75 దేశాల నుంచి వలస అప్లికేషన్లు స్వీకరించబోము: అమెరికా
x

75 దేశాల నుంచి వలస అప్లికేషన్లు స్వీకరించబోము: అమెరికా

ఈ నెల 21 నుంచి అమల్లోకి రానున్న నిబంధనలు


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2.0 పాలనలో మరోసారి వలస విధానాలపై కఠినంగా ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, పశ్చిమాసియా, తూర్పు ఐరోపాలోని 75 దేశాల నుంచి వచ్చే వీసాల ప్రాసెస్ నిరవధికంగా నిలిపివేయించారు. ఇది ఈ నెల 21 నుంచి అమల్లోకి రానున్నాయి.

అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రభావిత దేశాలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, సోమాలియా, రష్యా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, బ్రెజిల్, నైజీరియా, థాయిలాండ్ దేశాలు ఉన్నాయి.
వలసదారులు ఆర్థికంగా..
అమెరికాకు రావాలనుకునేవారు కచ్చితంగా సంపన్నులై ఉండాలని, ఆర్థికంగా స్వయం సమృద్దిగా ఉండాలని, అమెరికా పన్ను చెల్లింపుదారులపై ఆర్థిక భారం మోపకూడదని విదేశాంగ శాఖ పేర్కొంది.
‘‘వలసదారులు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఉండాలని, అమెరికన్లకు ఆర్థికంగా భారంగా ఉండకూడదని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ప్రమాదకర దేశాల నుంచి వలస వచ్చిన వారు యూఎస్ లో అమలు చేసే సంక్షేమాన్ని ఉపయోగించకుండా చూసుకోవడానికి విదేశాంగ శాఖ అన్ని విధానాలు, నిబంధనలు, మార్గదర్శకాలను పూర్తిగా సమీక్షిస్తోంది’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.
జాబితాలో పేర్కొన్న దేశాల నుంచి వలస దరఖాస్తుదారులు వీసా అప్లికేషన్లు సమర్పించవచ్చు. ఇంటర్వ్యూలకు హజరు కావచ్చు. డిపార్ట్ మెంట్ అపాయింట్ మెంట్ ల కోసం దరఖాస్తుదారులను షెడ్యూల్ చేస్తునే ఉంటుంది. కానీ ఈ సమయంలో వారికి వీసాలు మాత్రం రావు’’ అని పేర్కొంది.
పర్యాటక వీసాలు ఇస్తాం..
నిషేధిత జాబితాలో లేని దేశాల పాస్ పోర్టుతో దరఖాస్తు చేసుకుంటే ద్వంద్వ జాతీయులకు వీసాలు జారీ చేస్తారు. అమెరికా ప్రజల నుంచి సంపదను స్వీకరించే వలసదారులు, అమెరికా వలస వ్యవస్థను దుర్వినియోగం చేయడాన్ని ట్రంప్ పరిపాలన అంతం చేస్తుంది’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ తెలిపారు.
‘‘ఈ 75 దేశాల నుంచి వలస వీసా ప్రాసెసింగ్ నిలిపివేయబడుతుంది. అయితే సంక్షేమం, ప్రజా ప్రయోజనాలను పొందే విదేశీ పౌరుల ప్రవేశాన్ని నిరోధించడానికి విదేశాంగ శాఖ ఇమ్మిగ్రేషన్ ప్రాసెసింగ్ విధానాలను తిరిగి అంచనా వేస్తుంది’’ అని జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.
వలసలు నిరోధించడమే..
ట్రంప్ అధ్యక్షుడయ్యాక యూరప్ కాకుండా ఇతర దేశాల నుంచి వలసలు రావడానికి వీలులేదని సంకేతాలిచ్చారు. స్కాండినేవియన్ దేశాల నుంచి వలస వచ్చినవారికి ప్రాధాన్యత ఇస్తూనే, సోమాలీలను చెత్తగా, వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్లాలని ఆయన గతంలోనే హెచ్చరించారు.
ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లక్ష కంటే ఎక్కువ వీసాలు రద్దు చేశారు. ఇది ఒక సంవత్సర వ్యవధిలో నమోదైన అత్యధిక సంఖ్య అని అమెరికా విదేశాంగ శాఖ సోమవారం తెలిపింది.
గత నెలలో ట్రంప్ పరిపాలన ఆరు లక్షలకు పైగా వ్యక్తులను బహిష్కరించిందని పేర్కొంది. వీరే కాకుండా మరో 2.5 మిలియన్ల మంది స్వచ్చందంగా దేశం విడిచి వెళ్లారని హోంల్యాండ్ సెక్యురిటీ విభాగం పేర్కొంది.
Read More
Next Story