదు. ఈ చట్టానికి సెనేట్ లో డజన్ల కొద్ది స్పాన్సర్లు ఉన్నారు.
అలాగే ప్రతినిధుల సంభ ప్రతినిధి బ్రియాన్ ఫిట్జ్ పాట్రిక్ రూపొందించిన మరొక బిల్లు కూడా ఉంది. ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ ఉంటుందని గ్రాహం చెప్పారు. అయితే ఇది ఎంతవరకూ జరుగుతుందో అస్పష్టంగా ఉంది.
హౌజ్ దీనిని ఆమోదిస్తే ప్రస్తుతం పరిశీలిస్తున్న స్కేల్ బ్యాక్డ్ ప్రభుత్వ నిధుల ప్యాకేజీని వచ్చేవారం సెనేట్ చేపట్టనుంది. తరువాత వారం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డేకి సెనెట్ కు సెలవు ఉంటుంది.
ఉక్రెయిన్ లో యుద్దాన్ని ముగించడానికి ట్రంప్ పరిపాలన ప్రస్తుతం ఒక శాంతి ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు దాదాపు నాలుగు సంవత్సరాలు అయింది. ప్రత్యేక రాయబారీ స్టీవ్ విట్ కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ అమెరికా అధ్యక్షుడి ప్రధాన సలహదారులుగా ఉన్నారు.
Read More
Next Story